
అబ్బూరి రవి, వీఐ ఆనంద్, రవితేజ, రామ్ తాళ్లూరి, రజనీ
రవితేజ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణ ముగిసింది. మాస్ రాజా రవితేజ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. వీఐఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ చిత్రం ముహూర్తం శివరాత్రి సందర్భంగా సోమవారం జరిగింది. మొదటి సన్నివేశానికి నిర్మాత రజనీ తాళ్లూరి క్లాప్ ఇవ్వగా, రామ్ తాళ్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘నేల టికెట్’ తర్వాత రవితేజగారితో మేం చేస్తున్న చిత్రమిది. వీఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. మా బ్యానర్ విలువ రెట్టింపు చేసే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు’’ అని అన్నారు. 1980 కాలంలో జరిగే కథతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ చిత్రానికి డైలాగ్స్: అబ్బూరి రవి, కెమెరా: సాయి శ్రీరామ్.
Comments
Please login to add a commentAdd a comment