ఒక్కరు కాదు... ఇద్దరు! | C. Kalyan is a movie sai dharam tej dual roll | Sakshi
Sakshi News home page

ఒక్కరు కాదు... ఇద్దరు!

Published Mon, Sep 4 2017 12:54 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

ఒక్కరు కాదు... ఇద్దరు!

ఒక్కరు కాదు... ఇద్దరు!

సాయిధరమ్‌ తేజ్‌ (తేజూ) హీరోగా  దర్శకత్వంలో సి. కల్యాణ్‌ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో ఒక్కరు కాదు... ఇద్దరున్నారని కృష్ణానగర్‌ కుర్రాళ్లు చెబుతున్నారు. ఒక హీరో తేజూ, మరొక హీరో ఎవరంటే... సాయిధరమ్‌ తేజే అంటున్నారు. దీని మీనింగ్‌ ఏంటంటే... ఈ సినిమాలో హీరోది డ్యూయల్‌ రోల్‌ అట! తేజూ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న మాట. అందులో ఓ గెటప్‌ యంగ్‌గా, మరో గెటప్‌ పెద్ద పెద్ద మీసాలతో ఉంటుందట.

నిజంగానే తేజూ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారా? లేదా తన పాత్రలో డ్యూయల్‌ షేడ్స్‌ ఉంటాయా? అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ తేజూ డ్యూయల్‌ రోల్‌ చేయలేదు. ఒకవేళ, వినాయక్‌ దర్శకత్వంలో డ్యూయల్‌ యాక్షన్‌ చేస్తున్నారనేది నిజమైతే... కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ చేస్తున్నట్టవుతుంది. హీరోతో డ్యూయల్‌ యాక్షన్‌ చేయించడం వినాయక్‌కు కొత్త కాదు. అందులో ఆయన ఎక్స్‌పర్ట్‌. ‘చెన్నకేశవరెడ్డి, అదుర్స్, నాయక్‌’ సినిమాల్లో హీరోల చేత ద్విపాత్రాభియనం చేయించారు. ‘అల్లుడు శీను’లో అయితే ప్రకాశ్‌రాజ్‌ చేత రెండు పాత్రలు చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement