Theri
-
ఆ రీమేక్ ఆగిపోయింది!
తమిళనాట ఘనవిజయం సాధించిన తేరి సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమాలో తెరకెక్కించేందుకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్.. తేరి రీమేక్‌ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మైత్రీ బ్యానర్లో రవితేజ హీరోగా రూపొందిన అమర్ అక్బర్ ఆంటొని డిజాస్టర్ కావటంతో తేరి రీమేక్ విషయంలో ఆలోచనలో పడ్డారట. తేరి రీమేక్‌ను పక్కన పెట్టి కొత్త స్క్రిప్ట్‌ను వెతికే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
న్యూయార్క్‌లో..
తమిళసినిమా: మన హీరోయిన్లు ఆ ఊ అంటే విదేశాలకు చెక్కేస్తున్నారు. అదే మంటే అక్కడ కరాటే నేర్చుకుంటున్నాను. డాన్స్‌లో శిక్షణ పొందుతున్నాను అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్రం చేస్తున్నారు. ఆ మధ్య నటి తమన్నా, అమలాపాల్ లాంటి కొందరు ఇలానే చేశారు. తాజాగా నేనేం తక్కువా అన్నట్టు నటి క్యాథరిన్ ట్రెసా బయలుదేరింది. అవకాశం ఇవ్వాలే గానీ అందాలారబోతలో తన తడాకా చూపిస్తాననే ఈ బ్యూటీ ఇటీవల కలగప్పు–2 చిత్రంలో అలానే అందాలను సిల్వర్‌స్క్రీన్‌పై పరిచేసింది. అలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్నా, అవకాశాలు అడపాదడపానే వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రం వరించింది. తమిళంలో విజయ్ హీరోగా నటించిన తెరి చిత్రం తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ కానుంది. ఇందులో ఒక హీరోయిన్గా క్యాథరిన్ ట్రెసా నటించనుందట. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ అమ్మడు అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఉందట. అక్కడ డాన్స్‌లో శిక్షణ పొందుతోంది. ఆ ఫొటోను ఇంటర్నెట్లో విడుదల చేసింది. దీని గురించి క్యాథరిన్ ట్రెసా తానిప్పుడు అమెరికాలో ఉన్నానని, అక్కడ న్యూయార్క్, బ్రాడ్వేలోని బాబింగ్ లాగింగ్ అనే డాన్స్ స్కూల్లో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొంది. మిస్లీ అనే ప్రముఖ శిక్షకురాలు క్యాథరిన్ ట్రెసాకు డాన్స్‌లో శిక్షణ ఇస్తోందట. అక్కడ రెండు వారాల డాన్స్ శిక్షణను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి రానుందట. ఈ శిక్షణతో ప్రత్యేక డాన్స్ మూమెంట్స్‌ను తాను ప్రదర్శించగలనని క్యాథరిన్ ట్రెసా అంటోంది. -
తల్లి కల నెరవేర్చిన తనయ
బేబీ మీనాని అంత సులువుగా మరచిపోలేం. బొద్దుగా, ముద్దుగా అందర్నీ ఆకట్టుకున్న మీనా కథానాయికగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు నైనిక... డాటరాఫ్ మీనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందర్నీ ఆకట్టుకుంది. దాంతో మీనా తెగ ఆనందపడిపోతున్నారు. ఆ ఆనందం రెట్టింపు అయ్యేలా నైనిక తన తల్లి కల నెరవేర్చింది. సౌత్‌లో ఎందరో హీరోలు, దర్శకులతో పని చేసిన మీనాకి తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు సిద్దిఖీతో పనిచేయాలని చిరకాల కోరిక అట. ఆ కల నెరవేరలేదు. అయితే కూతురి రూపంలో ఆ కల నెరవేరింది. ఈ విషయాన్ని ఇటీవల మీనా స్వయంగా తెలిపారు. ‘‘విజయ్ హీరోగా దర్శకుడు సిద్దిఖీ గతంలో ‘ఫ్రెండ్స్’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో విజయ్‌కి జోడీగా చేయమని దర్శకుడు నన్ను సంప్రదించారు. బిజీ షెడ్యూల్ వల్ల అప్పుడు కుదరలేదు. నా కూతురు నైనిక విజయ్ ‘తెరి’ సినిమాలో నటించి, అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా సిద్దిఖీ దర్శకత్వం వహిస్తోన్న ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ చిత్రంలో నైనిక నటిస్తోంది. విజయ్, సిద్దిఖీలతో పనిచేయాలనే నా కల నెరవేరలేదు. కానీ, నైనిక నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మీనా. -
పవన్.. ఆ సినిమా చేస్తాడా..?
ఈ శుక్రవారం కాటమరాయుడుగా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు మరో రీమేక్ చేసేందుకు పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాను కందరీగ, రభస సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అయితే తేరి సినిమా పోలీస్ పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన సినిమాను పవన్ రీమేక్ చేసే సాహసం చేస్తాడా..? అన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం పవన్ చేసిన కాటమరాయుడు కూడా రీమేక్ సినిమానే. అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం సినిమాకు రీమేక్ ఇది. వీరం కూడా తెలుగు వీరుడొక్కడే పేరుతో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాను రీమేక్ చేసిన పవన్, మరోసారి తేరి సినిమా రీమేక్ లోనూ నటిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తేరీ రీమేక్‌పై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. -
చైతూ ఏడ్చేశాడు...
అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టనున్న పెద్ద కోడలిగా ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు సమంత. చైతూతో ప్రేమ, పెళ్లి... ఈ సంవత్సరమంతా ఈ కబుర్లతోనే సమంత గడిపేశారా అంటే కాదు. ఐదు సినిమాలతో సందడి చేశారు. కొత్త ఏడాదిలో మరో ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఈ ఏడాది మంచి సంతోషాన్ని ఇచ్చిందంటున్న సమంత చెబుతున్న సంగతులు... ⇔ ‘ఏ మాయ చేసావే’ విడుదలై ఆరేళ్లు అవుతోంది. ఇటీవల ‘సమంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఏది?’ అనే పోల్ పెడితే.. ‘ఏ మాయ చేసావే’లో జెస్సీ క్యారెక్టర్‌కి టాప్ ప్లేస్ వచ్చింది. ప్రేక్షకుల తీర్పుని ప్రశంసగా స్వీకరించాలో? అవమానంగా భావించాలో? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే... మొదటి సినిమా తర్వాత మళ్లీ నేను అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదా? ఏంటి? అని ఆలోచించా. నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. జెస్సీని మర్చిపోయేలా కొత్త సినిమాల్లో మంచి నటన కనబరచాలని నిర్ణయించుకున్నా. ‘హాయ్... అక్కినేని సమంత’ – పలువురి పలకరింపు ఈ విధంగానే ఉంది. నేనింకా అక్కినేని సమంత కాలేదు. కానీ, వాళ్లందరికీ థ్యాంక్స్. ⇔ ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), ‘24’, ‘బ్రహ్మోత్సవం’, ‘అ... ఆ’, ‘జనతా గ్యారేజ్’... ఈ ఏడాది చేసిన సినిమాలన్నీ సంతోషాన్ని అందించాయి. ముఖ్యంగా ‘తెరి’లో నేను మరణించే సన్నివేశం గురించి దర్శకుడు అట్లీ చెప్పగానే... అందర్నీ ఏడిపించేలా నటిస్తానని చెప్పా. ఒకవేళ ఆ సన్నివేశంలో నిజంగా నేను ఉంటే ఏం చేస్తానని ఆలోచించి నటించా. థియేటర్‌కి ఫ్రెండ్స్‌తో వెళ్లినప్పుడు ఆ సీన్ రాగానే... నేను అందర్నీ చూస్తున్నా. నా పక్కనే కూర్చున్న చైతూ కూడా ఏడ్చేశాడు. అది చూసి, నా కృషి ఫలించిందని సంతోషపడ్డా. ⇔ ప్రతి సినిమాలోనూ నేను అందంగా కనబడుతున్నానంటే కారణం మంచి మేకప్, సినిమాటోగ్రఫీనే. నిజమే.. ఇది మీరు నమ్మి తీరాల్సిందే. ⇔ నా అభిమాన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయనతో ఛాన్స్ ఓసారి వచ్చినట్లే వచ్చి చేజారింది. మళ్లీ మణిరత్నం సినిమాలో అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం మణిరత్నం సినిమాలో నటించడమే నాకున్న డ్రీమ్. ఎక్కువగా ఫలానా దర్శకుడితో పని చేయాలని కలగంటాను. ఫలానా హీరోతో నటించాలనే డ్రీమ్స్ ఏవీ లేవు. ⇔ ‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఎప్పుడు నటిస్తారు?’ అనే ప్రశ్న ఈమధ్య ఎదురవుతోంది. థియేటర్లో నేను ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటానో! అటువంటి మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నా. అంతే గానీ.. హీరోయిన్ ఓరియెంటెడ్ కథల వెనుక పరుగులు తీయడం, ప్రయత్నించడం చేయను. ⇔ ఇప్పుడు ఐదు సినిమాలకు సంతకం చేశా. కొత్త ఏడాదిలో విడుద లయ్యే ఆ సినిమాలన్నీ మంచి కథలే. మంచి పాత్రల్లో కనిపిస్తా. ⇔ ‘సమంత’ సౌండింగ్ రొమాంటిక్‌గా ఉందంటూ ఓ అభిమాని చెప్పాడు. అంతకు ముందెన్నడూ నా పేరు రొమాంటిక్‌గా ఉందనే మాట నేను వినలేదు. ఈ విషయం అమ్మకు చెప్పాలి! -
అదే నా విజయ రహస్యం
విజయం అందుకోవడం అంత సులభం కాదు. దాన్ని పొందగలిగితే ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు అన్నిటికీ మించి ఆనందం కలుగుతాయి. అయితే విజయం ఎండమావిగా దోబూచులాడుతున్న వారు దాన్ని సాధించడం ఎలా అని మదన పడుతుంటారు. అలాంటి వారికి నటి సమంత చెప్పిన బదులేమిటో చూద్దాం. ఆదిలో చాలా మందిలాగా సక్సెస్ కోసం పోరాడిన సమంతకు తొలుత విజయానందాన్ని అందించిన చిత్రం ఏమాయ చేసావే. అది తెలుగు చిత్రం. అలా అక్కడ వరుస విజయాలను సొంతం చేసుకున్నా తమిళంలో విజయం కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. నిరంతర పోరాటం తరువాత కత్తి చిత్రంతో ఎట్టకేలకు కోలీవుడ్‌లోనూ తొలి విజయాన్ని అందుకున్నారు. ఇటీవల తెరి, 24 చిత్రాలతో వరుసగా సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న సమంత తమిళం, తెలుగు అంటూ బిజీబిజీగా నటించి అలసి పోయారట. ప్రస్తుతం చిన్న విరామం తీసుకుని విదేశాలు చుట్టి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల అభిమానులతో ఆన్ లైన్లో చిట్‌చాట్ చేసిన సమంత వారితో బోలెడు విషయాలను షేర్చేసుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం. విజయ్‌తో నటించిన తెరి, సూర్యకు జంటగా నటించిన 24 చిత్రాల విజయాలు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఇలానే వరుసగా విజయాలు అందాలని ఆశిస్తున్నాను. మీకో విషయం చెప్పనా నాకు పోటీ అంటే చాలా ఇష్టం. పోటీ ఉంటేనే నాలో ఉద్వేగం పెరుగుతుంది. అయితే నేను పోటీ పడే వారిని తరుచూ మారుస్తుంటాను. అందుకే వారి పేర్లను చెప్పను. ఇక నా విజయ రహస్యం గురించి చాలా మంది అడుగుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కఠిన శ్రమే నా విజయానికి కారణం. యువతకు నేను చెప్పేదొక్కటే కలలు కనండి. సవాళ్లను ఎరుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగండి అంటూ అభిమానుల పలు ప్రశ్నలకు చిరునవ్వుతోనే బదులిచ్చిన ఈ చెన్నై చిన్నది ఎన్నికల గురించి స్పందించమన్నప్పుడు అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి -
క్రేజున్నోడు..!
కొత్త సినిమా గురూ! సీన్ ఓపెన్ చేస్తే... హీరో ఎలాంటి గొడవల జోలికి వెళ్లని నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు. అప్పటివరకూ సాధారణ వ్యక్తిగా కనిపించిన హీరో సడన్‌గా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సూపర్ హీరోగా మారతాడు. తన ఫ్యామిలీ జోలికి వచ్చిన వాళ్లను తుక్కుతుక్కుగా చితక్కొడతాడు. హీరో రెండో కోణాన్ని ఆవిష్కరించేదే సెకండాఫ్. ఇలాంటి కథలకు ఆజ్యం పోసిన చిత్రం ‘బాషా’. తాజాగా తెర మీదకొచ్చిన తమిళ ‘తెరి’ అటూ ఇటూగా ఈ బాపతుకి చెందిన సినిమానే. విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘బాషా’ పోలికలతో ఉన్న లైన్‌ను తీసుకుని విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అట్లీ తీసిన ఈ చిత్రం తెలుగులోకి ‘పోలీస్’గా విడుదలైంది. నిర్మాత ‘దిల్’ రాజు, ‘ఘర్షణ’ ఫేమ్ కలైపులి.ఎస్ థాను ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కథ ఏంటంటే... కేరళలోని ఓ మారుమూల గ్రామంలో బేకరి నడిపే జోసఫ్ కురువెల్లా (విజయ్) తన కూతురు నివేదిత (నైనిక)తో కలిసి హాయిగా లైఫ్‌ను గడుపుతూ ఉంటాడు. నివేదిత టీచర్ యాని (అమీ జాక్సన్) అతన్ని ప్రేమిస్తుంది. ఓ రోజు యానీతో కలిసి నివీ బైక్ మీద స్కూల్‌కు వెళుతున్న సమయంలో అక్కడి లోకల్ రౌడీలు తమ కారుతో డ్యాష్ ఇస్తారు. దాంతో యానీ వాళ్లందరి మీద పోలీసుల మీద కంప్లయింట్ ఇస్తుంది. ఎఫ్ఐఆర్లో నివీ పేరు కూడా ఉండటంతో గొడవ లన్నిటికీ దూరంగా ఉండే జోసఫ్ ఫిర్యాదు వెనక్కి తీసుకుంటాడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో జోసఫ్‌ను గుర్తుపట్టి మీరు పోలీసా? అని అడగడంతో యానీకి జోసఫ్ మీద డౌట్ వస్తుంది. అతని గురించి గూగుల్‌లో సెర్చ్ చేయగానే అతనో పోలీసాఫీసర్ అని యానీకి తెలుస్తుంది. అదే సమయంలో రౌడీలు జోసఫ్ ఇంటికి వచ్చి అతన్ని ఇష్టమొచ్చినట్లు కొడుతూ ఉంటారు. అప్పటివరకూ దెబ్బలు తిన్న జోసఫ్ తన కూతురును కూడా చంపేయబోతుంటే వాళ్లకు ఎదురుతిరిగి చితక్కొడతాడు. అప్పుడే జోసఫ్ ఇంటికి వచ్చిన యానీకి తన గతం గురించి చెప్పుకొస్తాడు జోసఫ్. సిటీ లో డిప్యూటీ కమిషన ర్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ (విజయ్) అంటే రౌడీలకు హడల్. మిత్ర (సమంత)ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. ఓ అమ్మాయి అత్యాచార కేసును పరిష్కరించే క్రమంలో ఓ మంత్రి కొడుకును ఎన్కౌంటర్ చేస్తాడు విజయ్. దాంతో ఆ మంత్రి పగబడతాడు. విజయ్, మిత్రలకు పుట్టిన అమ్మాయే నివేదిత. మంత్రి తన అనుచరులతో వచ్చి, మిత్ర, విజయ్ తల్లిని చంపేస్తారు. విజయ్ను కూడా చంపేయడానికి ప్రయత్నిస్తారు. అయితే విజయ్ తన కూతురితో తప్పించుకుంటాడు. మిత్ర చనిపోతున్న సమయంలో పోలీస్ ఉద్యోగం వదిలే సి, ఓ మంచి తండ్రిగా నివేదితను పెంచాలని చెప్పడంతో విజయ్ అజ్ఞాతంలోకి వెళిపోతాడు. ప్రజలకు విజయ్ చనిపోయినట్టే లెక్క. కానీ, కాలక్రమంలో ఆ మంత్రికి విజయ్ బతికే ఉన్నాడని తెలుసుకుని నివేదిత వెళుతున్న స్కూల్ బస్‌కు ప్రమాదం జరిగేలా చేస్తాడు. విలన్ ఇన్నేళ్ల తర్వాత కూడా తన కూతురినే టచ్ చేయాలని ప్రయత్నించడంతో, ఇక అప్పుడు సిటీలోకి విజయ్ ఎంటరవుతాడు... ఆ తర్వాత విలన్లతో ఎలా ఆడుకున్నాడన్నదే మిగతా కథ. ‘కత్తి’ తర్వాత రెండోసారి జతకట్టిన విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ, వాళ్లిద్దరి రొమాన్స్ గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. మీనా కూతురు నివేదిత నటన ముచ్చటగా ఉంది. కొన్ని సన్నివేశాలు ‘అరె ఎక్కడో చూశామే’ అన్న భావం కలిగించినా అట్లీ తన టేకింగ్‌తో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. ప్రచార చిత్రం, టీజర్లలో కనిపించిన కొత్తదనాన్ని సినిమాలోనూ ఆశిస్తే నిరాశే మిగులుతుంది. అయితే సక్సెస్ఫుల్ ఫార్ములా కాబట్టి, కొత్త సీసాలో పాత నీరు అయినా ఓకే అనొచ్చు! -
రజనీ సినిమాల తర్వాత అదే టాప్
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'తేరి' సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు ఏకంగా రూ. 1.67 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు అక్కడ తమిళంలో విడుదలైన సినిమాల్లో రజనీకాంత్ నటించిన రోబో, లింగా సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'తేరి' నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త సంవత్సరానికి సరైన బహుమతి అవుతుందని ఈ సినిమాకు ఉత్తర అమెరికా పంపిణీదారులు సినీగెలాక్సీ చెబుతోంది. అట్లీ దర్శకత్వం వహించిన తేరి సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైంది. అమెరికాలో బుధవారమే ప్రీమియర్లను తాకింది. బుధవారం నాటి ప్రీమియర్ షోలోనే ఇది రూ. 1.67 కోట్లు వసూలు చేసినట్లు సినీ గెలాక్సీ ప్రతినిధులు చెప్పారు. ఓ మాజీ పోలీసు అధికారికి, అతడి కూతురికి మధ్య సంబంధం గురించి చెప్పే ఈ సినిమాలో సమంత, అమీజాక్సన్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. -
తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పేస్తోంది!
హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా చేయని సాహసం ఓ బాలనటి చేస్తోంది. తన తొలి సినిమాకే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ తేరి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో బాలనటిగా నటించిన నైనిక డబ్బింగ్ చెపుతున్న ఫోటోనూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చిత్ర దర్శకుడు అట్లీ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ముద్దుల కూతురే నైనిక. మీనా కూడా బాలనటిగా తెరకు పరిచయం అందరినీ ఆకట్టుకుంది.అదే తరహాలో మీనా కూతురు నైనిక కూడా తొలి సినిమాలో నటనతోనే కాకుండా తానే డబ్బింగ్ కూడా చెపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన తేరి ఏప్రిల్ 14న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను పోలీసోడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. Dubbing time with Nainika was the most insteresting stage during post work pic.twitter.com/DpLRt5YZ2j — atlee (@Atlee_dir) 7 April 2016 -
ఎన్టీఆర్ చేతుల మీదుగా విజయ్ సినిమా ఆడియో
ప్రస్తుతం సౌత్ హీరోలు తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. అందుకే తమ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేయటమే కాదు. ఆ సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల ఆడియో రిలీజ్‌ను కూడా ఘనంగా నిర్వహిస్తూ స్టార్ హీరోలను ముఖ్య అతిథిలుగా ఆహ్వానిస్తున్నారు. అదే బాటలో తమిళ హీరో విజయ్ తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోగా ఉన్న విజయ్, చాలా కాలంగా తెలుగునాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. సూర్య, విక్రమ్‌లతో పాటు కార్తీ లాంటి యంగ్ హీరోలు కూడా టాలీవుడ్లో హవా చూపిస్తుంటే విజయ్ మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా తేరిని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తేరి సినిమాను తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నాడు. తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. ఇక ఆడియో రిలీజ్‌ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఈ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భావిస్తోంది. విజయ్, సమంతలతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ ఆడియో వేడకలో పాల్గొంటే సినిమాకు మరింత ప్రచారం లభిస్తుందని దిల్‌రాజు ప్లాన్. -
'ఆ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది'
చెన్నై: తమిళనాట సూపర్ స్టార్ విజయ్ నటించిన తెరి చిత్రంలో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఏప్రిల్ 14న విడుదల అవుతున్న ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులు దిల్ రాజు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరి చిత్రంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా విజయ్, హీరోయిన్లుగా సమంత, అమీ జాక్సన్ నటించారు. 'తెలుగులో తుపాకీ చిత్రంతో విజయ్ నిరూపించుకున్నాడు. ఇక అట్లీ రాజా రాణి చిత్రంతో గుర్తింపు సాధించారు. ఈ సినిమా తెలుగులో విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి తెలుగులో విన్నర్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. -
సాయికి షాకిచ్చిన విజయ్
పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్‌కు ఓ తమిళ స్టార్ హీరో షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి డైరెక్షన్లో సుప్రీమ్ సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమా తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు విన్నర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే సాయి అనుకున్న టైటిల్‌ను ముందుగానే తన సినిమా డబ్బింగ్ వర్షన్‌కు ఎనౌన్స్ చేశాడు తమిళ స్టార్ హీరో విజయ్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తేరి సినిమా చేసిన విజయ్, ఆ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా అనువాద హక్కులు సొంతం చేసుకోవటంతో తెలుగులో కూడా తేరి సినిమా భారీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తేరి సినిమా తెలుగు వర్షన్‌కు విన్నర్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికే ఈ టైటిల్ మీద ఆశపడుతున్న సాయి, దిల్ రాజు కోసం తన టైటిల్‌ను త్యాగం చేస్తాడా..? లేక మరోసారి టాలీవుడ్లో టైటిల్ వార్‌కు తెర లేస్తుందా..? చూడాలి. -
అభిమానుల ప్రోత్సాహం మరువలేనిది
ఆరంభకాలం నుంచి అభిమానులందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఇలయదళపతి విజయ్ వ్యాఖ్యానించారు. ఈయన నటించిన 59వ చిత్రం తెరి. ముద్దుగుమ్మలు సమంత, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ దర్శకతలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఆయనకు అర్ధ శత చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. వందలాది మంది విజయ్ అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ మాట్లాడుతూ సాధారణంగా ఇలాంటి వేడుకల్లో సంగీత దర్శకులే హీరోలన్నారు. అయితే హీరో అయిన జీవీ ప్రకాశ్‌కుమార్‌నే ఆ చిత్రానికి సంగీత దర్శకుడు కావడం విశేషంగా పేర్కొన్నారు. జీవీ విర్జిన్ యువత హీరో అని వ్యాఖ్యానించారు. మహేంద్రన్ దర్శకత్వంలో అవకాశం కోసం ఇక దర్శకుల హీరోగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ అన్నారు. ఆయన పేరు చెప్పగానే గుర్తు కొచ్చే చిత్రం ముల్లుమ్ మలరుమ్ అన్నారు. ఉదిరిపూక్కళ్ లాంటి పలు గొప్ప చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ దర్శకత్వంలో నటించే అవకాశం రాదా? అను ఎదురు చూస్తుండగా ఆయనే తన చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. సెల్ఫీ పుళ్ల కుల్ఫీ పుళ్ల ఇందులో ఇద్దరు బ్యూటీఫుల్ హీరోయిన్లు నటించారన్నారు. వారిలో ఒకరు సెల్ఫీ పుళ్ల సమంత కాగా కుల్ఫీ పుళ్ల ఎమీజాక్సన్ మరొకరనీ అన్నారు. వీరిద్దరికీ సమాన పాత్రలని తెలిపారు. ఇకపోతే రాజారాణి వంటి అందమైన ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు అట్లీ తనతో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న వెర్రితో తీసిన చిత్రమే ఈ తెరి అన్నారు.ఆయన చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. పులి లాంటి నిర్మాత మనం టీవీలో డిస్కవరి ఛానల్లో గుంపుగా ఉన్న జింకలో ఒక దానిపై గురి పెట్టిన పులి దాన్ని వెంటాడి చంపి తింటుందన్నారు. ఇక్కడ జింక విజయం అయితే దాన్ని వేటాడి సాధించే పులి నిర్మాత కలైపులి ఎస్.థాను అని వర్ణించారు. అలా విజయం కోసం వేటాడి సాధించే నిర్మాత ఆయనని అన్నారు. అభిమానులు ఉన్నత స్థాయికి ఎదగాలి ఇక తనకు ఆరంభ కాలం నుంచి అండదండగా నిలిచింది అభిమానులేనన్నారు. వారి ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరానన్నారు. తన అభిమానులూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటి మీనా కూతురు నైనిక హైలైట్‌గా నిలిచారు. ఈ చిన్నారి తెరి చిత్రంలో విజయ్ కూతురుగా నటించింది. ఈ చిత్రం ఆడియోనూ తనే ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో నటి ఎమీజాక్సన్, మీనా, జీవీ ప్రకాశ్‌కుమార్,ప్రభు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
సమంత కూడా మైక్ ముందుకు వచ్చింది
ఈ జనరేషన్ హీరోలు హీరోయిన్లు ఏకంగా పాటలు పాడేస్తుంటే తాను వెనకపడిపోతానని ఫీల్ అయ్యినట్టుంది అందాల భామ సమంత. అందుకే మరీ పాటలు పాడేంత టాలెంట్ లేకపోయినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యింది. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత తొలి సినిమా నుంచి తన పాత్రకు చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించుకుంటుంది. ప్రస్తుతం తమిళ్లో విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తున్న తేరి సినిమాతో తొలిసారిగా సొంతం గొంతు వినిపించనుంది ఈ బ్యూటి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తి చేసింది జెస్సీ. తొలిసారిగా డబ్బింగ్ చెప్పడంతో యమా హ్యాపిగా ఉన్న సామ్ తన ఆనందాన్ని ట్విట్టర్లో వెల్లడించింది. సమంత తేరితో పాటు తెలుగులో అ..ఆ.., బ్రహ్మోత్సవం సినిమాల్లోనూ హీరోయిన్గా నటిస్తోంది. Dubbing over #Theri .Thankyou my amazing director @Atlee_dir for a role close to my heart.So much love@Jagadishbliss pic.twitter.com/UtHUDcCB0A — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) February 27, 2016 -
అందుకు కారణం హీరోలే
నటి సమంత లైఫ్ స్టైల్ ఎలాంటిదైనా,ఆమె మాటల్లో వాస్తవాలు ఉట్టి పడతాయి.లేని గొప్పలను తనకు ఆపాదించుకోదీ చెన్నై చిన్నది.నటినవ్వాలన్న ఆసక్తితో తోలి రోజుల్లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని నిర్భయంగా చెప్పే సమంత ఇప్పటి తన ఉన్నతికి తన కృషి,శ్రమ అని చెప్పుకున్న దాఖలాలు లేవు. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ కథానాయికల పట్టికలో చేరిన ఈ చెన్నై చందం తమిళంలో ప్రస్తుతం విజయ్‌తో తెరి, సూర్య సరసన 24 చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో ధనుష్‌కు జంటగా వడచెన్నై చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లోనూ తన క్రేజ్‌ను కొనసాగించుకుంటున్న సమంత ఇటీవల ఒక సాహసాన్ని చేసి తన అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు.100 కిలోల వెయిట్‌ను ఏకంగా మూడుమార్లు పైకి లేపి దీన్ని వీడియో తీసి సోషల్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేశారు. 50 కిలోల బరువు కలిగిన సమంత 100 కిలోల బరువును అవలీలగా ఎత్తడంతో అభిమానులు నివ్వెరపోయారు. దీని గురించి సమంతను అడగ్గా స్త్రీలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అంటూ తనదైన మందహాసంతో బదులిచ్చారు. ఈ బ్యూటీ మాట్లాడుతూ తాను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువతినన్నారు. జీవితంలో ఇంత స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. అయితే ఈ ఉన్నతికి కచ్చితంగా తాను కారణం కాదని అన్నారు. అందుకు కారణం తనతో నటించిన కథానాయకులేనని పేర్కొన్నారు. తమిళం,తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలు తనకు లభించాయన్నారు.ఆ చిత్రాలు విజయాలు సాధించడంతో అభిమానులకు సులభంగా చేరువయ్యానన్నారు.అదే విధంగా తనతో చిత్రాలు చేసిన దర్శకులు తన ఉన్నతికి కారణం అయ్యారని అని అన్నారు.ఇకపై కూడా మంచి కథా పాత్రలు చేస్తూ తన స్థాయిని కాపాడుకోవడానికి పోరాడతానని పేర్కొన్నారు.ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాపైనే నిమగ్నం చేస్తున్నట్లు ముద్దుగుమ్మ సమంత స్పష్టం చేశారు. -
స్టార్ వారసురాలి తెరంగేట్రం
కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ వారసురాలు తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. తమిళ టాప్ హీరో విజయ్ కూతురు దివ్య త్వరలోనే వెండితెర మీద సందడి చేయనుంది. అయితే హీరోయిన్గా మాత్రం కాదు, చైల్డ్ ఆర్టిస్ట్‌గానే. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 59వ సినిమా థేరితో దివ్య బాలనటిగా పరిచయం అవుతోంది. రాజారాణీ ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇప్పటికే విజయ్ 49వ సినిమా వేట్టైకారన్ తో విజయ్ తనయుడు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కూతురు కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఇలయదళపతి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే లడఖ్‌లో జరిగిన షూటింగ్లో విజయ్, దివ్యలు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. విజయ్ సరసన సమంత, అమీజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
విజయ్ వారసురాలు రెడీ
హీరో, హీరోయిన్ల వారసులు చిత్ర రంగ ప్రవేశం చేయడం అన్నది సర్వసాధారణ విషయం. కోలీవుడ్‌లోనే చాలా మంది వారసులు ఇప్పుడు వెలిగిపోతున్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్‌స్టారే తమ వారసులను చిత్ర పరిశ్రమకు అందించారు. తాజాగా ఆ తరువాత తరంలో ప్రముఖ హీరోగా రాణిస్తున్న నటుడు విజయ్ తన వారసులకు ఇప్పటి నుంచే నటనపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ఇంతకు ముందే కొడుకు సంజయ్‌ను తను నటించిన వేట్టైక్కారన్ చిత్రంలో ఒక పాటలో తనతో పాటు ఆడించి చిత్ర రంగానికి పరిచయం చేశారు. తాజాగా తన కూతుర్ని రంగంలోకి తీసుకురావడం విశేషం. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరి చిత్రంలో నటిస్తున్నారు. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇందులో విజయ్ పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముద్దుగుమ్మలు సమంతా, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. నటి మీనా కూతురు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదనపు ఆకర్షణ ఏమిటంటే ఇదే చిత్రంలో విజయ్ కూతురు నటించడం. ఇందులో విజయ్ కూతురు దివ్య ఆయన కూతురిగానే నటించిందని సమాచారం. ఇక మీనా కూతురు చిన్న ఎమీజాక్సన్గా నటించిదట. ఇంకో విషయం ఏమిటంటే నటుడు విజయ్ కూడా చిన్న తనంలోనే నటుడిగా రంగప్రవేశం చేసి ఇప్పుడింతటి స్థాయికి చేరుకున్నారు.పెద్ద అయిన తరువాత ఆయన వారసులు ఏ స్థాయికి చేరుకుంటారో కాలమే నిర్ణయించాలి.