వీఐ ఆనంద్, రవితేజ, పాయల్, రాంకీ, రామ్ తాళ్లూరి
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్, రవితేజ పుట్టినరోజు వేడుకను ఆదివారం చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ – ‘‘డిస్కో రాజా’ సినిమాలో నా పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రామ్ తాళ్లూరి ప్యాషనేట్ నిర్మాత’’ అన్నారు. ‘‘సంవత్సరానికి మూడు సినిమాలు ఇవ్వగల సత్తా ఉన్న హీరో రవితేజ. ఆయన ఎనర్జీ ఆ రేంజ్‌లో ఉంటుంది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి.
‘‘ఈ సినిమాను అందరూ ప్రేమించి, ఎంతో ఆనందంతో పని చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు ఆనంద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు పాయల్. ‘‘రవితేజగారి పుట్టినరోజుకి మంచి సినిమా ఇచ్చాం అనుకుంటున్నాను’’ అన్నారు రామ్ తాళ్లూరి. ‘‘నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఏ భాషలో అయినా సరే సిక్స్‌ప్యాక్ విలన్ కావాలన్నది నా కోరిక’’ అన్నారు సునీల్. ‘‘వీఐ ఆనంద్ క్లారిటీ ఉన్న దర్శకుడు. రవితేజగారి ఎనర్జీ లెవల్స్ సూపర్’’ అన్నారు రాంకీ. ‘‘మూవీను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాబీ సింహా. ఈ కార్యక్రమంలో ‘సత్యం’ రాజేష్, కెమెరామేన్ కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment