'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్ | Baby John Taster Cut: Varun Dhawan, Keerthy Suresh Movie | Sakshi
Sakshi News home page

Baby John Teaser: హిందీలో రిలీజ్‌కి రెడీ.. పవన్ ఎప్పుడు పూర్తి చేస్తాడో?

Published Mon, Nov 4 2024 11:34 AM | Last Updated on Mon, Nov 4 2024 12:11 PM

Baby John Taster Cut: Varun Dhawan, Keerthy Suresh Movie

తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

ఒరిజినల్‌లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.

డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్‌లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.

(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement