
‘‘నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉన్నారు. కానీప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో 27 మంది సభ్యులు ఉన్నారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాఫియాగా మారింది. గుత్తాధిపత్యం వల్ల పరిశ్రమ నాశనమవుతోంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ ఆరోపణలు చేశారు. నేడు నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షడు సి. కల్యాణ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘అందరూ ఒకే తాటిపై ఉండాలని ఆరంభం అయిన ఆర్గనైజేషన్ చిన్నగా ఎల్‌ఎల్‌పీగా మారి అది కాస్తా ‘గిల్డ్’గా మారింది. గిల్డ్ ఏంటి?ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏంటి? రెండింటినీ కలిపేయొచ్చు కదా అని చాలామంది అంటున్నారు.
కలపడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. ఇక్కడంతా మోనోపలి అయ్యింది. వారే హీరోలు, వారే డిస్ట్రిబ్యూటర్స్, వారివే థియేటర్స్.. ఇలా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కల్యాణ్ లీడ్ చేస్తే మంచే జరుగుతుంది అనే నమ్మకం కలిగితే మా ఫ్యానల్‌కు ఓటు వెయ్యండి’’ అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కల్యాణ్ పోటీపడటంలేదు. నిర్మాతల మండలి తరఫున అధ్యక్ష పదవికి పి. కిరణ్ పోటీలో ఉన్నారు.ఈ ఎన్నికలపై ‘దిల్’ రాజు స్పందిస్తూ – ‘‘ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న నిర్మాతలు ఉన్న ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్’ని గెలిపించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ ఫ్యానెల్ తరఫున అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment