డిస్కోరాజా కోసం వేచి చూస్తున్నా | Ravi Teja Speech AT Disco Raja Prerelease Event | Sakshi
Sakshi News home page

డిస్కోరాజా కోసం వేచి చూస్తున్నా

Published Tue, Jan 21 2020 12:19 AM | Last Updated on Tue, Jan 21 2020 12:19 AM

Ravi Teja Speech AT Disco Raja Prerelease Event - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్, రవితేజ, నభా నటేశ్, వి.ఐ. ఆనంద్, రామ్‌ తాళ్లూరి, రజనీ తాళ్లూరి, తాన్యా హోప్‌

‘‘నేను చూస్తూ పెరిగిన పాత్రలను ‘డిస్కోరాజా’ చిత్రంలో చేశాను.. అందరికీ నచ్చుతాయి. తమన్‌ మంచి పాటలిచ్చాడు. నిర్మాత రామ్‌ తాళ్లూరితో నేను చేసిన ఈ రెండో సినిమా నిరుత్సాహపరచదు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా కోసం మీలాగే (ప్రేక్షకులు) నేనూ వేచి చూస్తున్నాను’’ అని రవితేజ అన్నారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా, నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్, తాన్యా హోప్‌  హీరోయిన్లుగా  రూపొందిన చిత్రం ‘డిస్కోరాజా’. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులందరూ బాగా ఎంజాయ్‌ చేసే సినిమా ‘డిస్కోరాజా’. ఈ చిత్రం చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్‌ చేశాను. వీఐ ఆనంద్‌ బాగా తీశాడు. తమన్‌ సంగీతం, కార్తీక్‌ ఘట్టమనేని విజువల్స్‌ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘బిగ్‌ స్టార్‌తో నేను చేసిన సినిమా ఇది. ప్రతి డైరెక్టర్‌ రవితేజగారితో ఓ సినిమా చెయ్యాలి.. ఆయన్నుంచి చాలా నేర్చుకోవచ్చు.. నేను నేర్చుకున్నాను. ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు వీఐ ఆనంద్‌.

‘‘మా బావ రవితేజ ఎనర్జీతో ఎవ్వరూ మ్యాచ్‌ కాలేరు. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్‌ వీవీ వినాయక్‌. ‘‘రవితేజగారితో ‘రాజా ది గ్రేట్‌’ సినిమా తీశాను.. ఆయనతో మళ్లీ ఎప్పుడెప్పుడు పని చేయాలా? అని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ‘‘ఈ సినిమాకు ‘డిస్కోరాజా’ అనే టైటిల్‌ని పెట్టినప్పుడే సక్సెస్‌ అయ్యారు’’ అన్నారు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని. ‘‘చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాలో నటించాను. ఈ సినిమా కొత్తగా, గొప్పగా ఉంటుంది’’ అన్నారు నటుడు సునీల్‌. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు నభా నటేష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement