‘కియారా అనే నేను’ అంటూ ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు కథానాయిక కియారా అద్వానీ. గత ఏడాది ‘వినయ విధేయ రామ’లో కనిపించారు. ఈ ఉత్తరాది భామకు దక్షిణాదిన మంచి మార్కులే పడ్డాయి. అయితే ‘వినయ విధేయ...’ తర్వాత కియారా మరో తెలుగు సినిమా కమిట్ కాలేదు. కారణం హిందీలో నాలుగైదు సినిమాలు ఉండటమే. ఇప్పుడు కియారా ఓ తెలుగు సినిమా కమిట్ కాబోతున్నట్లు సమాచారం.
ఏ హీరో సినిమా ద్వారా అయితే తెలుగుకి పరిచయం అయ్యారో అదే హీరో సినిమాలో నటించబోతున్నారట. ‘భరత్ అనే నేను’లో మహేశ్‌బాబుకి జోడీగా కనిపించిన కియారా ఇప్పుడు ‘సర్కారువారి పాట’లోనూ మహేశ్ సరసన నటించబోతున్నారట. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలోని మహేశ్ ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదలైంది. మరి.. మహేశ్–కియారా జంట మళ్లీ తెర మీద కనబడుతుందా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment