
ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ టైం ఏమంత బాలేదు. రాజా ది గ్రేట్ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా పడటంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న రవితేజ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు.
కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన తేరి సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్‌లో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమాను తెలుగు నేటివిటీ, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, కేథరిన్ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment