ఆ రీమేక్‌ ఆగిపోయింది! | Mythri Movie Makers Shelves Theri Remake Plans | Sakshi
Sakshi News home page

ఆ రీమేక్‌ ఆగిపోయింది!

Apr 10 2019 4:40 PM | Updated on Apr 10 2019 4:40 PM

Mythri Movie Makers Shelves Theri Remake Plans - Sakshi

తమిళనాట ఘనవిజయం సాధించిన తేరి సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంతోష్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమాలో తెరకెక్కించేందుకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్‌.. తేరి రీమేక్‌ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మైత్రీ బ్యానర్‌లో రవితేజ హీరోగా రూపొందిన అమర్‌ అక్బర్ ఆంటొని డిజాస్టర్ కావటంతో తేరి రీమేక్‌ విషయంలో ఆలోచనలో పడ్డారట. తేరి రీమేక్‌ను పక్కన పెట్టి  కొత్త స్క్రిప్ట్‌ను వెతికే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement