రాజా వచ్చేది అప్పుడే! | Disco Raja first look on September 2nd | Sakshi
Sakshi News home page

రాజా వచ్చేది అప్పుడే!

Aug 30 2019 3:26 AM | Updated on Aug 30 2019 3:26 AM

Disco Raja first look on September 2nd - Sakshi

రాజా రెడీ అయ్యాడు. క్రిస్మస్‌ పండక్కి ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధమయ్యాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి రిషిక సమర్పణలో రామ్‌ తాళ్లూరి, రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలోని రవితేజ ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

సినిమాను క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన ప్రీ–లుక్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ వచ్చే నెల 2న గోవాలో మొదలు కానుంది. టైటిల్‌కు తగ్గట్లుగానే ‘డిస్కోరాజా’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు డైలాగ్స్‌: అబ్బూరి రవి, సంగీతం: తమన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement