రవితేజ
మాస్ రాజా రవితేజ డిస్కో రాజాగా మారి సందడి చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సందడి షురూ చేశాడని తెలిసిందే. అయితే ‘డిస్కో రాజా’ ఆగిపోయాడనే వార్తలొచ్చాయి. అలాంటిదేం లేదని సోమవారం చిత్రబృందం ప్రకటించింది. రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇందులో రవితేజ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 27న స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘మొదటి షెడ్యూల్‌కు, రెండో షెడ్యూల్‌కు మధ్య గ్యాప్ రావడంతో సినిమా ఆగిపోయింది అనే వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండటంతో దానికి తగ్గట్టుగా షూటింగ్‌ని ప్లాన్ చేసుకుంటున్నాం. దానివల్ల ఆలస్యం ఏర్పడింది. మే 27 నుంచి జూన్ 21 వరకూ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment