
అంటూ విలన్ల తాట తీస్తున్నాడు రాజా. ఈ మాసీ ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలంటే మాత్రం బొమ్మ థియేటర్‌లో పడేంత వరకు ఆగాల్సిందే. రవితేజ హీరోగా వీఐ. ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో హీరో, విలన్లపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజ తండ్రీ కొడుకుగా కనిపిస్తారని సమాచారం. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని టెక్నికల్ అంశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సునీల్, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రామ్‌కీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రచన: అబ్బూరి రవి.
Comments
Please login to add a commentAdd a comment