డిస్కో రాజా.. సెన్సార్‌ పూర్తి | Ravi Teja Disco Raja Telugu Movie Censor Completed | Sakshi
Sakshi News home page

డిస్కో రాజా.. సెన్సార్‌ పూర్తి

Published Mon, Jan 20 2020 8:42 PM | Last Updated on Mon, Jan 20 2020 8:42 PM

Ravi Teja Disco Raja Telugu Movie Censor Completed - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. నభా నటేష్, పాయల్‌ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు, టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక జనవరి 24న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేశారు. అయితే ఇప్పటివరకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్‌ నిరుత్సాపడుతున్నారు. అయితే మూవీ మేకింగ్‌ వీడియోను మాత్రం వదిలారు.

ఇక 2019లో రవితేజ నుంచి ఒక్క సినిమా రాని విషయం తెలిసిందే. దీంతో ఆ లోటును ‘డిస్కో రాజా’ను భర్తీ చేసి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచాలని రవితేజ భావిస్తున్నాడు. ఇక సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రవితేజ తొలిసారి నటిస్తుండటం విశేషం. ‘ఎక్కడికిపోతావ్‌ చిన్నవాడా, ఒక్క క్షణం’ లాంటి భిన్నమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వీఐ ఆనంద్‌.. రవితేజతో ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సైన్స్‌తోపాటు రవితేజ స్టైల్‌లో కామెడీ జోడించినట్లు సమాచారం. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement