Chiranjeevi Waltair Veerayya 3 Days Box Office Collections Creating Records, Deets Inside - Sakshi
Sakshi News home page

Waltair Veeraya Collections: రికార్డులు సృష్టిస్తోన్న మెగాస్టార్‌.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?

Published Mon, Jan 16 2023 12:18 PM | Last Updated on Mon, Jan 16 2023 12:31 PM

Chiranjeevi Waltair Veeraya Box Office Collections - Sakshi

బాస్‌ వచ్చాడు.. బాక్సాఫీస్‌ బద్ధలు కొడుతున్నాడు. పూనకాలు లోడింగ్‌ కాదు.. రికార్డులు హంటిగ్‌ అన్నట్లుగా కలెక్షన్ల వేట మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేశాడు మెగాస్టార్‌ చిరంజీవి. రికార్డుల్లో నా పేరుండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయన్న మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడు.

చిరంజీవి, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టైటిల్‌కు తగ్గట్టుగా మాస్‌ కంటెంట్‌తో అభిమానులను తెగ అలరిస్తోంది. మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించడంతో సినిమా మరింత సూపర్‌ హిట్టయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన వాల్తేరు వీరయ్య ఇతర స్టార్‌ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లు రాబట్టిందీ చిత్రం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది.

చదవండి: వారం కాకముందే సెంచరీ కొట్టిన వారిసు
మరో అవార్డు దక్కించుకున్న నాటు నాటు, ఉత్తమ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement