‘అల వైకుంఠపురములో...’ ఘన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పుడు సుకుమార్ సినిమాకి డబుల్ ఎనర్జీతో ఎంటర్ కాబోతున్నారని సమాచారం. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. గుబురు గడ్డం, రింగుల జుత్తుతో లారీ డ్రైవర్‌గా ఒక పాత్రలో కనిపిస్తే మరో పాత్రలో స్టయిలిష్ బిజినెస్‌మేన్‌గా కనిపిస్తారట. సాధారణంగా బన్నీ (అల్లు అర్జున్) సినిమాలంటే ఎనర్జీ.. మరి రెండు పాత్రల్లో బన్నీ కనిపిస్తే కచ్చితంగా డబుల్ ఎనర్జీయే. మార్చి రెండో వారం నుంచి అల్లు అర్జున్, రష్మికా చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment