25 సెకన్లు ముందు.. రైల్వే క్షమాపణ.. | Japan Raiway Comany Apologised For Train Leaving 25 Seconds Early | Sakshi
Sakshi News home page

25 సెకన్లు ముందు.. రైల్వే క్షమాపణ..

Published Thu, May 17 2018 12:09 PM | Last Updated on Thu, May 17 2018 2:16 PM

Japan Raiway Comany Apologised For Train Leaving 25 Seconds Early - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టోక్యో, జపాన్‌ : రైలు అంటే కచ్చితంగా సమయానికి రాదని, ఆలస్యంగానే వస్తుందనే ఆలోచనకు మనం అలవాటు పడిపోయాం. గంటల తరబడి రైళ్లు ఆలస్యంగా నడవడం మనకు కొత్తేం కాదు. అయితే జపాన్‌లోని ఓ రైల్వే సంస్థ మాత్రం రైలు చెప్పిన సమయం కంటే 25 సెకన్లు ముందు బయల్దేరి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సదరు సంస్థ చాలా సీరియస్‌గా తీసుకుంది.

25 సెకన్లు ముందుగా బయల్దేరి వెళ్లడం వల్ల ఓ పాసింజర్‌ రైలును మిస్సయ్యారని పేర్కొంది. వినియోగదారుడికి కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, సంస్థ ఉద్యోగి చేసిన పొరబాటుకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించింది. రైలు మిస్సైన ప్రయాణీకుడు స్టేషన్‌ ఇన్‌చార్జ్‌కు ఫిర్యాదు చేశారని వివరించింది.

సిబ్బంది టైమ్‌టేబుల్‌ను సరిగ్గా చెక్‌ చేసుకోకపోవడంతోనే ఈ పొరపాటు చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. కాగా 25 సెకన్లు ముందుగా వెళ్లినందుకు తలెత్తిన అసౌకర్యానికి మన్నించాలంటూ సదరు రైల్వే సంస్థ ప్రకటన చేయడంతో ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. గతంలో జపాన్‌కు చెందిన ఓ రైల్లే సంస్థ కూడా ఇలానే రైలు 20 సెకన్లు ముందు బయల్దేరినందుకు క్షమాపణలు చెప్పిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement