
మాస్ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క రాజా ది గ్రేట్ తప్ప ఆ తరువాత చేసిన సినిమాలేవి ఆకట్టుకోకపోవటంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డిస్కోరాజా మీదే ఆశలు పెట్టుకున్నాడు మాస్ మహారాజ్. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. వృద్ధుడిగా, యువకుడిగా రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ కథ సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ బేబీ సినిమా కథను పోలి ఉండటంతో రవితేజ పునరాలోచనలో పడ్డట్టుగా ప్రచారం జరుగుతోంది. కథలో మార్పలు చేసిన తరువాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారట డిస్కోరాజా యూనిట్. దీంతో డిస్కోరాజా కథ మళ్లీ మొదటికొచ్చినట్టైందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
Comments
Please login to add a commentAdd a comment