మహేశ్‌బాబు
బాల నటుడిగా ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డబుల్ యాక్షన్ చేశారు మహేశ్‌బాబు. హీరోగా మారిన తర్వాత పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేయలేదాయన. కానీ త్వరలోనే స్క్రీన్‌పై మహేశ్‌ను రెండు పాత్రల్లో చూడబోతున్నాం అని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో మహేశ్‌బాబు రెండు పాత్రల్లో కనిపిస్తారని టాక్. అందులో ఒక పాత్ర గ్యాంగ్‌స్టర్‌గా ఉంటే మరోటి ప్రొఫెసర్ పాత్ర అని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment