ఓ రాజకీయ నాయకుడితో గొడవ పడ్డారంట రవితేజ. దీంతో వారిద్దరి మధ్య వైరం మొదలైంది. ఆ నెక్ట్స్ ఆ రాజకీయ నాయకుడు వేసిన స్కెచ్‌కి దీటుగా ఓ యాక్షన్ రిప్లై ఇచ్చారట రవితేజ. రాజకీయ నాయకుడితో రవితేజ గొడవ ‘డిస్కోరాజా’ సినిమా కోసమే. ఆ గొడవకి కారణం ఏంటి? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం కొంత సమయం వేచి ఉండక తప్పదు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment