రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లు కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘కాలం ఆగాలి నా కాలి వేగం చూసి .. లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి.. రమ్ పమ్ బమ్’ అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బప్పి లహరి, రవితేజ ఈ పాటను పాడారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. చిత్రదర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సినిమాలో రవితేజగారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం తమన్ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ‘రమ్ పమ్ బమ్’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ‘డిస్కోరాజా’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు.
‘‘ఈ చిత్రానికి మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఆల్రెడీ విడుదలైన ‘ఢిల్లీవాలా...’, ‘నువ్వు నాతో...’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ‘రమ్ పమ్ బమ్’ పాటను చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. ఇప్పుడు ఈ పాటను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తోన్న తీరు మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘రవితేజగారితో నేను కొంత గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ఇది. మా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవి్వస్తాయి. డైరెక్టర్ ఆనంద్‌గారు ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తీశారు. ప్రేక్షకులకు, అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు సునీల్. ‘‘రవితేజగారితో సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ ‘రమ్ పమ్ బమ్’ పాటలో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి’’ అన్నారు హీరోయిన్ నభా నటేష్.
Comments
Please login to add a commentAdd a comment