
‘medicine is changing The very nature of Nature.. మనమీ ప్రాజెక్టు చేయకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. వీడైతే నో రికార్డ్స్, నో రిపోర్ట్స్, నో రిలేటివ్స్, జీరో రిస్క్..’ అంటూ వెరీ స్టైలిష్‌గా మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా ‘డిస్కో రాజా’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 24న విడుదల కానున్న ఈ సినిమాలో రవితేజ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఆధారంగా దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. టీజర్‌లో రివీల్ అయిన రవితేజ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ రేకెత్తిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్. వెరీ స్టైలిష్‌గా రవితేజను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment