Santosh Srinivas
-
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్
-
‘బలరామయ్య బరిలో దిగితే’ ఎలా ఉంటుంది?
నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తొచ్చేది యాక్షన్ సినిమాలు, పవర్ఫుల్ డైలాగులు.. ఆరు పదుల వయసులోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మాస్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. ఏజ్ పెరుగుతున్నకొద్దీ బాలకృష్ణలో ఎనర్జీ కట్టలుగా తెంచుకొస్తుంది. ఓ వైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నా.. మంచి కథలతో తన వద్దకు వచ్చే దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు సినిమాలు చేసేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: బాలకృష్ణ తీరుపై క్లారిటీ ఇచ్చిన హీరో 'కందిరీగ', 'రభస' వంటి చిత్రాలను చేసి, ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్.. బాలకృష్ణతో కలిసి ఓ సినిమా ప్లాన్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే హీరోకు కథ వినిపించడం, ఇందుకు బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విభిన్న కథతో పాటు టైటిక్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలని భావించిన దర్శకుడు ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలో దిగితే’ అనే పేరును కూడా ఖరారు చేస్తున్నట్లు టాక్. వీరి కాంబినేషన్లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. చదవండి: కొడుకుతో మహేష్.. మనవడితో బాలయ్య.. -
సోనూ సూద్ ఎంట్రీ
‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు సోనూ సూద్ సోమవారం షూటింగ్లో ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌కు, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు చక్కని రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు. -
సవాళ్లంటే ఇష్టం
‘‘కొత్త ఏడాది, పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. కాకపోతే కథల ఎంపికలో ఇకపై జాగ్రత్త వహిస్తా. ఏడాదికి ఒకటి రెండు సినిమాలైనా సరే మంచివి చేయాలనుకుంటున్నా. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తా’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘కందిరీగ, రభస’ చిత్రాల ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా నేడు తన పుట్టినరోజుని పురస్కరించుకుని సాయి శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► నా తొలి చిత్రం ‘అల్లుడు శీను’ తర్వాత వినోదంతో కూడిన పాత్ర చేయలేదు. సంతోష్ శ్రీనివాస్ అన్న తెరకెక్కిస్తోన్న చిత్రంలో తొలి సారి పూర్తి స్థాయి వినోదం నిండిన పాత్ర చేస్తున్నా. ఇందులో కాస్త ప్రేమకథ, చివరి 20 నిమిషాలు భావోద్వేగాలుంటాయి. ఈ చిత్రంలో చాలామంది హాస్యనటులున్నారు. దాదాపు రెండు గంటల సేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సన్నివేశాలుంటాయి. నా పాత్ర కొత్తగా ఉంటుంది. వినోదం పండించడం కష్టమే.. కానీ చాలెంజింగ్ పాత్రలు చేయడం చాలా ఇష్టం. ► సంతోష్ అన్న మా బ్యానర్లో తీసిన ‘కందిరీగ, రభస’ చిత్రాల కథలు విన్నా.. ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నా.. చాలా ప్రతిభ ఉన్న దర్శకుడాయన. ఏ సినిమాకైనా కథే రాజు అని నా ‘రాక్షసుడు’ సినిమా నేర్పింది. పైగా ప్రేక్షకులు చాలా స్మార్ట్ అయ్యారు. అందుకే కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నా. ఇందులో నాది, నభా నటేశ్ పాత్రలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. సంతోష్ శ్రీనివాస్ వర్కింగ్ స్టైల్ నచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌గారితో నాకిది మూడో సినిమా. ఈ చిత్రకథ పెద్దది. అందుకే ఇందులో 4 పాటలు మాత్రమే ఉంటాయి. మార్చి చివరికి షూటింగ్ పూర్తి చేస్తాం. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ► ఇప్పటి వరకూ 7సినిమాలు చేశా. వాటిలో కొత్త దర్శకులతో చేసిన సినిమాలూ ఉన్నాయి. నేనెప్పుడూ పాత, కొత్త దర్శకులకు అందుబాటులో ఉంటా. మంచి కథలు ఉంటే కొత్తవారితో చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నా సినిమా కథలను ముందు మా నాన్నగారు (బెల్లంకొండ సురేశ్) వింటారు.. ఆయనకు నచ్చింది నన్ను వినమంటారు. చివరగా ఇద్దరికీ నచ్చిన కథకి పచ్చజెండా ఊపుతా (నవ్వుతూ). ► నాన్నతో కలిసి నా తమ్ముడు గణేశ్ ప్రొడక్షన్ చూసుకునేవాడు.. రోజూ షూటింగ్స్‌కి వెళ్లేవాడు. అందుకే హీరోగా బాగా నటిస్తున్నాడు.. పైగా మంచి టీమ్ కుదిరింది. ఓ రోజు షూటింగ్‌కి వెళ్లినప్పుడు వాడు నటిస్తున్న భావోద్వేగ సన్నివేశం చూసి కన్నీళ్లొచ్చాయి. నటనలో వాడికి నేనేమీ సలహాలు ఇవ్వలేదు.. వాడే నాకు ఇచ్చేలా ఉన్నాడు (నవ్వుతూ). ► ఈ 2020 కొత్త దశాబ్దానికి ప్రారంభం. ఇప్పటి వరకూ నేను చేసినవి ఒక ఎత్తు.. ఈ పదేళ్లు మరో ఎత్తు. ఇప్పటి నుంచి నా మొదటి సినిమాలా భావిస్తా. యాడ్స్ అవకాశాలొస్తున్నాయి కానీ ప్రస్తుతానికి ఆసక్తి లేదు. నాకు పెళ్లి చేయాలని నాన్నగారు తొందర పెడుతున్నారు.. కానీ, నేను ఒప్పుకోవడం లేదు (నవ్వుతూ). సంతోష్ అన్న సినిమా తర్వాత ‘దిల్’ రాజుగారి బ్యానర్లో ఓ సినిమా చేస్తా. ఆ తర్వాత ఏ సినిమా అంగీకరించలేదు.. కథలు వింటున్నా. -
లవ్ అండ్ యాక్షన్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ఇందులో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నాం. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలో సాయి శ్రీనివాస్ కనిపిస్తాడు. తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డిసెంబర్ 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, దుబాయ్‌లో చిత్రీకరణ జరపనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కందిరీగ’ సినిమా నుంచి సంతోష్ పరిచయం. తనతో పని చేయడం నా కుటుంబ సభ్యులతో చేసినట్టుగా ఉంది. నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సురేష్, పద్మగార్లకి ధన్యవాదాలు. ఏ మాత్రం రాజీ పడకుండా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందిస్తాం’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘సాయిశ్రీనివాస్‌తో పని చేయడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర పోషించనుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నభా నటేష్. ‘‘బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పని చేశాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు కెమెరామేన్ డుడ్లీ. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మాట్లాడారు. -
8 ప్యాక్ శ్రీనివాస్
ఒకరేమో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. మరొకరేమో సంతోష్ శ్రీనివాస్. ఈ ఇద్దరి శ్రీనివాస్‌ల కాంబినేషన్లో ఓ సినిమా షురూ అయింది. ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ, రభస, హైపర్’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందనుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 29న హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. ‘‘బెల్లంకొండ శ్రీనివాస్ కోసం సంతోష్ శ్రీనివాస్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. అందుకోసం 8 ప్యాక్స్‌తో మేకోవర్ అయ్యారు. ‘అల్లుడు శీను, జయజానకి నాయక’ చిత్రాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం అవుతుంది’’ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి ‘సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రాల ఫేమ్ డూడ్లే కెమెరామేన్‌గా పనిచేయబోతున్నారు. -
ఆ రీమేక్ ఆగిపోయింది!
తమిళనాట ఘనవిజయం సాధించిన తేరి సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమాలో తెరకెక్కించేందుకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్.. తేరి రీమేక్‌ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మైత్రీ బ్యానర్లో రవితేజ హీరోగా రూపొందిన అమర్ అక్బర్ ఆంటొని డిజాస్టర్ కావటంతో తేరి రీమేక్ విషయంలో ఆలోచనలో పడ్డారట. తేరి రీమేక్‌ను పక్కన పెట్టి కొత్త స్క్రిప్ట్‌ను వెతికే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
రవితేజ హీరోగా ‘కనకదుర్గ’
ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ టైం ఏమంత బాలేదు. రాజా ది గ్రేట్ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా పడటంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న రవితేజ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన తేరి సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్లో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమాను తెలుగు నేటివిటీ, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, కేథరిన్ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటించనున్నారు. -
మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తా
త్వరలో పెద్ద హీరో సినిమాకు దర్శకత్వం నేను విశాఖ వాసినే ’హైపర్’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ద్వారకానగర్ : తాను పుట్టింది విశాఖలోనేనని, డాబాగార్డెన్సలో తమకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని హైపర్ సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ’హైపర్’ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. సినిమా పరిశ్రమపై మక్కువ, సోదరులు సహకారమే ఈ స్థాయికి చేరానన్నారు. చెన్నైలో అసిస్టెంట్ కెమెరామన్‌గా కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి దర్శకుడిని అయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు కందిరీగ, రభస, హైపర్ సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. ఓ పెద్ద హీరోతో తీసే సినిమాకు త్వరలో దర్శకత్వం వహించనున్నట్టు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. కమర్షియల్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తానన్నారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని, స్నేహితులతో ఎక్కువగా బీచ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ అభిమానంతోనే హైపవర్ సినిమాలో విశాఖపట్నాన్ని ఓ ప్రత్యేక నగరంగా చూపించానని చెప్పారు. ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రతి ఇంట్లో ఒకడుంటాడు!
‘‘రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కి, సినిమాలో క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్లుండే టైటిల్. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ‘హైపర్’గా ఉండేవారు ఒకరుంటారు. అలాంటి కుర్రాడి కథ ఇది’’ అన్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘హైపర్’ టైటిల్ పరిశీలనలో ఉందన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అనేది ఉపశీర్షిక. ఆగస్టు 3న ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘కుటుంబ నేపథ్యంలో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర. -
వైజాగ్‌లో యాక్షన్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘కందిరీగ’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను మంగళవారం వైజాగ్‌లో మొదలుపెట్టబోతున్నాం. ఈ నెల 30 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ‘కందిరీగ’ తర్వాత రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. తప్పకుండా అందర్నీ అలరించేలా ఉంటుంది. రామ్, రాశీఖన్నా జోడీ కనువిందుగా ఉంటుంది. దసరాకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి. -
సంతోష్ శ్రీనివాస్‌తో "రభస" ముచ్చట్లు
-
సినిమా రివ్యూ: రభస
ప్లస్ పాయింట్స్: జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సమంత, ప్రణీత గ్లామర్, బ్రహ్మానందం కామెడీ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, పేలవమైన కథనం మితిమీరిన ఫైట్స్ ఓ అమ్మాయి ప్రేమను కాపాడే పయత్నంలో మరో అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతాడు కార్తీక్(జూనియర్ ఎన్టీఆర్). తన తండ్రి(నాజర్) అవమానించిన తన మేనమామ ధనుంజయ్ (షియాజీ షిండే) బుద్ది చెప్పి, తన తల్లి కోరిక మేరకు తన మరదలు చిట్టి అలియాస్ ఇందు(సమంత)ను పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ చేరుకుంటారు. తన మరదలు అని తెలియకపోవడంతో మొదటి కలయికలోనే ఇందు,కార్తీక్ ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. తన మరదలిని ప్రేమలోకి దించే ప్రయత్నంలో భాగ్యం(ప్రణితి)ను ఇందుగా భావించి ప్రేమలోకి దింపుతాడు. కార్తీక్ చెడ్డవాడు అనే భావనలో ఉన్న ఇందు..వారిద్దరి విడగొడుతుంది. భాగ్యంతో ప్రేమను విడగొట్టిన ఇందు అప్పటికే తనకు తెలియని వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తన తండ్రి ప్రయత్నాలకు దూరంగా పారిపోవడానికి కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. కథ ఇలా నడుస్తుండగా.. పెద్దిరెడ్డి (జయప్రకాశ్) ఓబుల్ రెడ్డి (అజయ్)ల గ్యాంగ్ కార్తీక్ కోసం వెదుకుతుంటారు. ఓదశలో కార్తీక్, ఇందులు పెద్దిరెడ్డి ఇంట్లోకే చేరుతారు. తనను వెతుకున్న విలన్ల ఇంటికి చేరిన కార్తీక్ ఏం చేశాడు. ఇందు తన మరదలే అని తెలుసుకున్నాడా? తెలియని వ్యక్తితో ప్రేమలో పడిన ఇందు తన ప్రేమికుడిని కలుసుకుందా? పెద్దిరెడ్డి, ఓబుల్ రెడ్డిలు కార్తీక్ ను ఎందుకు వెతుకుతున్నారు? అయితే ఇందు తన మరదలు అని తెలుసుకుంటాడా? తన కారణంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు? తన మామ ధనుంజయ్ ను ఎలా కన్విన్స్ చేసి ఇందును పెళ్లి చేసుకున్నాడా? అనే పలు ప్రశ్నలకు సమాధానమే 'రభస' ప్రేమికుడిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఓ వ్యక్తిగా, తన తల్లిని మాటను తీర్చే కోడుకుగా, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న రెండు ఫ్యాక్షన్ల కుటుంబాలను కలిపే మనసున్న మనిషిగా, తన మేనమామకు తగిన గుణపాఠం నేర్పే అల్లుడిగా.. పలు విభిన్న షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశాడు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రయోగాలకు చోటివ్వకుండా చాలా సేఫ్ గా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. సమంత పాత్ర ప్రధానంగా గ్లామర్ కే పరిమితమైన, కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. ప్రణీత రెండో హీరోయిన్ గా కనిపించి.. కథానుగుణంగా కనిపించి మాయమవుతుంది. ప్రణీత కెరీర్ కు పెద్గగా ప్లస్ అవుతుందని చెప్పడం కష్టమే. రాజు పాత్రలో కనిపించిన బ్రహ్మనందం రోటిన్ కారెక్టర్ అయినప్పటికి.. ద్వితీయార్ధంలో సినిమా భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఫైట్స్ తో విసిగించే సమయంలో రాజుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు బ్రహ్మనందం కొంత రిలీఫ్ కలిగించాడు. జయప్రకాశ్, నాగినీడు, అజయ్, షియాజీ షిండే, నాజర్, జయసుధలు తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. సాంకేతిక నిపుణులు పనితీరు: సాంకేతిక విభాగంలో ముఖ్యంగా శ్యామ్ కే నాయుడును అందించిన ఫోటోగ్రఫి బాగుంది. లోకేషన్లు ఆందంగా చిత్రీకరించి.. రభసకు అదనపు ఆకర్షణగా మారారు. ఈ చిత్ర నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉంది. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు మరింత పదను పెట్టాల్సిందే. ఓ రెండు పాటలు మినహా తమన్ ప్రభావవంతమైన సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. ఎమోషన్ సీన్స్ లో నేపథ్యం సంగీతంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేదనిపిస్తోంది. 'కందిరీగ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శ్రీనివాస్ రభస కథ, కథనాన్ని చాలా కాంప్లికేటెడ్ పంథాలోనే కొనసాగించాడు. అనేక ట్విస్టులు, గందరగోళంగా ఉండే కథనంతో ప్రేక్షకుడిని అక్కడక్కడా కన్ ఫ్యూజ్ చేస్తుంది. కథాగమనంలో అనేక మలుపులు సహజంగా ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. కేవలం కమర్షియల్ ఆంశాలను బేరిజు వేసుకుని కథ, కథనంపై దృష్టిపెట్టారనేది సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. అయితే తొలిభాగంలో ఓపెన్ చేసిన ట్విస్టులకు ద్వితీయార్ధంలో క్లోజ్ చేసిన తీరు, విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. చిత్ర ద్వితీయార్ధంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు దర్శకుడి ప్రతిభకు అద్దపడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రయోగాలకు చోటివ్వకుండా టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాతో కథను పట్టాలెక్కించి.. సేఫ్ గా గమ్యాన్ని చేర్చేందుకు చేసిన ప్రయత్నం కొంత వర్కవుట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రంగా కాకుండా.. ఓ రకమైన సంతృప్తిని కలిగించే చిత్రంగా 'రభస' రూపొందింది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరణపైనే రభస సక్సెస్, కమర్షియల్ గా ఏరేంజ్ లో వర్కవుట్ అయిందనే అంశాలు అధారపడి ఉన్నాయి. -రాజబాబు అనుముల -
రభస ఆడియో వేడుక విశేషాలు
-
కన్నీళ్లు పెట్టుకున్న రభస దర్శకుడు
-
ఎన్టీఆర్ రభస మూవీ స్టిల్స్
-
‘రాకాసి..’ పాటను ఎన్టీఆర్ అద్భుతంగా పాడారు!
‘‘ఓ శక్తిమంతమైన కథ కుదిరితే ఎన్టీఆర్ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పడానికి ‘సింహాద్రి’ ఓ ఉదాహరణ. అందుకే ‘రభస’ సినిమా విషయంలో నాకెలాంటి సందేహం లేదు. కథ అంత గొప్పగా వచ్చింది’’ అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఆత్మవిశ్వాసం కనబరిచారు. ‘కందిరీగ’తో మెగాఫోన్ పట్టిన ఈ ఛాయాగ్రాహకుడు ప్రస్తుతం ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్లో బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా ‘రభస’ చేస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ‘కందిరీగ’ తర్వాత చాలా విరామం తీసుకుని ‘రభస’ మొదలుపెట్టాను. దానికి కారణం కథ. బౌండ్ స్క్రిప్ట్ కుదిరిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టాం. నా ఆరోగ్యం బాగాలేక ఓ రెండు నెలలు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా 135 రోజుల్లో సినిమా పూర్తి కావడం ఆనందంగా ఉంది. అవుట్‌పుట్ చాలా సంతృప్తికరంగా వస్తోంది. ఈ నెల 23తో షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం ఓ మంచి అనుభవం. చెప్పిన సమయానికి అరగంట ముందే లొకేషన్లో ఉంటారాయన. ప్రతి తల్లీ ఇలాంటి కొడుకు కావాలనీ, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందనే విధంగా ‘రభస’లో ఆయన పాత్ర ఉంటుంది. ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్. ఇందులోని ‘రాకాసి...’ పాటను ఆయనతో పాడించాలన్నది సంగీతదర్శకుడు తమన్ ఆలోచనే. ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అద్భుతంగా పాడారు. ఎన్టీఆర్‌లో మంచి గాయకుడు ఉన్నాడు. నా మలి సినిమాకి కూడా బెల్లంకొండ సురేశే నిర్మాత కావడం ఆనందంగా ఉంది. కథ గురించి మా మధ్య వాదోపవాదాలు జరిగాయి. సురేశ్‌కి మంచి జడ్జిమెంట్ ఉంది. ఆయనకు సంతృప్తిగా అనిపించిన సినిమా, కచ్చితంగా ప్రేక్షకులను కూడా సంతృప్తిపరుస్తుంది. కథ డిమాండ్ చేసిన మేరకు వెనుకాడకుండా ఖర్చుపెట్టడం ప్లస్ పాయింట్. త్వరలో ‘తిక్క రేగితే’ పేరుతో ఓ సినిమా చేస్తాను. హీరో ఎవరనేది సస్పెన్స్. ‘కందిరీగ’ హిందీ రీమేక్ నన్ను చేయమన్నారు. కానీ, అప్పటికే ‘రభస’ ప్లాన్ చేయడంతో చేయలేకపోయాను. ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా పరిచయమవుతోన్న బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ లవ్‌స్టోరీ చేయాలని ఉంది. తను మంచి మాస్ కమర్షియల్ హీరో అవుతాడు. -
తారక్ ‘రభస’ వర్కింగ్ స్టిల్స్
-
'తిక్కరేగింది' బన్నికా? రవితేజకా?
తన మొదటి సినిమా 'కందిరీగ'తోనే సంతోష్ శ్రీనివాస్ మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఛాయాగ్రాహకుడు శ్రీనివాస్ దర్శకుడుగా మారి తనేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తన మార్కులో జూనియర్ ఎన్టీఆర్‌తో 'రభస' చేయడానికి సిద్ధమయ్యాడు. మొదటి చిత్రం తరువాత కొంత గ్యాప్ వచ్చినా తన రెండవ చిత్రం ఎన్టీఆర్ లాంటి హీరోతో మంచి కసితో చేస్తున్నాడు. ఒక పక్క రభస చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూనే మరో పక్క 'తిక్కరేగింది' అంటూ హడావిడి చేస్తున్నాడు. 'తిక్కరేగిందంటే నేను మామూలు మనిషిని కాదు' అని కొందరు కాస్త పొగరు, కాస్త గర్వంగా అంటూంటారు. ఇప్పుడు అదే 'తిక్కరేగింది' అనే టైటిల్‌తో సంతోష్ శ్రీనివాస్ ఓ పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ పెద్ద బ్యానర్ సిద్దమైనట్లు సమాచారం. అయితే ఇందులో హీరో మాస్ మహారాజు రవితేజ గానీ, స్టైలిష్ స్టార్ బన్నీ గానీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరికి తిక్కరేగుతుందో వేసి చూడాలి. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్‌తో రభస షూటింగ్ పూర్తి చేశాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత నటించారు. ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆగష్ట్ 14న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రభస చేయనుంది. ఈ సినిమాను హిట్ చేయాలని శ్రీనివాస్, ఎన్టీఆర్ ఇద్దరూ బాగా పని చేశారు. ఎన్టీఆర్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం కోరుకొంటారో అవన్నీ మా సినిమాలో ఉన్నాయని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండటంతో శ్రీనివాస్‌కు టాలీవుడ్లో వరస ఆఫర్స్ వస్తున్నాయి. రవితేజ సైతం సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చేయటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. 'తిక్కరేగింది' లేక 'తిక్కరేగితే' అనే సినిమా విషయమై అల్లు అర్జున్‌తో కూడా శ్రీనివాస్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ మూవీలో హీరోగా బన్నీ నటిస్తాడా? లేక రవితేజ చేస్తాడా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. - శిసూర్య -
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘రభస’ ఫస్ట్‌లుక్
-
పవర్‌ఫుల్‌గా...
నటన, నాట్యం... ఈ రెండూ తారక్‌కి అలంకారాలు. అయితే వాటిని సరిగ్గా ప్రదర్శించే స్థాయి కథలు ఇటీవల ఆయనకు రావడంలేదు. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి మాస్‌కి అమితంగా చేరువైన తారక్‌కి... గతంలో చేసిన పాత్రలకు దీటైన పాత్రలు దొరక్కపోవడం నిజంగా లోటే. ఆ లోటుని భర్తీ చేసేలా ‘రభస’(వర్కింగ్ టైటిల్) ఉంటుందని సమాచారం. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ స్డూడియోలో జరుగుతోంది. ‘ఆది’ తర్వాత తారక్‌తో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘ఆది’ కంటే అత్యంత శక్తిమంతంగా ఇందులోని తారక్ పాత్ర ఉంటుందని యూనిట్ సభ్యుల సమాచారం. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత తొలుత ప్లాన్ చేశారు. కానీ... సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో మే నెలలో విడుదల చేయడానికి నిర్ణయించారు. సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
సరికొత్త శైలిలో సుకుమార్‌తో సినిమా
ఎన్టీఆర్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘రభస’ (ప్రచారంలో ఉన్న టైటిల్) పూర్తి కాకముందే, మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఇంటలిజెంట్ డెరైక్టర్‌గా పేర్గాంచిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆయన అంగీకారం తెలిపారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ -‘‘ఇటీవలే ఎన్టీఆర్‌కు స్టోరీ లైన్ చెబితే, ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా వాణిజ్య అంశాలతో ఉంటూనే, సరికొత్త శైలిలో ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. తమ సంస్థలో ఇది మరో సంచలన చిత్రం అవుతుందని బీవీఎస్ఎన్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: భోగవల్లి బాపినీడు. -
అత్తమడుగు వాగులోనా.. అత్త కొడుకో...
మహానటుడు ఎన్టీఆర్ సాధించిన ఘనవిజయాలలో ‘కొండవీటి సింహం’ సినిమా ఒకటి. అందులో ఎన్టీఆర్, శ్రీదేవిపై చిత్రీకరించిన ‘అత్తమడుగు వాగులోనా... అత్త కొడుకో...’ పాట అప్పట్లో మాస్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడా పాటని రీమిక్స్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలో ఈ పాట పెట్టాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారట. ఈ రీమిక్స్‌ని ఎన్టీఆర్, అక్షపై ప్రత్యేక గీతంగా చిత్రీకరించే అవకాశం ఉందనేది యూనిట్ వర్గాల సమాచారం. ఇలా తాతయ్య ఎన్టీఆర్ పాటలను రీమిక్స్ చేసి ఉపయోగించుకోవడం ఎన్టీఆర్‌కి కొత్త కాదు. ఇంతకు ముందు ‘వేటగాడు’లోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటను ‘అల్లరి రాముడు’లోనూ, ‘యమగోల’లోని ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాటను ‘యమదొంగ’లోనూ రీమిక్స్ చేశారు. ‘రభస’గా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల మూడోవారం నుంచి హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూలు జరుగనుంది. అతి ముఖ్య సన్నివేశాలను ఈ షెడ్యూలులో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత జైపూర్‌లో మరో షెడ్యూలు జరగనుంది. ఇందులో సమంత, ప్రణీత నాయికలు. -
జోరు మీదున్న ఎన్టీఆర్!
‘అమ్మ తోడు అడ్డంగా నరుకుతా’... అంటూ ‘ఆది’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడిప్పుడే విన్నట్టుగా ఉంది. కానీ, కాలం వేగంగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా విడుదలై పదేళ్లకు పైనే అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో ఇదో సంచలనాత్మక చిత్రం. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఎన్టీఆర్, విలన్ బృందం పాల్గొనగా ఓ ఫైట్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రారంభదశ నుంచీ ‘రభస’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదని చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ‘జోరు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘రభస’ కన్నా ‘జోరు’ బాగుందని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నారట. టైటిల్ సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఫైట్‌లో మాత్రం ఎన్టీఆర్ జోరుగా, హుషారుగా పాల్గొంటున్నారట. ఈ చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. -
ఎన్టీఆర్‌తో కలిసి రభస చేస్తోందట
ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, శకుని... బెంగళూరు భామ ప్రణీత నటించిన ఈ మూడు సినిమాలూ పరాజయాల్ని మూట కట్టుకున్నాయి. దాంతో ‘ఐరన్‌లెగ్’ అనే పదం మొన్నటివరకూ ప్రణీత ఇంటిపేరై కూర్చుంది. అయితే... ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు.. ‘అత్తారింటికి దారేది’ అనే ఒకే ఒక్క సినిమా ప్రణీత తలరాతనే మార్చేసింది. నిజానికి ఈ సినిమాలో ప్రణీత చేసింది సెకండ్ హీరోయిన్ కేరక్టర్. కానీ ప్రధాన కథానాయిక సమంత కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది ప్రణీత. ఒక్క విజయంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ప్రణీత జపం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే... మరో ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రణీతకు అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకునిగా ‘కంది రీగ’ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘రభస’ చిత్రంలో ఓ కథానాయికగా ప్రణీతను ఎంపిక చేశారు. అయితే... ఈ సినిమాలో కూడా ప్రధాన కథానాయిక సమంతానే కావడం విశేషం. ‘అత్తారింటికి దారేది’ తర్వాత సమంత, ప్రణీత కలిసి నటిస్తున్న సినిమా ఇదే. మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.