Disco Raja
-
తెలుగులో బప్పి లహరి పాడిన చివరి పాట ఇదే..
ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. 1952 నవంబర్ 27న బెంగాల్‌కు చెందిన బ్రహ్మాణ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు అలొకేష్ లహరి. సినిమాల్లోకి వచ్చాక బప్పి లహరిగా మారిన ఆయన సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ పాటతో ఓ ఊపు ఊపిన ఈ బెంగాలీ మ్యూజిక్ డైరెక్టర్.. ఆ తరువాత బాలీవుడ్‌ను తన సంగీతంతో శాసించారు. తెలుగులోనూ ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. 1986లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన బప్పి ఆ తరువాత తెలుగులో ఎన్నో బంపర్ హిట్ సాంగ్స్ కంపోజ్ చేశారు. తండ్రి అపరేష్, తల్లి బన్సూరి ఇద్దరూ మ్యుజీషియన్స్, సింగర్స్ కావడంతో.. ఆటోమేటిక్‌గా బప్పీ లహరి కూడా మ్యూజిక్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. బప్పీ తెలుగులో 1987లో త్రిమూర్తులు, 1989లో స్టేట్‌రౌడీ, 1991లో గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, 1993లో నిప్పు రవ్వ, 1995లో బిగ్ బాస్, ఖైదీ ఇన్స్పెక్టర్, పుణ్యభూమి నా దేశం సినిమాలకు మ్యూజిక్ అందించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు కాంబినేషన్లో వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చివరిగా తెలుగులో ఆయన 2020లో వచ్చిన రవితేజ డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. రమ్ పమ్ పమ్ అంటూ రాక్ స్టైల్లో పాటను పాడారు ఆయన. -
‘డిస్కో రాజా’ సక్సెస్ సెలబ్రేషన్స్
-
ఈ సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్, రవితేజ పుట్టినరోజు వేడుకను ఆదివారం చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ – ‘‘డిస్కో రాజా’ సినిమాలో నా పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రామ్ తాళ్లూరి ప్యాషనేట్ నిర్మాత’’ అన్నారు. ‘‘సంవత్సరానికి మూడు సినిమాలు ఇవ్వగల సత్తా ఉన్న హీరో రవితేజ. ఆయన ఎనర్జీ ఆ రేంజ్లో ఉంటుంది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి. ‘‘ఈ సినిమాను అందరూ ప్రేమించి, ఎంతో ఆనందంతో పని చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు ఆనంద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు పాయల్. ‘‘రవితేజగారి పుట్టినరోజుకి మంచి సినిమా ఇచ్చాం అనుకుంటున్నాను’’ అన్నారు రామ్ తాళ్లూరి. ‘‘నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఏ భాషలో అయినా సరే సిక్స్‌ప్యాక్ విలన్ కావాలన్నది నా కోరిక’’ అన్నారు సునీల్. ‘‘వీఐ ఆనంద్ క్లారిటీ ఉన్న దర్శకుడు. రవితేజగారి ఎనర్జీ లెవల్స్ సూపర్’’ అన్నారు రాంకీ. ‘‘మూవీను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాబీ సింహా. ఈ కార్యక్రమంలో ‘సత్యం’ రాజేష్, కెమెరామేన్ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు. -
అమ్మ సలహాలు తీసుకున్నా
‘‘పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. సీనియర్ హీరోలతోనే చేస్తే యంగ్ హీరోలతో అవకాశాలు తగ్గుతాయేమో? లాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోను. వచ్చిన పాత్రకు నటిగా పూర్తి న్యాయం చేయాలనుకుంటాను’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్ హీరోయిన్లు. గత శుక్రవారం ఈ సినిమా విడుదలైన సందర్భంగా పాయల్ చెప్పిన విశేషాలు. ► 2020 చాలా అద్భుతంగా ప్రారంభమైంది. మా ‘డిస్కోరాజా’కు మంచి స్పందన లభిస్తోంది. నా పాత్ర బావుందని, పాత్ర నిడివి పెద్దది కాకపోయినా దాని ప్రభావం బావుందని అభినందిస్తున్నారు. దర్శకుడు వీఐ ఆనంద్‌గారు కథ చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే కథ విన్న వెంటనే సినిమా చేయాలనుకున్నా. నా పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ► సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా నటించాను. ఏదైనా విషయాన్ని మాటల్లో అర్థం అయ్యేలా చెప్పేయొచ్చు. కానీ నా పాత్ర ఏదైనా కళ్లతోనే చెప్పాలి. మాట్లాడకుండా భావాన్ని వ్యక్తపరచడం చాలా కష్టం. ఈ పాత్ర చేయడం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ► కథానుసారం నా పాత్ర రెట్రో లుక్‌లో ఉంటుంది. ఆ పాత్రకు తయారవడం కోసం మా అమ్మ దగ్గర చాలా సలహాలు తీసుకున్నాను. అప్పట్లో డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉండేది? ఎలాంటి బట్టలు వేసుకునేవారని అడిగి తెలుసుకున్నా. నా పాత్రను బాలీవుడ్ హీరోయిన్లు హెలెన్, హేమ మాలినీ, టబు, జీనత్ పాత్రల ఆధారంగా డిజైన్ చేశారు. ► గత ఏడాదిగా షూటింగ్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాను. ఈ ఇండస్ట్రీ నాకు పేరు, డబ్బు, అభిమానం ఇచ్చింది. అందుకే ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం. ఈ మధ్యే తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా పూర్తి చేశాను. అందులో ఐపీఎస్ అధికారిగా నటించా. తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమా చేశా. వరుసగా మంచి సినిమాల్లో భాగమవుతూ వస్తున్నా. అదే కొనసాగించాలనుకుంటున్నాను. అందుకే కథల ఎంపికలో ఇంకా జాగ్రత్తగా ఉంటాను. ► లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో బాధ్యత అంతా హీరోయిన్ల మీదే ఉంటుంది. అది కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. కెరీర్ తొలి రోజుల్లేనే ఇలాంటి సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. ► ‘ఆర్ఎక్స్ 100’ నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా. ఆ సినిమాయే నాకు ఓ గుర్తింపు తెచ్చింది. నాకో ఇమేజ్ తీసుకొచ్చింది. తీరిక లేకుండా పని చేసేలా చేసింది. ఆ సినిమా ద్వారా నాకు మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ‘ఆర్డీఎక్స్’తో కొంచెం బ్రేక్ చేశాను. ‘వెంకీ మామ’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాను. ఇలా ప్రతి సినిమాకు ఆడియన్స్‌ను పెంచుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. -
మా కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. కథానాయికలు నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం (ఈ నెల 24) విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం వెల్లడించింది. కేక్ కట్ చేసి ఆ ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు రవితేజ. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘రెండేళ్లు ‘డిస్కోరాజా’ చిత్రానికి మేం పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రేక్షకులు నుంచి లభిస్తోన్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఓపెనింగ్స్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘యూఎస్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ మొదలైంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి మౌత్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజగారు – పాయల్ రాజ్‌పుత్‌ల లవ్ ట్రాక్, రవితేజగారు – ‘వెన్నెల’ కిశోర్ కాంబినేషన్ కామెడీ సీన్స్ .. ఇలా సినిమాలోని మరికొన్ని హైలైట్స్ బాగున్నాయని ప్రేక్షకులు మెచ్చుకుంటు న్నారు. మేం చేసిన కొత్త ప్రయత్నాన్ని అభినందించి, మంచి ఫలితం ఇచ్చారు’’ అన్నారు దర్శకుడు వీఐ ఆనంద్. ‘‘కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుంది. కొత్త ప్రయత్నాలుగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వెంటనే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటే సినిమా హిట్ నుంచి సూపర్ హిట్‌కు వెళుతుంది. ఈ సినిమా బుకింగ్స్ బాగున్నాయి. బీ, సీ సెంటర్స్ దగ్గర కొంచెం డ్రాప్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. రేటింగ్స్ అవి నాకు తెలియదు కానీ... మనకు ప్రేక్షకులు ఇంపార్టెంట్. ప్రేక్షకులు మాకు ఇచ్చిన రేటింగ్ 5కి 4.5 ఉంది’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ ఆడెపు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కూడా పాల్గొన్నారు. -
‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ
-
‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ
టైటిల్: డిస్కో రాజా జానర్: సైన్స్‌ఫిక్షన్ అండ్ రివేంజ్ డ్రామా నటీనటులు: రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సునీల్, సత్య సంగీతం: తమన్ దర్శకత్వం: వీఐ ఆనంద్ నిర్మాత: రజని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిడివి: 149.08 నిమిషాలు ఆంధ్ర అమితాబ్, మాస్ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు గాంచిన వీఐ ఆనంద్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడం, అతడిపై పూర్తి విశ్వాసంతో ‘డిస్కో రాజా’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు రవితేజ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య నేడు ‘డిస్కో రాజా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మరి ‘డిస్కో రాజా’ రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా? కాన్సెప్ట్ విత్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: లడఖ్‌లో ప్రారంభమై ఢిల్లీ, చెన్నై, రుద్రాపూర్, ముంబై, గోవాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వాసు (రవితేజ) ఓ అనాథ. తనతో పాటు మరికొంతమంది అనాథలతో రామచంద్రం అనే ఓ పెద్దాయనతో కలిసి ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే నభా (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. అయితే తన కుటుంబానికి వచ్చిన సమస్యను సెటిల్మెంట్ చేసుకోవడం కోసం గోవా వెళ్లిన వాసు తిరిగిరాడు. అయితే ఇదే క్రమంలో కొన్ని అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. మరోవైపు పరిణితి ( తాన్యా హోప్), పాల్గుణి (వెన్నెల కిశోర్) అండ్ టీం చేసిన ఓ ప్రయోగం సక్సెస్ అవుతుంది. చివరికి ఆ ప్రయోగం చేసింది డిస్కో రాజా(రవి తేజ)పై అని తెలుసుకుంటారు. అయితే ఇంతకీ ఆసలు డిస్కో రాజా ఎవరు? బర్మా సేతు (బాబీ సింహా), హెలెన్ (పాయల్ రాజ్‌పుత్), భరణి (రామ్కీ), పీటర్ (సత్య), ఉత్తరకుమారా అలియాస్ దాస్ (సునీల్)లు ఈ కథలో ఎందుకు ఎంటర్ అవుతారా? అసలు వాసు, డిస్కో రాజాకు ఉన్న సంబంధం ఏమిటి? డిస్కో రాజాపై వారు చేసిన ప్రయోగం ఏమిటి? అనేదే డిస్కోరాజా సినిమా కథ. నటీనటులు: మామూలుగా రవితేజ సినిమా అంటేనే కథ మొత్తం అతడి చుట్టే తిరుగుతుంది.. ఆయన సినిమాకు ఆయనే ప్రధాన బలం, బలగం. ఇక ఈ సినిమాలో కూడా వన్ మ్యాన్ షో అనడం సాధారణమే అవుతుంది. రవితేజ అంటేనే ఎనర్జీ, కామెడీ.. ఈ విషయాలలో డోకా లేదు. ఇక ఈ సినిమాలో చాలా స్టైలీష్‌గా కనిపిస్తాడు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో అతడు పలికించే హావభావాలు మైండ్ బ్లాంక్ అనే చెప్పాలి. అంతేకాకుండా మధ్య మధ్యలో అతడు చెప్పే హిందీ డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఇక ఓవరాల్‌గా రవితేజ సినిమాకు ఊపిరి పోశాడు. పవర్‌ప్యాక్ పర్ఫార్మెన్స్తో మాస్మహారాజా రఫ్పాడించాడు. ఇక ముగ్గురు యువ కథానాయికలు పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌లు వారి పాత్రలకు జీవం పోశారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా ఈ సినిమాలో కూడా తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. డాక్టర్ పాత్రలో తాన్యా హోప్ జీవించేసింది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌కు డిఫరెంట్ రోల్ దక్కింది. దీంతో నటిగా నిరూపించుకునేందుకు పాయల్‌కు దక్కిన మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇక పరభాషలో సెటిల్ అయిన తెలుగువాడు బాబీ సింహా ఈ చిత్రంతో టాలీవుడ్లో తొలిసారి నెగటీవ్ రోల్లో మెరిశాడు. విలన్ పాత్రలో కొన్ని సీన్లలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్, సత్య తమ కామెడీ టైమింగ్‌తో అలరించారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన సునీల్‌కు ఈ చిత్రంలో విభిన్న పాత్ర దక్కింది. తన శైలికి విభిన్నమైన పాత్రను కుడా సునీల్ అవలీలగా చేసేశాడు. మిగతా తారాగణం వారి పాత్రలకు తగ్గట్టు వారు న్యాయం చేశారు. విశ్లేషణ: ‘రావణాసురిడి బాణానికి బలైన లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడు సప్త సముద్రాలు దాటి సంజీవని తీసుకొస్తాడు. అదేవిధంగా మనిషి చనిపోతే బతికించే సంజీవని కనిపెట్టడానికి వెళుతున్నాను’అనే ఓ డైలాగ్ ఈ చిత్రంలో ఉంటుంది. ఈ చిన్న లైన్ నుంచే దర్శకుడు వీఐ ఆనంద్ మొత్తం సినిమా కథను అల్లుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ లాంటి మాస్ హీరోతో ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్న డైరెక్టర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. అదేవిధంగా తన శైలికి భిన్నమైన కథను ఒప్పుకొని రవితేజ గొప్ప ప్రయోగమే చేశాడు. అయితే రవితేజ విశ్వాసాన్ని ఎక్కడా వమ్ముచేయకుండా, తన కాన్సెప్ట్‌కు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని.. నిర్మాతకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు వీఐ ఆనంద్. టాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ చిత్రాలంటే కత్తిమీదసాము వంటిది. ఎందుకంటే లాజిక్ మిస్సయినా, ప్రేక్షకుడికి అర్థంకాకపోయినా డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే. ఈ విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రతీ విషయాన్ని, తను చెప్పాలనుకున్న అంశాన్ని చాలా బలంగా తెరపై చూపించాడు. దీంతో ఇప్పటివరకు చిన్న చిన్న సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కనున్నాడు. ఇక ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా సంఘటనలే ఉంటాయి. ఆ సంఘటనలతోనే ఈ చిత్రాన్ని చాలా తెలివిగా దర్శకుడు తెరకెక్కించాడనే చెప్పాలి. అంతేకాకుండా ఇది ఎలా అవుతుంది అని సగటు ప్రేక్షకుడు ప్రశ్నించకుండా ముందే సైన్స్ ఫిక్షన్ అనే ట్యాగ్ జోడించారు. దీంతో కొన్ని సీన్ల గురించి ప్రశ్నించే వీలు లేదు. అయితే సైన్స్ ఏదైనా చేయగలుగుతుంది అని విశ్వసించి, కొన్ని లాజిక్ లేని సీన్లను పక్కకు పెడితే సినిమా రవితేజ స్టైల్లో అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. సినిమా ఆరంభమైన వెంటనే కథ అర్థమైనట్టు ఉంటుంది. కానీ ఏమి అర్థంకాదు. సినిమాలో లీనమైనా కొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, అదేవిధంగా క్లైమాక్స్‌లో వచ్చే అతిపెద్ద ట్విస్ట్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. ముగ్గురు హీరోయిన్లకు తలా కొన్ని సీన్లు పడ్డప్పటికీ రవితేజ ముందు అంతగా హైలెట్ కావు. ఇక రవితేజ అండ్ గ్యాంగ్ చేసే కామెడీ, అల్లరి ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ మ్యూజిక్. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ సినిమాతో తమన్‌కు రావాల్సిన గౌరవం తప్పక దొరుకుతుందనే చెప్పాలి. ఇక కార్తీక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక ఈ సినిమా రెండు తరాల మధ్య జరుగుతుంది. కొంత సేపు గతం, మరికొంత సేపు ప్రస్తుతం జరుగుతుంటుంది. దీంతో దేనికి తగ్గట్టు ఆ సెట్స్ వేసి ఆ రోజుల్లోకి తీసుకెళ్లాడు ఆర్ట్ డైరెక్టర్. ‘మన వాళ్లు కలలు నిజం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక కలలపై బుక్స్ ఎలా రాస్తారు, కుటుంబం అంటే ఒకరిపై ఒకరు బతకడం కాదు.. ఒకరి కోసం ఒకరు బతకడం, ఏ యవ్వారం జరగకపోతే ఆ యవ్వనం యవ్వనం కాదు’ అని రచయిత అబ్బూరి రవి అందించిన డైలాగ్‌లు పర్వాలేదనిపించాయి. అయితే మాస్ మహారాజా స్టైల్లో మాస్ మసాలా డైలాగ్‌లు ఎక్కువగా లేవు. ఇక పాటలు అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగ్యశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ ఘట్టాలు పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: రవితేజ నటన తమన్ మ్యూజిక్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మైనస్ పాయింట్స్: లాజిక్ లేని కొన్ని సీన్లు బలమైన కథ కాకపోవడం కొన్ని సాగదీత సీన్లు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
‘డిస్కో రాజా’ సినిమా స్టిల్స్
-
అందుకే ఆస్పత్రిలో చేరా: సునీల్
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ వార్తలపై స్పందించిన సునీల్... తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. కాగా... సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హిట్టు కొట్టారు. తొలుత హీరోగా మంచి విజయాల్ని అందుకున్న సునీల్.. తరువాత ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. దీంతో పంథా మార్చుకుని.. మళ్లీ హాస్య నటుడిగా అవతారమెత్తారు. కాగా హీరోగా, కమెడియన్‌గా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ప్రతినాయకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. 'కలర్ ఫోటో' అనే సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. -
థియేటర్ అనుభూతిని ఏదీ ఇవ్వలేదు
‘‘స్క్రిప్ట్‌లోని హీరో క్యారెక్టర్ని బట్టి పూర్తి కథ అల్లుకుని సినిమాలు తీయాలంటే నాకు భయం. అందుకే నా సినిమాల్లో కొత్తదనం, కంటెంట్ ఉండాలని కోరుకుంటాను. కాన్సెప్ట్ మూవీస్‌లో కమర్షియల్ అంశాలుండకూడదు. కమర్షియల్ సినిమాలో కాన్సెప్ట్ పెద్దగా ఉండకూడదనడం సరైంది కాదు. కాన్సెప్ట్ సినిమాలను కమర్షియల్ పంథాలో వినోదాత్మకంగా ప్రేక్షకులకు చూపించాలనే ‘డిస్కోరాజా’ చిత్రం తీశాను’’ అన్నారు వీఐ ఆనంద్. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొంది న చిత్రం ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా వీఐ ఆనంద్ చెప్పిన విశేషాలు. ► ‘డిస్కోరాజా’ సైన్స్ ఫిక్షన్ డ్రామా. లైవ్ పోర్షన్, రెట్రో పోర్షన్స్, సెన్స్ ఫిక్షన్ ఇలా సినిమాలో మూడు రకాల సీక్వెన్స్ ఉన్నాయి. పదేళ్ల క్రితమే ఈ సినిమా మెయిన్ పాయింట్ నా దగ్గర ఉంది. అయితే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా ఎలా తీయాలని పరిశోధన చేస్తున్నాను. ఓ సందర్భంలో బయో రీసెర్చ్‌కు చెందిన ఆర్టికల్ చదివాను. ఆర్టికల్‌లో ప్రస్తావించిన ప్రయోగం సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? అని ఊహించి ‘డిస్కోరాజా’ కథ రాశాను. అది ఎలాంటి ప్రయోగం అనే విషయం గురించి ఇప్పుడు చెప్పలేను. నా కెరీర్లోనే ‘డిస్కోరాజా’ పెద్ద బడ్జెట్ మూవీ. అలాగే కెరీర్లో నేను ముందుకు వెళ్లడానికి కూడా ఈ సినిమా విజయం నాకు ముఖ్యం. ఇందులో రవితేజగారు సంగీతాన్ని అమితంగా ఇష్టపడే గ్యాంగ్‌స్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ► ‘ఒక్క క్షణం’ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. నాకు పేరు వచ్చింది. కానీ సినిమా ఎందుకు ఆడలేదో, కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో ఎందుకు రాలేదో తెలియదు. సరైన సమయంలో విడుదల కాకపోవడం వల్లే ఇలా జరిగిందని అప్పట్లో విశ్లేషించుకున్నాం. ► అల్లు అర్జున్‌గారితో ఓ సినిమా గురించి చర్చలు జరిగిన మాట నిజమే. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమాకు కమిట్మెంట్ ఉంది. అది ఎవరితో అనేది నిర్మాతలు వెల్లడిస్తారు. వెబ్ సిరీస్‌లు ఎంత హిట్ సాధించినా థియేటర్లో సినిమా చూడటం వేరు. ఆ అనుభూతిని ఏదీ మార్చలేదని నా అభిప్రాయం. ► నేను ఆర్కిటెక్ట్‌ని. చెన్నైలో బీఆర్ కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించాను. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఐదో ఏడాదిలో డిజైన్స్ పరంగా థీసిస్ చేయాల్సి ఉంటుంది. కొందరు హస్పిటల్స్‌ను, కొందరు రైల్వేస్టేషన్స్‌ను ఎంచుకున్నారు. నేను ఫిల్మ్ సిటీని ఎంచు కున్నాను. అప్పటినుంచే నాకు సినిమాలంటే ఇష్టం. ముందు∙అసిస్టెంట్‌గా వర్క్ చేసి, తర్వాత దర్శకుడిని అయ్యాను. -
డిస్కోరాజా కోసం వేచి చూస్తున్నా
‘‘నేను చూస్తూ పెరిగిన పాత్రలను ‘డిస్కోరాజా’ చిత్రంలో చేశాను.. అందరికీ నచ్చుతాయి. తమన్ మంచి పాటలిచ్చాడు. నిర్మాత రామ్ తాళ్లూరితో నేను చేసిన ఈ రెండో సినిమా నిరుత్సాహపరచదు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా కోసం మీలాగే (ప్రేక్షకులు) నేనూ వేచి చూస్తున్నాను’’ అని రవితేజ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా, నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా ‘డిస్కోరాజా’. ఈ చిత్రం చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేశాను. వీఐ ఆనంద్ బాగా తీశాడు. తమన్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘బిగ్ స్టార్‌తో నేను చేసిన సినిమా ఇది. ప్రతి డైరెక్టర్ రవితేజగారితో ఓ సినిమా చెయ్యాలి.. ఆయన్నుంచి చాలా నేర్చుకోవచ్చు.. నేను నేర్చుకున్నాను. ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘మా బావ రవితేజ ఎనర్జీతో ఎవ్వరూ మ్యాచ్ కాలేరు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్. ‘‘రవితేజగారితో ‘రాజా ది గ్రేట్’ సినిమా తీశాను.. ఆయనతో మళ్లీ ఎప్పుడెప్పుడు పని చేయాలా? అని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమాకు ‘డిస్కోరాజా’ అనే టైటిల్‌ని పెట్టినప్పుడే సక్సెస్ అయ్యారు’’ అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ‘‘చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాలో నటించాను. ఈ సినిమా కొత్తగా, గొప్పగా ఉంటుంది’’ అన్నారు నటుడు సునీల్. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు నభా నటేష్. -
డిస్కో రాజా.. సెన్సార్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక జనవరి 24న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే ఇప్పటివరకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ నిరుత్సాపడుతున్నారు. అయితే మూవీ మేకింగ్ వీడియోను మాత్రం వదిలారు. ఇక 2019లో రవితేజ నుంచి ఒక్క సినిమా రాని విషయం తెలిసిందే. దీంతో ఆ లోటును ‘డిస్కో రాజా’ను భర్తీ చేసి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచాలని రవితేజ భావిస్తున్నాడు. ఇక సైన్స్ ఫిక్షన్ జానర్లో రవితేజ తొలిసారి నటిస్తుండటం విశేషం. ‘ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, ఒక్క క్షణం’ లాంటి భిన్నమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వీఐ ఆనంద్.. రవితేజతో ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సైన్స్‌తోపాటు రవితేజ స్టైల్లో కామెడీ జోడించినట్లు సమాచారం. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. -
‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆ కిక్‌ని రిపీట్ చేయాలనుకుంటున్నాను
‘‘ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలని ఎవరికైనా ఉంటుంది. అయితే అనుకున్నంత మాత్రాన రావు. నాకు మాత్రం కెరీర్ మొదట్లోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సినిమా అభిమానిని. కాబట్టి ఏ జానర్ సినిమా అయినా నాకు ఇష్టమే’’ అన్నారు నభా నటేష్. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. ఇందులో కథానాయికలు నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ చెప్పిన విశేషాలు. ► ‘డిస్కో రాజా’ చిత్రంలో నేను నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్రలో నటించాను. ఇంతకుముందు నేను కథానాయికగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’లోని మేఘన, ‘ఇస్మార్ట్ శంకర్’లోని చాందిని పాత్రలతో పోల్చి చూసినప్పుడు నభ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, విలువలకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నభ. నా నిజ జీతానికి కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పగలను. ► రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన నటించిన ‘విక్రమార్కుడు’, ‘కిక్’ సినిమాలు నాకు ఎంతో ఇష్టం. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంటాయి. షూటింగ్ షాట్ గ్యాప్‌లో సినిమాల గురించే కాకుండా ఆయన చాలా విషయాలు మాట్లాడతారు. ఫుడ్, లైఫ్ స్టైల్.. ఇలా సందర్భాన్ని బట్టి మా టాపిక్ ఉంటుంది. రవితేజగారితో వర్క్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ► వీఐ ఆనంద్‌గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. కథ నాకు బాగా నచ్చింది. ఇది మాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. కానీ రవితేజగారి పాత్ర గురించి ప్రస్తుతం నేను చెప్పలేను. రేపు థియేటర్స్‌లో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని మాత్రం చెప్పగలను. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. మేజర్‌గా నా సీన్స్ అన్నీ రవితేజగారు, ‘సత్యం’ రాజేష్, నరేష్గారితోనే ఉన్నాయి. ► యాక్టర్స్ అందరూ పెద్ద నిర్మాణ సంస్థల్లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటారు. అవకాశాలే కాదు.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా వస్తున్నాయి. అందుకు నా దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. ► గత ఏడాది కెరీర్ పరంగా నాకు బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ కిక్ నుంచి ప్రేక్షకులు నన్ను ఇంకా బయటకు రానివ్వడం లేదు. ఎక్కడికి వెళ్లినా ‘ఇస్మార్ట్ శంకర్’ పాటలు, డైలాగ్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఆదరణతో ఈ ఏడాది కూడా అలాంటి కిక్‌నే రిపీట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ► యువ కథానాయికల మధ్య పోటీ ఉండొచ్చు. అందరూ బాగా చేస్తున్నారు. వారితో పాటు నేనూ ఇంకా కష్టపడాలనుకుంటున్నాను. ► ప్రస్తుతం సాయి తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నాను. అలానే తమిళ, కన్నడ చిత్రాలు చేయడానికి కథలు వింటున్నాను. -
ఇకపై బ్యాడ్ సినిమాలు చేయను
ఆఫ్‌స్క్రీన్‌లో అయినా ఆన్ స్క్రీన్‌లో అయినా రవితేజ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆ ఉత్సాహమే రవితేజకు మాస్ మహారాజా అనే పేరు తెచ్చిపెట్టింది. ఈ మాస్ మహారాజా ఈ నెల 24న ‘డిస్కో రాజా’గా థియేటర్స్‌లోకి వస్తున్నారు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ‘సాక్షి’తో రవితేజ చెప్పిన విశేషాలు. ► మీ సంక్రాంతి వేడుకలు ఎలా జరిగాయి? కుటుంబంతో హాయిగా గడిపాను. మంచి ఫుడ్, మంచి సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. ► ‘డిస్కోరాజా’ చిత్రకథ ఏంటి? ఇందులో మీరు ఎలాంటి పాత్ర చేశారు? ఈ సినిమాలో నా పాత్ర గురించి, సినిమా కథ గురించి ప్రస్తుతం ప్రేక్షకుల్లో భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేశానా? నా పాత్రలో షేడ్స్ ఉంటాయా? కథ సైంటిఫిక్ థ్రిల్లరా? నా క్యారెక్టర్‌కు ఏదైనా సిండ్రోమా? అని రకరకాలుగా మాట్లాడుకుంటూ మా సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఉన్న కొత్తదనం, థ్రిల్‌ను ఆడియన్స్ ఫీల్ అవ్వాలనే కథ గురించి ఇప్పుడు ఏం చెప్పాలనుకోవడం లేదు. అలాగని నా క్యారెక్టర్ గురించి ప్రేక్షకులకు థియేటర్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌కు సినిమాలోని అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ వస్తుంది. సినిమా బాగా వచ్చింది. హిట్ సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. కథ నాకు బాగా నచ్చి, నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన ఏ సినిమా నన్ను నిరుత్సాహపరచలేదు. ► ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉన్నారు. కథలో వారి ప్రాముఖ్యత ఏంటి? నా సినిమాల్లో హీరోయిన్ పాత్ర కథకు కీలకంగా ఉండాలనే కోరుకుంటాను. హీరోయిన్స్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకూడదు. ఇప్పటివరకు చాలా సరదా క్యారెక్టర్లు చేసిన నభా నటేష్ ఇందులో నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్ర చేశారు. భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, అప్యాయతలకు విలువనిచ్చే పాత్ర తనది. ఇక పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. తాన్యా హోప్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారు. ► దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇలాంటి కథను ఆనంద్ నుంచి నేను ఊహించలేదు. ఆనంద్ ఏదైతే అనుకున్నాడో స్క్రీన్ పై అదే చూపించాడు. చెప్పాలంటే అనుకున్నదానికంటే ఇంకా బాగా తీశాడు. ► కథలో మీరు ఏమైనా మార్పులు సూచించారా? ఆనంద్‌కు ఎటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సెట్లో చాలా క్లియర్‌గా ఉంటాడు. సెట్లో ఆనంద్ చిరాకు పడటం కానీ, కోపగించుకోవడం కానీ నేను చూడలేదు. కాకపోతే కొంచెం మోహమాటస్తుడు. ► ‘డిస్కో రాజా’ కోసం మరొకసారి గొంతు సవరించినట్లున్నారు? సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం పిచ్చహైప్లో ఉన్నాడు. ‘డిస్కో రాజా’ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. నేను ఈ సినిమాలో ‘రమ్పమ్బమ్’ పాటకి గొంతు కలిపాను. తమన్ సరదాగా నా చేత మళ్లీ పాడించాడు. ఇంతకుముందు ‘బలుపు’ (కాజల్ చెల్లివా..), ‘పవర్’ (నోటంకీ నోటంకీ), ‘రాజాది గ్రేట్’ (రాజా రాజా ది గ్రేటూ రా) సినిమాల్లో పాటలు పాడాను. వీటిలో ‘బలుపు, పవర్’ సినిమాలకు తమనే మ్యూజిక్ అందించాడు. నా నెక్ట్స్ మూవీ ‘క్రాక్’కి కూడా తమనే సంగీత దర్శకుడు. ► ఏడాదిపాటు వెండితెరకు దూరమయ్యారు? ‘అల.. వైకుంఠపురములో....’లో డైలాగ్ ఉంటుంది కదా! ‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అని. ‘నేను గ్యాప్ తీసుకోలేదు... వచ్చింది. మరోసారి ఇలా కాకుండా సరైన ప్రణాళిక వేసుకుంటాను. ► మీ గత చిత్రాలు (టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటొని) ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి? హిట్స్ ఫ్లాప్స్ మన చేతిలో ఉండవు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఇకపై నేను బ్యాడ్ సినిమాలు చేయను. మంచి సినిమాలు మాత్రమే చేస్తాను. ఇది పక్కా. ► ఇటీవల మీరు వర్కౌట్ చేస్తోన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.. వ్యాయామం చేయడం నాకు ఇష్టం. నా దైనందిన జీవితంలో అదొక భాగం. సరైన విధానంలో, క్రమశిక్షణగా వర్కౌట్స్ చేయాలి. తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటాను. ఇప్పుడు బ్యాడ్ ఫుడ్ తీసుకోవడం లేదు. ఆల్రెడీ రెండు మూడు జన్మలకు సరిపడా తినేశాం కదా (నవ్వుతూ). ► మీ అబ్బాయి మహాధన్ ను మళ్లీ ఎప్పుడు వెండితెరపై చూపించబోతున్నారు? ‘రాజా ది గ్రేట్’లో నా చిన్నప్పటి పాత్రను మహాధన్ బాగా చేశాడని ప్రేక్షకులు అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. ప్రస్తుతానికి మహాధన్ స్కూల్‌కి వెళ్తున్నాడు. ఇప్పట్లో అయితే ఏం లేదు. మహాధన్ ప్రతి విషయం పట్ల చాలా క్లియర్‌గా ఉంటాడని మాత్రం చెప్పగలను. ఈ తరం పిల్లలు చాలా షార్ప్ అండ్ స్పీడ్ అండీ బాబు. ► ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు. ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అలా ఏం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ పెరిగింది. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ చిత్రం ఇప్పుడు విడుదలైతే ఇంకా మంచి ఫలితం వచ్చి ఉండేది. డిఫరెంట్ సినిమాలు చేయడానికి నేనూ కథలు వింటున్నాను. అందుకు తగ్గ పనులు జరుగుతున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే కొత్త రకం సినిమాలు చేయాలనుకుంటున్నాను. కొత్తరకం కంటెంట్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు చేయాలి కూడా. ► యాక్టర్‌గా ‘నీ కోసం’ (1999) చేసిన రవితేజకు, ‘డిస్కోరాజా’(2020) చేసిన రవితేజకు ఉన్న మార్పు గురించి ఏం చెబుతారు? కాలంతో పాటు ఎవరైనా మారిపోతుంటారు. అనుభవం పాఠాలు నేర్పుతుంది. అప్పటితో పోల్చితే నా ఆలోచనా ధోరణి మారింది. ఆలోచనల్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగింది. ఇంకా ఫుల్‌క్లారిటీతో ఉంటున్నాను. చాలా హాయిగా, హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. ► ఇటీవల మీరు నటించబోతున్నారని వార్తల్లో వినిపించిన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లలేదు? ‘తేరీ’ (తమిళ సినిమా) తెలుగు రీమేక్ వద్దనుకున్నాను. అలాంటి సినిమా ఇది వరకే చేశాననిపించింది. ఇంకో సినిమా (‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్లో సినిమాని ఉద్దేశిస్తూ) గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ► దర్శకత్వ శాఖలో పని చేసి ఆ తర్వాత సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తారా? ఓ కమర్షియల్ సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడో ఇప్పుడే చెప్పలేను. నిర్మాణరంగంవైపు వెళ్లాలనే ఆలోచన లేదు. ఎందుకంటే మనకు రానిది మనకెందుకు? -
కష్టాన్నంతా మరచిపోయాం – తమన్
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘కాలం ఆగాలి నా కాలి వేగం చూసి .. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి.. రమ్ పమ్ బమ్’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బప్పి లహరి, రవితేజ ఈ పాటను పాడారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. చిత్రదర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో రవితేజగారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం తమన్ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ‘రమ్ పమ్ బమ్’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ‘డిస్కోరాజా’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఆల్రెడీ విడుదలైన ‘ఢిల్లీవాలా...’, ‘నువ్వు నాతో...’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ‘రమ్ పమ్ బమ్’ పాటను చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. ఇప్పుడు ఈ పాటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తోన్న తీరు మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘రవితేజగారితో నేను కొంత గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ఇది. మా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవి్వస్తాయి. డైరెక్టర్ ఆనంద్‌గారు ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తీశారు. ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు సునీల్. ‘‘రవితేజగారితో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ ‘రమ్ పమ్ బమ్’ పాటలో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి’’ అన్నారు హీరోయిన్ నభా నటేష్. -
అది వయొలెన్స్ కన్నా భయంకరం
టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ.. వరుస ఫ్లాపులతో మాస్ మహారాజ రవితేజ సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి కొత్త కథతో, మాస్ వదిలి క్లాస్ లుక్‌తో డిస్కో రాజాగా ముందుకొస్తున్నాడు. ఈ సినిమాపై రవితేజ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఈపాటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ అదిరిపోయాయి. రవితేజ కొత్తలుక్స్తో ఆకట్టుకున్నాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా డిస్కో రాజా టీం మరో టీజర్‌ను వదిలింది. ‘సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్తోను, ఫైరింగ్స్తోను, యుద్ధాలు చేసి రిటైర్ అయి ఇంట్లో ఉంటే సడన్‌గా వచ్చే సైలెన్స్ ఉంటది చూడు.. అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్ కంటే భయంకరంగా ఉంటుంది’ అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. రవితేజ స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తుండగా డైలాగ్స్ బాగున్నాయి. రవితేజ డ్యాన్స్ చేస్తూ తుపాకీతో కాల్చి చంపడం డిఫరెంట్‌గా ఉంది. ‘డిస్కో రాజా’ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజని తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. చదవండి: ‘డిస్కోరాజా’ టీజర్ వచ్చేసింది! -
లక్కీవాలా
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటించారు. రామ్‌తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమాలోని ‘‘ఢిల్లీవాలా.. ఢిల్లీవాలా...హ్యాపీ గో లక్కీవాలా’ అనే పాటను శనివారం విడుదల చేశారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియార్ పాడారు. ఈ సినిమాకు తమ¯Œ సంగీతం అందించారు. ఇది హీరో ఇంట్రడక్ష¯Œ సాంగ్ అని చిత్రబృందం పేర్కొంది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ సింహా, ‘వెన్నెల’ కిశోర్, సత్య కీలక పాత్రలు పోషించారు. ‘డిస్కోరాజా’ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. -
క్లాస్ రాజా
రవితేజ మాస్‌రాజా. వీఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా కోసం ‘డిస్కో రాజా’గా మారారు. తాజాగా ‘డిస్కో రాజా’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో చాలా క్లాస్‌గా కనిపిస్తూ క్లాస్ రాజాలా ఉన్నారు రవితేజ. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. 1980–2019 ఇలా రెండు టైమ్‌లైన్స్‌లో కథ నడుస్తుందని సమాచారం. టీజర్‌ని చూస్తే రవితేజ మీద ఏదో ప్రయోగం జరిగినట్టు అర్థం అవుతోంది. మరి ఆ ప్రయోగం వల్ల రవితేజకు ఏం జరిగింది? దాని వల్ల విలన్స్‌కి ఏం జరిగిందో తెలియాలి. ‘‘రవితేజ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆయన రెట్రో గెటప్ ఉంటుంది. అందరికీ నచ్చే విధంగా సినిమాను సిద్ధం చేస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. 2020 జనవరి 24న ‘డిస్కో రాజా’ విడుదల కానుంది. -
‘డిస్కోరాజా’ టీజర్ వచ్చేసింది!
‘medicine is changing The very nature of Nature.. మనమీ ప్రాజెక్టు చేయకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. వీడైతే నో రికార్డ్స్, నో రిపోర్ట్స్, నో రిలేటివ్స్, జీరో రిస్క్..’ అంటూ వెరీ స్టైలిష్‌గా మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా ‘డిస్కో రాజా’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమాలో రవితేజ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఆధారంగా దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. టీజర్లో రివీల్ అయిన రవితేజ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ రేకెత్తిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్. వెరీ స్టైలిష్‌గా రవితేజను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
రాజీపడని రాజా
ప్రేక్షకుల మందుకు సరికొత్తగా వచ్చేందుకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు ‘డిస్కో రాజా’. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలోని బుర్మ సేతు అనే పాత్రలో నటిస్తున్నారు తమిళ నటుడు బాబీ సింహా. సాయి రిషిక సమర్పణలో రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘డిస్కో రాజా’ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు గురువారం నిర్మాత రామ్ తాళ్లూరి వెల్లడించారు. ఈ నెల 18తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రం టీజర్‌ను డిసెంబరు మొదటి వారంలో విడుదల చేస్తారు. ‘‘ఈ సినిమాలో గ్రాఫిక్స్ కీలకమైనవి. మేం రాజీపడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఇంతకుముందు ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డేట్ గుర్తుపెట్టుకోండి: రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై రవితేజతో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టికున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ గ్రాఫిక్ పోస్టర్, బాబీ సింహ లుక్, లిరికల్ సాంగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే సినిమా విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రవితేజ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అయితే మాస్ మహారాజ్ అభిమానులకు చిత్ర యూనిట్ తీపి కబురు చెప్పింది. ‘డిస్కో రాజా’ వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఆర్టీ తన అధికారిక ట్విటర్లో తెలిపింది. దీనికి డేట్ గర్తుపెట్టుకోండి అంటూ రవితేజ రీట్వీట్ చేశాడు. దీంతో జనవరి 24న డిస్కోరాజాతో రవితేజ థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు కన్ఫార్మ్ అయింది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని తెలిసిందే. అయితే అనుకున్న రీతిలో అవుట్‌పుట్ రాకపోవడంతో చిత్ర యూనిట్ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా వచ్చే వేసవి ప్రారంభంలో విడుదుల కావచ్చనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు. Mark the Date!! 😎#DiscoRaja https://t.co/kpy30y6hQX — Ravi Teja (@RaviTeja_offl) November 7, 2019 -
ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా
దీపావళికి ముందు రోజు ఆ తర్వాత కొత్త లుక్స్ విడుదల సందడి సాగింది. కొత్తగా వచ్చిన ఆ స్టార్స్ చిత్రాల విశేషాల్లోకి వస్తే... ఇప్పటివరకు ఒంటరిగానే దర్శనం ఇచ్చిన రాజా ఈ దీపావళి పండగకి జంటగా కనిపించి ప్రేమ గొడుగు కింద కాస్తంత చోటు దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.‘‘ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ పాట పాడారు. ఈ పాట పూర్తిగా రెట్రో ఫీల్‌ని కలిగిస్తుంది. విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. డిసెంబరు 20న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజరాజన్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, సినిమాను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత సఫలం కాలేదు. ఏడాదిగా వారిని నేను కలవలేదు. ఇదొక అసంపూర్ణమైన సినిమా. ఇప్పుడు పోస్టర్‌ను విడుదల చేశారు. మోసం చేసి సంపాదించాలనుకోవడమే వారి ఆలోచన అనుకుంటా’’ అని ఈ చిత్రం గురించి సోషల్ మీడిమాలో రానా పేర్కొన్నారు. ‘‘షూటింగ్ కోసం చాలా ఖర్చు చేశాను. పూర్తి కాని సినిమాను ఎవరూ విడుదల చేయరు. సినిమా పూర్తయిందా? లేదా? అనే విషయాన్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రామ్ మరో మాస్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యారు. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తారు. వెండితెర భీష్మగా కనిపించనున్నారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘భీష్మ’లో రష్మిక, నితిన్ -
మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో...
‘డిస్కోరాజా’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే సమయం దగ్గరపడింది. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఐస్‌ల్యాండ్‌లో జరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడ మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో కూడా షూటింగ్ చేశారు టీమ్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. వారం రోజులు షూటింగ్ జరిగితే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూరై్తపోతుందట. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
రాజా లుక్ అదుర్స్
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ లుక్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు. అదేవిధంగా ఈ నెల 19న ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ‘వెన్నెల’ కిషోర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాని డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు.