VVV Vinayak
-
కృష్ణగాడి లవ్‌స్టోరీ
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాను పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్ కే శ్రీలత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేసి, ఆసక్తికరంగా ఉందన్నారు. ‘‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సాబు వర్గీస్ సంగీతం, ఎస్కే రఫి కెమెరా వర్క్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చుంచు భాను ప్రకాష్, హరిహర ప్రసాద్ పెట్లా. -
సప్తగిరితో స్నేహం కుదిరింది – సాయిధరమ్ తేజ్
హాస్యనటునిగా వెండితెరపై మంచి ప్రతిభ కనబరచి, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో కథానాయకుడిగా మారారు నటుడు సప్తగిరి. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై డా. రవికిరణ్ నిర్మిస్తున్నారు. బుల్గానిన్ స్వరకర్త. డిసెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. రెండో పాట ‘చేతి గాజల చప్పుడికే మనసే పతంగిలా ఎగిరే’ను హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్ మాట్లాడుతూ– ‘‘నా ‘తిక్క’ సినిమా సరిగా ఆడకపోయినా సప్తగిరితో మంచి స్నేహం కుదిరింది. తను హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ చుశాను. నచ్చింది. రెండో పాట విజువల్‌గా బాగుంది. సప్తగిరి డ్యాన్సులు అదరగొట్టాడు. ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. బుల్గానిన్ మంచి సంగీతం ఇచ్చారు. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సాయిధరమ్ తేజ్ మా పాటను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు సప్తగిరి. ‘‘మా సినిమాలోని సాంగ్‌ను రిలీజ్ చేసినందుకు తేజ్‌కు థ్యాంక్స్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
ఒక్కరు కాదు... ఇద్దరు!
సాయిధరమ్ తేజ్ (తేజూ) హీరోగా దర్శకత్వంలో సి. కల్యాణ్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో ఒక్కరు కాదు... ఇద్దరున్నారని కృష్ణానగర్ కుర్రాళ్లు చెబుతున్నారు. ఒక హీరో తేజూ, మరొక హీరో ఎవరంటే... సాయిధరమ్ తేజే అంటున్నారు. దీని మీనింగ్ ఏంటంటే... ఈ సినిమాలో హీరోది డ్యూయల్ రోల్ అట! తేజూ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న మాట. అందులో ఓ గెటప్ యంగ్‌గా, మరో గెటప్ పెద్ద పెద్ద మీసాలతో ఉంటుందట. నిజంగానే తేజూ డ్యూయల్ రోల్ చేస్తున్నారా? లేదా తన పాత్రలో డ్యూయల్ షేడ్స్ ఉంటాయా? అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ తేజూ డ్యూయల్ రోల్ చేయలేదు. ఒకవేళ, వినాయక్ దర్శకత్వంలో డ్యూయల్ యాక్షన్ చేస్తున్నారనేది నిజమైతే... కెరీర్లో ఫస్ట్‌టైమ్ చేస్తున్నట్టవుతుంది. హీరోతో డ్యూయల్ యాక్షన్ చేయించడం వినాయక్‌కు కొత్త కాదు. అందులో ఆయన ఎక్స్పర్ట్. ‘చెన్నకేశవరెడ్డి, అదుర్స్, నాయక్’ సినిమాల్లో హీరోల చేత ద్విపాత్రాభియనం చేయించారు. ‘అల్లుడు శీను’లో అయితే ప్రకాశ్‌రాజ్ చేత రెండు పాత్రలు చేయించారు.