
రవితేజ
విలన్స్‌పై వీరవిహారం చేస్తున్నారు రాజా. తప్పు చేసిన వారి తుక్కు రేగ్గొడుతున్నారు. మరి.. రాజాకు కోపం వచ్చేలా విలన్స్ ఏం చేశారు? ఆ ఫైట్ విజువల్‌గా ఆడియన్స్‌కు ఎంత కిక్ ఇవ్వనుంది? అనే అంశాలను వెండితెరపై చూడాలి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ వంటి విభన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కోరాజా’.
రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దిలీప్ సుబ్రరాయన్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయిందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
Comments
Please login to add a commentAdd a comment