World's First Dual-Mode Vehicle: బస్సు, రైలు మాదిరి రెండు విధాలుగా మాదిరిగా నడిచే సరికొత్త డీఎంవీ వాహనాన్ని జపాన్‌లోని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ రూపొందించింది. ఇది రహదారుల పై బస్సు మాదిరిగానూ, రైల్వే పట్టాలపైన రైలులా అత్యంత వేగవంతంగా వెళ్లిపోతోంది. ఇది ప్రపంచంలోనే తొలి డ్యూయల్ మోడ్ వాహనం. ఈ వాహనంల రహదారులపనై నడిచేటప్పుడు రబ్బరు టైర్లపై నడుస్తుంది. రైల్వే ట్రాక్ వద్ద వాహనం అండర్‌బెల్లీ ఆటోమెటిక్ అడ్జ్‌మెంట్ టెక్నాలజీతో ఇంటర్ చేంజ్ అయ్యి ఉక్కుచక్రాల సాయంతో సమర్థవంతమైన రైలు బండిలా వెళ్లుతుంది.
(చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!)
అంతేకాదు ముందు చక్రాలు ట్రాక్ మీద నుంచి వెళ్లేలా పైకి, వెనుక చక్రాలు రైల్వే ట్రాక్‌పై నెట్టడానికి కిందకి ఉంటాయి. రహదారులకు, రైల్వే ట్రాక్‌లకు అనుగుణంగా దాని టైర్లు ఆటోమెటిక్ అడ్జెస్ట్ చేసుకుని ఆయా వాహానాల మాదిరిగా వేగవంతగా వెళ్లటమే ఈ డ్యూయల్‌మోడ్ వాహనం ప్రత్యేకత. అంతేకాదు ఈ వాహనాన్ని జపాన్‌లోని తోకుషిమా ప్రిఫెక్చర్‌లోని కైయో పట్టణంలో శనివారం బహిరంగంగా ప్రారంభించింది.
ఈ మేరకు ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ సీఈవో షిగేకి మియురా తక్కువ జనాభ ఉన్న కైయో వంటి చిన్న పట్టణాలకు ఇలాంటి వాహనాలు ఉపకరిస్తాయని అన్నారు. అంతేకాదు ఈ డీఎంవీ వాహనాలు మినీ బస్సువలే కనిపిస్తుందని తెలిపారు. పైగా ఈ వాహనం సుమారు 21 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలదని అన్నారు. రైల్వే పట్టాలపై 60 కి.మీ/గం వేగంతోనూ, రోడ్డపై 100 కి.మీ/గం వేగంతో వెళ్లగలదని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ తెలిపింది. పైగా డీజిల్ ఆధారిత వాహనం అని పేర్కొంది. జపాన్ వాసులను ఈ ప్రాజెక్టు ఆకర్షించటమే కాక ప్రోత్సహిస్తారని ఆసా కోస్ట్ రైల్వే కంపెనీ సీఈవో షిగేకి మియురా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment