ఎన్టీఆర్ చేతుల మీదుగా విజయ్ సినిమా ఆడియో | NTR To Launch Vijay Theri Audio | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ చేతుల మీదుగా విజయ్ సినిమా ఆడియో

Published Sun, Apr 3 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

ఎన్టీఆర్ చేతుల మీదుగా విజయ్ సినిమా ఆడియో

ఎన్టీఆర్ చేతుల మీదుగా విజయ్ సినిమా ఆడియో

ప్రస్తుతం సౌత్ హీరోలు తమ మార్కెట్ను పెంచుకోవడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. అందుకే తమ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేయటమే కాదు. ఆ సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల ఆడియో రిలీజ్ను కూడా ఘనంగా నిర్వహిస్తూ స్టార్ హీరోలను ముఖ్య అతిథిలుగా ఆహ్వానిస్తున్నారు.

అదే బాటలో తమిళ హీరో విజయ్ తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. కోలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోగా ఉన్న విజయ్, చాలా కాలంగా తెలుగునాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. సూర్య, విక్రమ్లతో పాటు కార్తీ లాంటి యంగ్ హీరోలు కూడా టాలీవుడ్లో హవా చూపిస్తుంటే విజయ్ మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా తేరిని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తేరి సినిమాను తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నాడు. తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. ఇక ఆడియో రిలీజ్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఈ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భావిస్తోంది. విజయ్, సమంతలతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ ఆడియో వేడకలో పాల్గొంటే సినిమాకు మరింత ప్రచారం లభిస్తుందని దిల్రాజు ప్లాన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement