శాస్త్రవేత్తలు, మహామహా మేధావులు ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలు చేయడం గురించి విన్నాం. అవన్నీ పూర్తి స్థాయిలో ఫలవంతమయ్యేందుకు దేవుడు వైపు(ప్రకృతి వైపు) చూడక తప్పేది కాదు. ఆయన చేసిన సృష్టి అద్భుతమే ఓ గొప్ప మేథస్సు. దాని సాయంతోనే ఆవిష్కరణలు ఫలమంతమయ్యేవి. అలాంటి ఘటనే జపాన్ బుల్లెట్ రైలు విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే..
జపాన్ శాస్త్రవేత్తలు సాంకేతికతో కూడిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లను రూపొందించారు. అవి ప్రజల దూరాలను దగ్గర చేసి సమయాన్ని ఆదా చేసేలా అత్యంత నాణ్యతతో రూపొందించారు. అయితే జపాన్‌లో రైలు మార్గం చాలా వరకు టన్నెళ్లతో కూడినది. దీంతో గంటక సుమారు 240 నుంచి 320 కిలోమీటర్లు దూరం ప్రయాణించే ఈ బల్లెట్ రైళ్లు ఈ టన్నెల్ గుండా వెళ్లగానే భారీ శబ్దాలు వచ్చేవి. ఎంతలా అంటే ఇవి దాదాపు 400 మీటర్లు దూరంలో ఉన్న నివాసితులకు వినిపించేంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. దీంతో ఈ రైళ్లపై ఫిర్యాదులు రావడం మొదలయ్యింది. నిజంగానే ఆ శబ్దాలు భరిచలేనంత పెద్దగా వచ్చేవి. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని వెతకడం ప్రారంభించారు.
పలు సమావేశాల్లో చర్చల్లో దీనికి పరిష్కారం ప్రకృతిని పరిశీలించే కనుగొనగలమని ఒక శాస్త్రవేత్త సూచించడంతో..ఈ బుల్లెట్ ట్రెయిన్‌ని ఆవిష్కరించిన ఇజీ నకాట్సు ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇక్కడ బుల్లెట్ రైలు అత్యంత వేగంతో టన్నెల్ గుండా వెళ్తుండటంతో దాని ముందున్న అట్మాస్పియరిక్ ప్రెజరే ఈ బారీ శబ్దానికి కారణమని గుర్తించాడు. ఇలా ఆకాశం నుంచి వేగవంతంగా పయనించి భూమ్మీదకు వచ్చే జీవి ఉందా అనే దిశగా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడే కింగ్ ఫిషర్ బర్డ్ జ్ఞప్తికి వచ్చింది. అది ఆకాశ నంచి అత్యంత వేగంగా వచ్చి నీటిలోకి శబ్దం లేకుండా తల ముంచి చేపలను లటుక్కున పట్టుకునే తీరు నకాట్సని సరికొత్త ఆలోచనను రేకెత్తించింది.
దాని ముక్కు అత్యంత సూదిగా పొడుగుగా ఉండటంతోనే కదా నీటిపై శబ్దం చేయకుండా లోపలకు ముంచి చేపను పట్టుకోగలుగుతుంది అని గుర్తించాడు. దీన్నే బుల్లెట్ రైలుకి అప్లైచేసి దాని రూపురేఖలు మార్పు చేస్తాడు. అనుహ్యాంగా అది టన్నెల్ గుండా వెళ్లినప్పుడూ ఎలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టించకుండా నిశబ్దంగా వెళ్తుంది. ఈ కొత్త డిజైన్ శబ్దాన్ని తగ్గించడమే కాకుండా, రైళ్లను 15% వేగంగా, 15% శక్తిని ఆదాచేసేలా చేసింది. దేవుడి అద్భత సృష్టిని కాపీ కొట్టడం ద్వారా ఇది సాధ్యం అయ్యిందని ఆయన మేథస్సు ముందు మానవ మేథస్సు చిన్నదేనని నకాట్సు అన్నారు.
Japan's famous bullet train used to make a loud boom when it travelled through tunnels. But, thanks to a spot of bird-watching, an engineer was able to fix the problem after he was inspired by a kingfisher.#biomimicry #designthinking #ux
Read more at: https://t.co/MzROXEt3aV pic.twitter.com/2HZd9P8FIy— Black Bee (@BlackBeeCoIndia) June 27, 2021
(చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment