dual roll
-
టెక్నాలజీ అద్భుతం.. 15 సెకన్లలో ఏమైతది.. బస్సు రైలైతది
ఒక్క బటన్ నొక్కగానే రోడ్డుపై వెళ్లే బస్సు.. రైలులా మారితే? చకచకా పట్టాలపైకెక్కి గమ్యస్థానాన్ని చేరుకుంటే? అక్కడ మళ్లీ పట్టాలు దిగి బస్సుగా మారి రోడ్డు వెంట సాఫీగా సాగిపోతే? ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! కానీ ఓ జపాన్ కంపెనీ దీన్ని నిజం చేసింది. బటన్ నొక్కితే చాలు 15 సెకన్లలో బస్సు.. రైలులా, రైలు.. బస్సులా మారేలా ఓ డ్యుయల్ మోడ్ వాహనాన్ని రూపొందించింది. ఈ క్రిస్మస్ సందర్భంగా అందుబాటులోకి తెచ్చింది. జపాన్‌లోని టొకుషిమా నుంచి కొచి ప్రాంతానికి నడుపుతోంది. ఇది ప్రపంచంలోనే తొలి డ్యుయల్ మోడ్ వాహనం (డీఎంవీ). రోడ్డుపై టైర్లు.. పట్టాలపై స్టీలు చక్రాలు జపాన్‌లోని అసా సీసైడ్ రైల్వేస్ తీసుకొచ్చిన ఈ డ్యుయల్ మోడ్ వాహనం మినీ బస్సులా కనిపిస్తుంది. రోడ్డుపై సాధారణ రబ్బర్ టైర్లతో నడుస్తుంది. పట్టాలపైకి వెళ్లాక మాత్రం స్టీలు చక్రాలతో ముందుకు సాగుతుంది. పట్టాలపైకి చేరుకున్నాక బటన్ నొక్కగానే బస్సు ముందు పొట్టలో ఉన్న స్టీలు చక్రాలు బయటకు వచ్చేస్తాయి. వెనుకవైపు కూడా స్టీలు చక్రాలు బయటకు వచ్చి పట్టాలపై సరిగ్గా కూర్చుంటాయి. బస్సు ముందు టైరు పట్టాలకు తాకదు కానీ వెనుక టైరు తాకుతుంది. వెనుక టైరు ఆధారంగానే ఈ రైలు లాంటి బస్సు నడుస్తుంది. ఒకసారి పట్టాలపై చక్రాలు కూర్చున్నాక డ్రైవర్ కిందికి దిగి వాటిని పరిశీలించి అంతా సరిగ్గా ఉందనుకున్నాక ముందుకు సాగుతాడు. చదవండి: ఏమార్చి... హతమారుస్తుంది ఇంతకుముందే తయారు చేసినా.. డ్యుయల్ మోడ్ వాహనాలు (రోడ్ రైల్ వాహనాలు) ఇప్పుడే కొత్తగా ఏం కనుగొనలేదు. రైల్వే ట్రాక్‌ల పరిశీలన, నిర్వహణకు గతంలో వీటిని వాడేవారు. 1930ల్లో రోడ్ రైల్ బస్సును బ్రిటన్ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. దీనికి ‘కారియర్ రో రైలర్’ అని పేరు పెట్టింది. కొన్ని నెలలు నడిచాక దీన్ని పక్కనబెట్టారు. ఆ తర్వాత 1970ల్లో ఆస్ట్రేలియాలో, జర్మనీలో కూడా ఇలాంటి కొత్త రకం రైలు బస్సును నడిపి చూశారు. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు.. బస్సు పొడవు 8 మీటర్లు ఉంటుంది. బరువు 5,850 కిలోమీటర్లు. సాధారణ రైలు బండి కన్నా తక్కువ బరువే. డ్రైవర్‌తో కలిపి 23 మందిని తీసుకెళ్లగలదు. పట్టాలపై గంటకు 60 కిలోమీటర్లు, రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది పూర్తిగా డీజిల్‌తో నడిచే వాహనం. ఇలాంటి వాహనాలు ‘అసా’ దగ్గర మూడున్నాయి. ఈ డీఎంవీలను తిప్పే ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రణాళిక వేశారు. ఎంచక్కా సముద్రతీరాన్ని చూస్తూ ముందుకు సాగిపోవచ్చు. డీఎంవీ వెళ్లే మార్గ మధ్యలో షిషికుయ్ వేడి నీటి బుగ్గలు వస్తాయి. అక్కడ పర్యాటకులు ఆగి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. చిన్న చిన్న బీచ్‌లు, కైయో లాంటి చిన్న చిన్న పట్టణాలూ ఈ మార్గంలో ఎదురవుతాయి. కైయో లాంటి పట్టణాల్లో జనాభా తగ్గిపోతోందని, ఇలాంటి పట్టణాలకు మళ్లీ కళ తెచ్చేందుకు ఈ బస్సులు ఉపయోగపడతాయని అసా కోస్టల్ రైల్వే కంపెనీ సీఈవో చెప్పారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ Is it a bus or a train? The first 'dual-mode vehicle' is unveiled in Japan https://t.co/CPP2fGb0fL pic.twitter.com/fSARkvv5Ww — Reuters (@Reuters) December 26, 2021 -
ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం..రోడ్లపై, పట్టాలపై ఒకేలా!
World's First Dual-Mode Vehicle: బస్సు, రైలు మాదిరి రెండు విధాలుగా మాదిరిగా నడిచే సరికొత్త డీఎంవీ వాహనాన్ని జపాన్‌లోని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ రూపొందించింది. ఇది రహదారుల పై బస్సు మాదిరిగానూ, రైల్వే పట్టాలపైన రైలులా అత్యంత వేగవంతంగా వెళ్లిపోతోంది. ఇది ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడ్ వాహనం. ఈ వాహనంల రహదారులపనై నడిచేటప్పుడు రబ్బరు టైర్లపై నడుస్తుంది. రైల్వే ట్రాక్ వద్ద వాహనం అండర్బెల్లీ ఆటోమెటిక్ అడ్జ్‌మెంట్ టెక్నాలజీతో ఇంటర్ చేంజ్ అయ్యి ఉక్కుచక్రాల సాయంతో సమర్థవంతమైన రైలు బండిలా వెళ్లుతుంది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) అంతేకాదు ముందు చక్రాలు ట్రాక్ మీద నుంచి వెళ్లేలా పైకి, వెనుక చక్రాలు రైల్వే ట్రాక్‌పై నెట్టడానికి కిందకి ఉంటాయి. రహదారులకు, రైల్వే ట్రాక్‌లకు అనుగుణంగా దాని టైర్లు ఆటోమెటిక్ అడ్జెస్ట్ చేసుకుని ఆయా వాహానాల మాదిరిగా వేగవంతగా వెళ్లటమే ఈ డ్యూయల్‌మోడ్ వాహనం ప్రత్యేకత. అంతేకాదు ఈ వాహనాన్ని జపాన్‌లోని తోకుషిమా ప్రిఫెక్చర్‌లోని కైయో పట్టణంలో శనివారం బహిరంగంగా ప్రారంభించింది. ఈ మేరకు ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ సీఈవో షిగేకి మియురా తక్కువ జనాభ ఉన్న కైయో వంటి చిన్న పట్టణాలకు ఇలాంటి వాహనాలు ఉపకరిస్తాయని అన్నారు. అంతేకాదు ఈ డీఎంవీ వాహనాలు మినీ బస్సువలే కనిపిస్తుందని తెలిపారు. పైగా ఈ వాహనం సుమారు 21 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలదని అన్నారు. రైల్వే పట్టాలపై 60 కి.మీ/గం వేగంతోనూ, రోడ్డపై 100 కి.మీ/గం వేగంతో వెళ్లగలదని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ తెలిపింది. పైగా డీజిల్ ఆధారిత వాహనం అని పేర్కొంది. జపాన్ వాసులను ఈ ప్రాజెక్టు ఆకర్షించటమే కాక ప్రోత్సహిస్తారని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ సీఈవో షిగేకి మియురా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!) -
జనం మనసు దోచిన గజదొంగ
ఒక తల్లి... ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే అనుకోకుండా అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. ఒకరు చెడు మార్గంలో, మరొకరు మంచి మార్గంలో వెళుతుంటారు. విలన్ వల్ల అన్నదమ్ములిద్దరూ కలుస్తారు. అతని ఆట కట్టిస్తారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి విలన్‌పై పగ తీర్చుకుంటారు. ఇదో బ్రహ్మాండమైన బాక్సాఫీస్ ఫార్ములా! కొన్ని వందల చిత్రాలను విజయతీరాలకు చేర్చిన ఫార్ములా!! ఎన్టీఆర్ అనేకసార్లు చేసిన ఆ తరహా కమర్షియల్ ద్విపాత్రాభినయ కథలకు 1980లలో మళ్ళీ ఒక రకంగా బాక్సాఫీస్ శుభారంభం – ‘గజదొంగ’. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు కొల్లగొట్టిన ఆ ‘గజదొంగ’కు ఈ జనవరి 30తో నలభై ఏళ్ళు నిండాయి. నాలుగు దశాబ్దాల పైచిలుకు క్రితం... ఎన్టీఆర్ డేట్లున్నా, ఆయనతో సినిమా అన్నా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వ్యవహారం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తోటి సినీ నిర్మాతలు, టెక్నీషియన్లకు చిత్ర నిర్మాణానికి డేట్లిచ్చి, నిలదొక్కుకొనేలా చూసేవారు ఎన్టీఆర్. అందుకే, అప్పట్లో అందరూ ఆయనతో సినిమా తీసేందుకు ఉత్సాహపడేవారు. ఆ ముగ్గురు నిర్మాతల ముచ్చట సినీరంగంలో మొదటి నుంచి ఎన్టీఆర్ ప్రోత్సాహం అందుకున్న నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ అప్పటికి చాలా రోజులుగా ఆయనతో సినిమా తీయాలని ఉత్సాహపడుతున్నారు. అంతకు ముందే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘కేడీ నంబర్ 1’ (1978) చిత్రం హక్కులను కోస్తా ఆంధ్రా మొత్తానికీ నిర్మాత చలసాని గోపి, నటుడు కైకాల కొన్నారు. అది వంద రోజులాడి, లాభాలు తెచ్చింది. శతదినోత్సవ ప్రకటనలోనూ వారు ఎన్టీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలూ చెప్పారు. హిట్ కాంబినేషనైన కైకాల, చలసాని కలిసి, సినిమా తీసేలా ఆ పైన ఎన్టీఆర్ డేట్లిచ్చారు. అయితే, ఆర్థికంగా దెబ్బతిన్న ఒకప్పటి నిర్మాత జి. వెంకటరత్నాన్ని కూడా సహ నిర్మాతగా పెట్టుకొని, సినిమా తీయమన్నారు. అలా వచ్చిందే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వసూళ్ళ వర్షం కురిపించిన, కమర్షియల్ హిట్ – ‘గజదొంగ’. సోషల్ దుర్యోధనుడు... జేమ్స్‌బాండ్ మ్యూజిక్... 1980 జూలై 20న మద్రాసు ఏ.వి.ఎం. స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైన ‘గజదొంగ’లో అన్నదమ్ములుగా ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. సినిమా కథ ప్రధానంగా బంగారం దొంగిలించే గోల్డ్‌మ్యాన్ పాత్ర అయిన అన్నయ్య చుట్టూ తిరుగుతుంది. హీరో గజదొంగగా ఎందుకు మారాడు, అచ్చం అతనిలా ఉండే తమ్ముడి కథేమిటి, విడిపోయిన ఆ ఇద్దరూ ఎలా కలిశారు, విలన్ ఆట ఎలా కట్టించారనేది కథ. ప్రేమించిన అమ్మాయి నుంచి విడిపోయిన భగ్నప్రేమికుడైన గోల్డ్‌మ్యాన్ పాత్ర నడక, నడత – అన్నీ పౌరాణికాల్లో దుర్యోధనుడిని తలపిస్తుంది. దుర్యోధనుడి క్యారెక్టరైజేషన్‌ను దృష్టిలో పెట్టుకొని, దాన్ని సోషలైజ్ చేసి, తీశారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. సత్యానంద్ రచన, ముఖ్యంగా క్లైమాక్స్‌లో విలన్ ముందు ముగ్గురు ఎన్టీఆర్లలో అసలైన గోల్డ్‌మ్యాన్‌ను కనిపెట్టే సీన్ లాంటివి థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ‘గజదొంగ’ అనే టైటిల్‌కు తగ్గట్టే సంగీత దర్శకుడు చక్రవర్తి ఇంగ్లీషు జేమ్స్‌బాండ్ చిత్రాల స్ఫూర్తితో, ఈ చిత్రానికి రీరికార్డింగ్ చేశారు. ఆ శైలి నేపథ్య సంగీతం, ఛేజింగులు జనాన్ని ఆకట్టుకున్నాయి. కథలో గోల్డ్‌మ్యాన్ దగ్గర బ్లాకీ అనే ఓ నల్ల పెంపుడు పిల్లి, కుక్క, మాట్లాడే బొమ్మ ఉంటాయి. మూడూ ఆకర్షణీయ అంశాలయ్యాయి. బంగారం దొంగిలించే టైటిల్ పాత్రకు తగ్గట్టే కళా దర్శకుడు భాస్కరరాజు వేసిన బంగారం తాపడం చేసినట్టుగా అనిపించే గోల్డెన్ డెన్ సెట్, గద్ద బొమ్మలతో రాజాసనం లాంటివి బాగుంటాయి. అప్పటికే ఎన్టీఆర్‌కు స్పెషలిస్ట్ కాస్ట్యూమర్‌గా పాపులరైన విజయవాడ ‘యాక్స్ టైలర్స్’ వాలేశ్వరరావు డిజైన్ చేసిన బెల్ బాటమ్ ప్యాంట్లు, చొక్కాలు, గోల్డ్‌మ్యాన్ వేసుకొనే బంగారు అంచు సూటు, బూటు ఆకట్టుకున్నాయి. విరిగిన చేతితోనే... షూటింగ్! ‘గజదొంగ’ టైములోనే ‘సర్దార్ పాపా రాయుడు’ షూటింగ్లో బుల్లెట్ మీద నుంచి పడి, ఎన్టీఆర్ కుడి చేయి ఫ్రాక్చరైంది. కానీ, విశ్రాంతి తీసుకుంటే డేట్లు వృథా అయి, నిర్మాతలు ఇబ్బంది పడతారని ఆలోచించి, వాళ్ళ క్షేమం కోసం చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ ‘గజదొంగ’ పాటలు, క్లైమాక్స్‌లో పాల్గొన్నారు. ‘అల్ల నేరేడు చెట్టుకాడ’, ‘చుప్పనాతిచందురుడు’, ‘ఒక రాతిరి ఒక పోకిరి’ పాటలు మూడింటిలోనూ సలీమ్ మాస్టర్ నృత్యసారథ్యంలో, ఎడమ చేతితోనే డ్యా¯Œ ్స మూవ్మెంట్లు ఇస్తూ, విషయం కనపడనివ్వకుండా కవర్ చేశారు. కోటి రూపాయల గ్రాస్! ‘గజదొంగ’ అని టైటిల్ పెట్టినా, ఎన్టీఆర్‌కూ, స్పెషల్ సి.ఐ.డి పాత్రధారి సత్యనారాయణకీ మధ్య ఒక్కటే ఫైట్ ఉంటుంది. మిగతా సినిమా ఛేజింగుల మీదే నడుస్తుంది. దీనిపై ఫ్యాన్స్‌లో కొంత అసంతృప్తి వినిపించడంతో, రిలీజైన 50 రోజుల తరువాత సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో ఫైటర్లతో ఎన్టీఆర్ చేసే కారుషెడ్డు ఫైట్‌ను కొత్తగా కలిపారు. ఈ చిత్రం రూ. కోటి గ్రాస్ కలెక్ట్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్ళ గజదొంగగా నిలిచింది. తెలుగు సినీచరిత్రలో అలా కోటి రూపాయల గ్రాస్ వచ్చిన 10వ సినిమా ఇది. వాటిలో ఎన్టీఆర్‌కు ఇది 9వ సినిమా. అంటే, అప్పటికి ఒక్క ‘శంకరాభరణం’ మినహా, ‘లవకుశ’ మొదలుకొని కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన మిగతా తొమ్మిది తెలుగు చిత్రాలూ ఎన్టీఆర్వే అన్న మాట! తరువాతి కాలంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్లు తీసిన దర్శకుడు బి. గోపాల్ ‘గజదొంగ’కి రాఘవేంద్రరావు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయడం విశేషం. ఫస్ట్ వీక్ ఇండస్ట్రీ రికార్డ్ ‘గజదొంగ’కు ఎన్టీఆర్ పారితోషికం రూ. 17 లక్షలు. పారితోషికంతో కలిపి, ఆ రోజుల్లో రూ. 35 లక్షల లోపే సినిమా నిర్మాణం అయిపోయింది. ఒకటి, రెండు ఏరియాలు మాత్రం నిర్మాతలు ఉంచుకొని, అన్ని ఏరియాలూ దాదాపు రూ. 50 లక్షల పైచిలుకుకు అమ్మేశారు. సినిమా కమర్షియల్‌గా హిట్టయి, బయ్యర్లకూ లాభాలు తెచ్చింది. 45 ప్రింట్లతో రిలీజైన ‘గజదొంగ’ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే (బెంగళూరు, వగైరా ఏరియాలు కలపకుండానే) మొదటి వారం రూ. 34 లక్షలకు పైగా వసూలు చేసి, అప్పటి ఇండస్ట్రీ రికార్డును దాటేసింది. అంతకు ముందు ‘ఛాలెంజ్ రాముడు’ (బెంగుళూరుతో కలిపి రూ. 31 లక్షలు), ‘సర్దార్ పాపారాయుడు’ (ఓన్లీ ఏ.పి. రూ. 29 లక్షలు) తొలి వారం వసూళ్ళలో ఇండస్ట్రీ రికార్డులు. ఆ రెంటినీ అధిగమించిన ‘గజదొంగ’ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ళు కొల్లగొట్టింది. పాతిక సెంటర్లలో 50 రోజులు ఆడింది. వైజాగ్, గుంటూరు కేంద్రాల్లో డైరెక్టుగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరుల్లో సింగిల్ షిఫ్టుతో, ఒంగోలు, తిరుపతిలో నూన్ షోలతో ‘గజదొంగ’ శతదినోత్సవం చేసుకుంది. అలాగే, బెజవాడ, వైజాగుల్లో షిఫ్టింగులతో రజతోత్సవం జరుపుకొంది. నిజానికి, సహ నిర్మాత వెంకటరత్నానికి మొదట్లోనే రూ. 2–3 లక్షల మొత్తం ఇచ్చేసి వదిలించుకొని, సినిమా మొత్తం తామే నిర్మించాలని మిగిలిన ఇద్దరు నిర్మాతలూ భావించారు. కానీ, వెంకటరత్నం మాత్రం అలా వద్దంటూ, నిర్మాణంలో 20 పైసల వాటా ఉంచుకున్నారు. ఆ నిర్ణయమే ఆయనకు లాభించింది. తొలి రిలీజుతో పాటు, మలి విడతలో మరో రెండు రిలీజులకు కూడా సినిమా బాగా లాభాలు తెచ్చింది. అలా వెంకట రత్నానికి వచ్చిన మొత్తం మొదట్లో ఇవ్వజూపిన రూ. 2 –3 లక్షల కన్నా చాలా ఎక్కువే. ఇక, మూడో రిలీజు సమయానికి నిర్మాత కైకాల నాగేశ్వరరావు (సత్యనారాయణ తమ్ముడు) మిగతా ఇద్దరు నిర్మాతల వాటాడబ్బులు లెక్కకట్టి చెల్లించేసి, సినిమా పూర్తి హక్కులు పొందారు. ఫ్యాన్స్ అడిగినా... ఎన్టీఆర్ నో! ఫస్ట్ రిలీజ్లో బెజవాడలో ఈ చిత్రాన్ని ఏకంగా 4 హాళ్ళ (అప్సర, శేష్‌మహల్, పటమట రామకష్ణా, గుణదల రామ్‌గోపాల్)లో వేశారు. కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ, విజయవాడలో మెయిన్ థియేటరైన అప్సరలో ‘గజదొంగ’ 84 రోజులే ఆడింది. అది తీసేసి, హీరో కృష్ణంరాజు ‘పులిబిడ్డ’ (1981 ఏప్రిల్ 24న) రిలీజ్ చేశారు. ‘గజదొంగ’ను హాలులో నుంచి తీసేసే సమయంలో ఎన్టీఆర్ విజయవాడలో ఉన్నారు. బెజవాడ కనకదుర్గ గుడి కొండ మీద ‘అనురాగ దేవత’ చిత్రంలోని ‘ముగ్గురమ్మల గన్నా ముద్దుల మాయమ్మ...’ అనే పాట ఎన్టీఆర్, జయసుధలపై చిత్రీకరిస్తున్నారు. అప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెళ్ళి, ‘గజదొంగ’ పంపిణీదారులైన ‘లక్ష్మీ ఫిలిమ్స్’ వారిని కలసి, అప్సర థియేటర్లో 100 రోజుల దాకా తమ హీరో సినిమా కొనసాగించాలని కోరారు. ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగమూర్తికి ఎన్టీఆర్‌తో ఫోన్ చేయిస్తే, ఫలితం ఉంటుందని పంపిణీ వర్గాల నుంచి ఫ్యాన్స్‌కు సలహా వచ్చింది. దాంతో, ఫ్యాన్స్ వెళ్ళి, ‘అనురాగ దేవత’ షూటింగులో ఎన్టీఆర్‌ను కలిశారు. ఆ జనవరిలో రిలీజైన ‘‘ఇతర చిత్రాల వంద రోజుల వసూళ్ళ కన్నా, 50 రోజులకే ఎక్కువ కలెక్షన్లు తెచ్చిన ‘గజదొంగ’ను 84 రోజులకే ఎత్తేస్తున్నార’’ని ఫిర్యాదు చేస్తూ, డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేయాలంటూ అభ్యర్థించారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం డిస్ట్రిబ్యూటర్లకున్న ఆబ్లిగేషన్లను గ్రహించాలంటూ సముదాయించారు. ‘‘మన సినిమాను మరో రెండు వారాలు ఆడితే కొత్తగా వచ్చే ఘనత లేదు, ఆడకపోతే పోయేదీ లేదు. ఆల్రెడీ మనకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు వచ్చాయి కదా’’ అంటూ అభిమానులను అనునయించారు. వీరాభిమానులు అడిగినా సరే, ‘గజదొంగ’ను 100 రోజులు ఆడించేందుకు ఎన్టీఆర్ తన పలుకుబడిని వాడకపోవడం అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రిపీట్ రన్స్ లోనూ... గమ్మత్తేమిటంటే ఆ తర్వాత 1983లో, ’87లో, 1990లో– ఈ 3 రిపీట్ రన్స్ లోనూ ‘గజదొంగ’ మళ్ళీ రెగ్యులర్ షోలతో ఏకంగా యాభయ్యేసి రోజుల చొప్పున ఆడింది. చెప్పాలంటే ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ కన్నా ‘గజదొంగ’ రిపీట్ రన్స్‌లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తూ వచ్చింది. ‘‘1990లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు 13 నెలల కాలానికి రెండున్నర లక్షలు పెట్టి ‘గజదొంగ’ రైట్స్ కొన్నాం. చిరంజీవి ‘కొండవీటి దొంగ’ రిలీజ్ టైమ్‌లో 1990 మార్చి 9న గుంటూరులో ‘గజదొంగ’ రిపీట్ రన్ వేశాం. ఒక వారం ఆలస్యంగా విజయవాడలోనూ రిలీజ్ చేశాం. సినిమా 50 రోజులు ఆడింది. ఆరున్నర లక్షలు వ్యాపారం చేసి, మా పెట్టుబడి, ఖర్చులు వెనక్కి రావడమే కాక అప్పట్లోనే రూ. 2 లక్షల లాభం మిగిలింది’’ అని గుంటూరు శ్రీలలితా ఫిలిమ్స్ పంపిణీదారు, పలు చిత్రాల కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. వెరసి, కథ, కథనం మొదలు పబ్లిసిటీ దాకా ‘గజదొంగ’ అనుసరించిన మాస్ కమర్షియల్ పంథా ఆ తరువాత కొత్త తరానికి కూడా బాక్సాఫీస్ రాచబాట అయింది. 10 వారాలు... ముగ్గురు హీరోలు.. మూడు హిట్స్! ‘గజదొంగ’లో గోల్డ్ మ్యాన్ సరసన జయసుధ, తమ్ముడి పాత్ర సరసన శ్రీదేవి నటించారు. ఆ ఏడాది శ్రీదేవి, జయసుధ కలసి నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్. శ్రీదేవి ఇంకా పూర్తిగా ఫైల్లోకి రాక ముందు వారిద్దరూ కలసి శోభన్ బాబు ‘బంగారు చెల్లెలు’, అక్కినేని ‘ముద్దుల కొడుకు’ (1979) లాంటి చిత్రాల్లో చేశారు. కాకపోతే, ఒక పాత్ర పోయాక రెండో పాత్ర వస్తుంది. కానీ, ఇద్దరికీ సమప్రాధాన్యం ఉండేలా వారు చేసిన చిత్రాలు – 1981లో ఎన్టీఆర్ ‘గజదొంగ’, ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’, శోభన్‌బాబు ‘ఇల్లాలు’. కేవలం 10 వారాల వ్యవధిలోనే ఆ నాటి పెద్ద హీరోలు ముగ్గురితోనూ ఆ హీరోయిన్లిద్దరూ కలసి మూడు సినిమాలు చేయడం, ఆ మూడూ ఆ ఏడాది అతి పెద్ద హిట్లు కావడం ఓ విశేషం. శ్రీదేవి, జయసుధ అరవై ఏళ్ళ హీరోతో... ‘హాట్’ పాట! నిజజీవితంలో అరవయ్యేళ్ళ వయసుకు దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ కూ, 17 ఏళ్ళ టీనేజర్ శ్రీదేవికీ మధ్య ‘గజదొంగ’లో ‘ఇదో రకం దాహం...’ అంటూ తెరపై పూర్తి హాట్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడం విచిత్రం. రాత్రి ఏ పొద్దుపోయాకో చూడదగ్గ ఈ పాటను ఆ రోజుల్లో, ఆ వయసు ఎన్టీఆర్ మీద తీయడం, జనాన్ని ఒప్పించడం కష్టమే. రాఘవేంద్రరావు చేయదలచిన ఆ రిస్క్‌కు ఎన్టీఆర్ ఓకే అన్నారు. యూనిట్టేమో భయపడి, రిలీజ్ ముందైనా పాట తీసేయాల్సి వస్తుందని సందేహించారు. కానీ, చివరకు ఆ రిస్కీ పాట జనంలోకి వెళ్ళి, ఆమోదం పొందడం విశేషం. డ్యుయట్లు సైతం మాస్ మెచ్చే ధోరణిలో చేసే ఎన్టీఆర్, ఈ అతి శంగార గీతానికి రిస్కును అర్థం చేసుకొని, లలితంగా నటించి మెప్పించారని దర్శకుడు రాఘవేంద్రరావే ఓ సందర్భంలో వివరించారు. మొత్తానికి, అలా రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ చేసిన రిస్కు ఫలించింది. ఇక, ఈ సినిమాలోనే జయసుధపై వచ్చే ‘ఇంద్రధనుసు చీరగట్టి..’, భగ్నప్రేమికుడిగా ఎన్టీఆర్ ఆవేశంగా పాడే ‘రెండక్షరాల ప్రేమ...’ పాటలూ ఆ రోజుల్లో పదే పదే వినిపించేవి. ఆల్‌టైమ్ జయమాలిని హిట్! ‘గజదొంగ’లోని 7 పాటలూ 7 రకాలుగా, ఒకదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. వేటూరి రాసిన ఈ పాటలన్నీ కమర్షి యల్ హిట్. ముఖ్యంగా, ఎన్టీఆర్ గోల్డ్‌మ్యాన్ పాత్రకూ, శృంగార తార జయమాలినికీ మధ్య వచ్చే ‘నీ ఇల్లు బంగారం కానూ’ పాట అతి పెద్ద హిట్. జయమాలిని ఆల్‌టైమ్ హిట్స్‌లో అగ్రస్థానంలో నిలిచే ఆ పాట సినిమాకు ప్లస్ అయింది. ఇప్పటికీ తరచూ వినిపిస్తూ, యూ ట్యూబ్‌లోనూ జయమాలిని పాటల్లో ఎక్కువ వ్యూస్ ఉండే పాటగా ఇదే ట్రెండింగ్! గమ్మత్తేమిటంటే, కొన్నేళ్ళ క్రితం టీవీ యాంకర్ ఉదయభాను చేసిన ‘నీ ఇల్లు బంగారం కానూ’ లాంటి టీవీ షోలు ఆ పాటనూ, సినిమానూ జనం నోట నిలిచేలా చేశాయి. అప్పట్లో ఆ పాటలో జయమాలిని ధరించిన కాస్ట్యూమ్ చాలా ఫేమస్. రాఘవేంద్రరావు తెలుగు హిట్ ‘దేవత’ (1982)ను హిందీలో ‘తోఫా’ (1984)గా రీమేక్ చేసినప్పుడు, హీరోయిన్ శ్రీదేవికి సైతం అదే రకం డ్రెస్ వేయడం మరో విశేషం. ఫ్లోరసెంట్ పోస్టర్ల ట్రెండ్ ‘గజదొంగ’ ఫస్ట్ రిలీజ్ టైమ్‌లో చెన్నైలోని ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గమ్మత్తుగా పబ్లిసిటీ చేశారు. అంతకు కొద్ది నెలల ముందు కమలహాసన్ నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘గురు’ (1980) వచ్చింది. అందులో కమలహాసన్ త్రీడీ కళ్ళద్దాల లాంటివి పెట్టుకోవడం, వజ్రాలు పొదిగిన గద్ద బొమ్మ దొంగతనం లాంటి సీన్లతో ఓ స్టిల్ ఉండేది. ‘గురు’కు కూడా తానే పబ్లిసిటీ బాధ్యతలు నిర్వహించిన ఈశ్వర్ ఆ స్టిల్ స్ఫూర్తితో, ఎన్టీఆర్ ‘గజదొంగ’కు ఫ్లోరసెంట్ కలర్స్‌తో హైలైట్ అయ్యేలా వాల్ పోస్టర్లు డిజైన్ చేశారు. విజయవాడ నేషనల్ లితో ప్రింటర్స్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఆ ‘30 బై 40’ సైజు పోస్టర్లను ప్రింట్ చేసేవారు. దాని మీద అక్కడి మరో పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ పి.ఎ. రంగా ఫ్లోరసెంట్ ఎఫెక్ట్ వేసేవారు. చీకటిలో సైతం మెరిసే ఆ ఫ్లోరసెంట్ వాల్ పోస్టర్లను స్తంభాలకు అంటించడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్. ఆ ఫ్లోరసెంట్ పోస్టర్ల ట్రెండ్ తరువాత ఇంకా ఊపందుకొని, కొన్నేళ్ళపాటు చాలా సినిమాలు ఆ పబ్లిసిటీ పద్ధతిని అనుసరించాయి. – రెంటాల జయదేవ -
మళ్లీ డబుల్ యాక్షన్?
‘సిరుల్తై’ (‘విక్రమార్కుడు’ చిత్రం తమిళ రీమేక్) చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు హీరో కార్తీ. మరోసారి స్క్రీన్ మీద డబుల్ యాక్షన్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇరుంబుదురై (తెలుగులో అభిమన్యుడు), హీరో (తెలుగులో శక్తి) చిత్రాలకు దర్శకత్వం వహించిన పీయస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు కార్తీ. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారనేది తాజా వార్త. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కాకుండా ‘సుల్తాన్, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు చేస్తున్నారు కార్తీ. -
ఆ రెండు పాత్రల్లో మూడోసారి
హీరో సూర్య మరోసారి తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘వారనమ్ ఆయిరమ్’ (సూర్య సన్నాఫ్ కృష్ణన్), విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘24’ చిత్రాల్లో సూర్య తండ్రీకొడుకు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘వాడీ వాసల్’ అనే చిత్రంలోనూ తండ్రీకొడుకుగా నటించనున్నారట. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రారంభించనున్నారు. తమిళనాడులో ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టు ఆధారంగా ఈ చిత్రం నిర్మించనున్నారు. జల్లికట్టులో భాగంగా ఎద్దును మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి పాత్ర తన ప్రాణాలు కోల్పోయే సన్నివేశం ఉందట. తండ్రి పాత్రకు సీనియర్ నటులు సత్యరాజ్, రాజ్కిరణ్లను అనుకున్నారట. అయితే ఫైనల్‌గా తండ్రి పాత్రని కూడా సూర్య చేయనున్నారట. -
డబుల్ ధమాకా
‘అల వైకుంఠపురములో...’ ఘన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పుడు సుకుమార్ సినిమాకి డబుల్ ఎనర్జీతో ఎంటర్ కాబోతున్నారని సమాచారం. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. గుబురు గడ్డం, రింగుల జుత్తుతో లారీ డ్రైవర్‌గా ఒక పాత్రలో కనిపిస్తే మరో పాత్రలో స్టయిలిష్ బిజినెస్‌మేన్‌గా కనిపిస్తారట. సాధారణంగా బన్నీ (అల్లు అర్జున్) సినిమాలంటే ఎనర్జీ.. మరి రెండు పాత్రల్లో బన్నీ కనిపిస్తే కచ్చితంగా డబుల్ ఎనర్జీయే. మార్చి రెండో వారం నుంచి అల్లు అర్జున్, రష్మికా చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
డబుల్ ధమాకా?
బాల నటుడిగా ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డబుల్ యాక్షన్ చేశారు మహేశ్‌బాబు. హీరోగా మారిన తర్వాత పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేయలేదాయన. కానీ త్వరలోనే స్క్రీన్‌పై మహేశ్‌ను రెండు పాత్రల్లో చూడబోతున్నాం అని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో మహేశ్‌బాబు రెండు పాత్రల్లో కనిపిస్తారని టాక్. అందులో ఒక పాత్ర గ్యాంగ్‌స్టర్‌గా ఉంటే మరోటి ప్రొఫెసర్ పాత్ర అని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
రాజా ఆగిపోలేదు
మాస్ రాజా రవితేజ డిస్కో రాజాగా మారి సందడి చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సందడి షురూ చేశాడని తెలిసిందే. అయితే ‘డిస్కో రాజా’ ఆగిపోయాడనే వార్తలొచ్చాయి. అలాంటిదేం లేదని సోమవారం చిత్రబృందం ప్రకటించింది. రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్లో కనిపిస్తారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 27న స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘మొదటి షెడ్యూల్‌కు, రెండో షెడ్యూల్‌కు మధ్య గ్యాప్ రావడంతో సినిమా ఆగిపోయింది అనే వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండటంతో దానికి తగ్గట్టుగా షూటింగ్‌ని ప్లాన్ చేసుకుంటున్నాం. దానివల్ల ఆలస్యం ఏర్పడింది. మే 27 నుంచి జూన్ 21 వరకూ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
డబుల్తార
ఇండస్ట్రీకి నయనతార వచ్చి దాదాపు 15 ఏళ్లు పూర్తి కావొస్తోంది. కానీ ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై డబుల్ నయనతారను చూసుండరు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. అవును.. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘మా, లక్ష్మీ’ వంటి తమిళ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పేరు సంపాదించుకున్న కేఎమ్ సర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన ‘ఆరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’) సినిమాను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్‌నే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఐరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘‘విభిన్నమైన జానర్స్‌ను ట్రై చేయడానికి ఇష్టపడుతుంటాను. కానీ హారర్ జానర్ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పుడు ఈ హారర్ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో రూపొందుతున్న తొలి సినిమాలోనే నయనతార నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు సర్జున్. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట చిత్రబృందం. ఈ సినిమా కాకుండా మరో మూడు తమిళ సినిమాలు నయనతార బ్యాంకులో ఉన్నాయి. తెలుగులో చిరంజీవి ‘సైరా’లో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఒక్కరు కాదు... ఇద్దరు!
సాయిధరమ్ తేజ్ (తేజూ) హీరోగా దర్శకత్వంలో సి. కల్యాణ్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో ఒక్కరు కాదు... ఇద్దరున్నారని కృష్ణానగర్ కుర్రాళ్లు చెబుతున్నారు. ఒక హీరో తేజూ, మరొక హీరో ఎవరంటే... సాయిధరమ్ తేజే అంటున్నారు. దీని మీనింగ్ ఏంటంటే... ఈ సినిమాలో హీరోది డ్యూయల్ రోల్ అట! తేజూ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న మాట. అందులో ఓ గెటప్ యంగ్‌గా, మరో గెటప్ పెద్ద పెద్ద మీసాలతో ఉంటుందట. నిజంగానే తేజూ డ్యూయల్ రోల్ చేస్తున్నారా? లేదా తన పాత్రలో డ్యూయల్ షేడ్స్ ఉంటాయా? అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ తేజూ డ్యూయల్ రోల్ చేయలేదు. ఒకవేళ, వినాయక్ దర్శకత్వంలో డ్యూయల్ యాక్షన్ చేస్తున్నారనేది నిజమైతే... కెరీర్లో ఫస్ట్‌టైమ్ చేస్తున్నట్టవుతుంది. హీరోతో డ్యూయల్ యాక్షన్ చేయించడం వినాయక్‌కు కొత్త కాదు. అందులో ఆయన ఎక్స్పర్ట్. ‘చెన్నకేశవరెడ్డి, అదుర్స్, నాయక్’ సినిమాల్లో హీరోల చేత ద్విపాత్రాభియనం చేయించారు. ‘అల్లుడు శీను’లో అయితే ప్రకాశ్‌రాజ్ చేత రెండు పాత్రలు చేయించారు. -
డ్యూయెల్ రోల్లో ధనుష్
నటుడు ధనుష్ ద్విపాత్రాభినయానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. వేలై ఇల్లా పట్టాదారి, మారి చిత్రాల సక్సెస్‌తో యమ స్పీడ్ మీదున్న ఈయన ప్రస్తుతం వీఐపీ2(వేలై ఇల్లా పట్టాదారికి సీక్వెల్) చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తదుపరి ప్రభు సాలమెన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. తదుపరి వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. తాజాగా మరో చిత్రానికి ధనుష్ పచ్చజండా ఊపారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకు ముందు ఎదుర్‌నీచ్చల్,ఆ మధ్య విడుదలైన కాక్కిసట్టై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్ని తెరకెక్కించిన యువ దర్శకుడు దురై సెంథిల్ దర్శకత్వంలో ధనుష్ నటించడానికి ఓకే అన్నారట. విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారట. తన 13 ఏళ్ల సినీ కేరీర్లో ధనుష్ ఇప్పటి వరకూ డ్యూయల్ రోల్ పోషించలేదన్నది గమనార్హం. కాబట్టి ఇది ధనుష్ అభిమానులకు ఆనందకరమైన వార్తే అవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం 2016 సంవత్సరంలో తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తునట్లు తెలిసింది.