Fighting Scene
-
SSMB28 సెట్లో అడుగు పెట్టిన మహేశ్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్‌కు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఆయన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందండంతో SSMB28 షూటింగ్ వాయిదా పడింది. ఇదే గ్యాప్‌లో న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడు. ఇటీవల వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన మహేశ్ SSMB28 మూవీ షూటింగ్ సెట్లో అడుగుపెట్టాడు. ఈ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్‌ను జరుపుకుంటుందట. ఈ షెడ్యూల్లో మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్లాన్ చేశాడట తివిక్రమ్. ఇక మూవీకి రామ్-లక్ష్మణ్ ఫైట్స్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తుండగా ఈ తాజా షెడ్యూల్లో వారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో 2 వారాల పాటు ఈ యాక్షన్స్ సీక్వెన్స్‌ను వారు చిత్రీకరించనున్నారట. కాగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది అగష్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
Viral Video: కోడి vs కుక్క " బిగ్ ఫైట్ "
-
చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తున్న హీరోలు!
చోలీ కే పీచే క్యా హై అంటే... చోలీ మే దిల్ హై మేరా అన్నారు మాధురీ దీక్షిత్. ‘ఖల్ నాయక్’లోని ఈ పాట చాలామంది దిల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు... ‘చొక్కా కే పీచే క్యా హై’ అని మన హీరోలను అడిగితే... చొక్కా మే ప్యాక్ హై మేరా అంటారేమో. కథ డిమాండ్ చేస్తే ఆరు పలకలు.. ఎనిమిది పలకల దేహంతో ఫ్యాన్స్ దిల్ని ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు హీరోలు. షర్ట్‌లెస్‌గా కనిపించనున్నారు.. రండి... సిక్స్ ప్యాక్ చూద్దాం. ఫైట్ సీన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకుల శాతం ఎక్కువే ఉంటుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్ యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. వీటికోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతారు. కొందరు హీరోలు అవసరమైతే సిక్స్ ప్యాక్ చేస్తారు. చొక్కా విప్పి, ఆ ప్యాక్‌ని చూపిస్తారు. ఒక సినిమాలో కనిపించి, మరో సినిమాలో కూడా షర్ట్‌లెస్‌గా కనిపించాలంటే ‘సై’ అంటారు. ‘టెంపర్’ చిత్రంలో షర్ట్‌లెస్‌గా సిక్స్ ప్యాక్‌తో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లో షర్ట్‌లెస్‌గా కనిపించిన దృశ్యాలు ఈ చిత్రం ట్రైలర్లో కనిపించాయి. ఇక ఇదే చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్‌చరణ్ ‘ధృవ’లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లోనూ అలా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (జనవరి 7న) విడుదల కావాల్సింది. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక ‘అర్జున్‌రెడ్డి’లో కొన్ని సీన్స్‌లో చొక్కా లేకుండా కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ‘లైగర్’ కోసం బాక్సర్‌గా సిక్స్‌ప్యాక్‌తో రెడీ అయ్యారు. ఇటీవల విడుదలైన ‘లైగర్’ గ్లింప్స్ వీడియోలో విజయ్ షర్ట్‌లెస్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ‘లైగర్’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పటివరకు లవర్‌బాయ్‌లా కనిపించిన అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం కోసం ఒక్కసారిగా మాస్ లుక్‌లోకి మారిపోయారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాది కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో అఖిల్ సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపిస్తారు. ఇక హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్100’లోనే సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించారు కార్తికేయ. ఆ చిత్రం తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. తాజాగా అజిత్ హీరోగా చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘వలిమై’లో కార్తికేయ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కార్తికేయ ఓ ఫైట్‌లో సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లుగా కార్తికేయ సోషల్ మీడియాలో చొక్కా లేకుండా షేర్ చేసిన ఫొటో ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ హీరోలే కాదు.. మరికొందరు కూడా షర్ట్లెస్కి సై అంటున్నారు. మళ్లీ అలా కనిపిస్తారా డ్యూడ్... సిక్స్ ప్లస్ కటౌట్ ఉన్న ప్రభాస్ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తే.. ‘వావ్ డ్యూడ్’ అంటారు. ‘మిర్చి’ లో ప్రభాస్ కటౌట్ మీద ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ కూడా ఉందిగా. ‘బాహుబలి’లో తన కటౌట్‌ని చూపించారు ప్రభాస్. మరోసారి చొక్కా లేకుండా కనిపించే అవకాశం ఉంది. తాజా చిత్రం ‘ఆదిపురుష్’లో రాముడి పాత్ర చేస్తున్నారు ప్రభాస్. రాముడంటే చొక్కా లేకుండా కనబడతారు కదా.. సో.. మరోసారి ప్రభాస్ కటౌట్‌ని చూడొచ్చన్న మాట. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇట్స్ ఫైటింగ్ టైమ్
విలన్స్‌పై వీరవిహారం చేస్తున్నారు రాజా. తప్పు చేసిన వారి తుక్కు రేగ్గొడుతున్నారు. మరి.. రాజాకు కోపం వచ్చేలా విలన్స్ ఏం చేశారు? ఆ ఫైట్ విజువల్‌గా ఆడియన్స్‌కు ఎంత కిక్ ఇవ్వనుంది? అనే అంశాలను వెండితెరపై చూడాలి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ వంటి విభన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దిలీప్ సుబ్రరాయన్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయిందని తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
నడిరోడ్డుపై ఫైటింగ్ సీన్
తన్నుకున్న రెండు గ్యాంగ్‌లు తలలపై పగిలిన సోడాసీసాలు ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించిన పోలీసులు కరీమాబాద్‌లో ఘటన కరీమాబాద్, న్యూస్‌లైన్ : నగరంలోని కరీమాబాద్ దసరారోడ్డులో రామస్వామి హోటల్ వద్ద రెండు గ్యాంగ్‌లకు చెందిన ఎనిమిది మంది నడిరోడ్డుపై కొట్టుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ సినిమాలో ఫైటింగ్ సీన్‌ను తలపించింది. స్థానికులు, మిల్స్‌కాలనీ పోలీ సుల కథనం ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన కోతి సురేష్, జి. కార్తీక్, సురేందర్, భరత్‌తో కూడిన ఒక గ్యాంగు, ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ పున్నం, రంజిత్, సురేష్‌తోపాటు మరొకరు ఉన్న మరో గ్యాంగ్ పరస్పరం స్థానిక రామస్వామి హోటల్ గల్లీ నుంచి దసరా రోడ్డు వరకు ఖాళీ సోడా సీసాలు, థమ్సప్ సీసాలతోపాటు ఫ్యాన్ రాడ్లతో సుమారు పావుగంటకుపైగా కొట్టుకున్నారు. దీంతో ఇరువర్గాల తలలు, చేతులకు గాయాలయ్యాయి. కోతి సురేష్‌కు చెంది న గ్యాంగ్ సభ్యులు పున్నం గ్యాంగ్ పై దాడి చేయడంతో గొడవ బాగా ముదిరిందని స్థానికులు చెబుతున్నా రు. ఈ రెండు వర్గాలు సుమారు ఫర్లాంగు దూరం వరకు కొట్టుకుంటూ వస్తుండడంతో స్థానికులు, బాటసారులు భయభ్రాంతులకు గురయ్యారు. నడిరోడ్డుపై వీరంగం చేసుకుంటూ ఒకరిపైఒకరు దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందారు. అసలు వారు ఎందుకు కొట్టుకుంటున్నారో.. అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఇంతలో సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ ఎస్సై కృష్ణకుమార్ సిబ్బందితో చేరుకుని గాయాలపాలైన కోతి సురేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన మిగతా రెండు వర్గాలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా దాడికి పాల్పడ్డ కోతి సురేష్‌పై పోలీస్‌స్టేషన్‌లో చాలా కేసులు ఉన్నట్లు మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. పోలీస్టేషన్ పరిధిలోని కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట, నానమియాతోట, సాకరాసికుంట, రైల్వేగేటు, ఉర్సు బొడ్రాయి, చమ న్, ఉర్సుగుట్ట తదితర ప్రాంతాల్లో సాయంత్రమైందంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్యాంగ్‌లుగా ఏర్పడ్డ యువత ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తుండడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీ సులు శాంతిభద్రతల విషయంలో కఠిన చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రచారంలో ఫైటింగ్ సీన్
నడిరోడ్డుపై తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ యువసేన కన్వీనర్ వర్సెస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎమ్మెల్యే కవిత ఎదుటే బాహాబాహీ అడ్డుకున్న శ్రీరాంభద్రయ్య, భరత్‌చందర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు కేసముద్రం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఎన్నికల వేళ మరోసారి భగ్గుమన్నాయి. మొదటి నుంచి ఒకరికొకరు పోటీపడుతూ ప్రచారంలో పాల్గొంటున్న ఇద్దరు నాయకుల మధ్య వివాదం చివరికి తన్నులాటకు దారితీసింది. సాక్షాత్తు ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి ఎదుట ఈ ఫైటింగ్ జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాహుల్ యువసేన మండల కన్వీనర్ చిలువేరు సమ్మయ్యగౌడ్ ఎమ్మెల్యే కవిత ప్రచారానికి తన అనుచరులతో బైక్‌ర్యాలీతో హాజరయ్యాడు. అలాగే కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోతు దస్రూనాయక్ కూడా ప్రచారంలో పాల్గొన్నాక కేసముద్రంవిలేజ్లోని ఓ నాయకుడి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పార్టీశ్రేణులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటకు సమ్మయ్యగౌడ్‌ను పిలిపించి తన గ్రామానికి చెందిన తన వ్యతిరేకులను నువ్వు ఎలా ప్రచారానికి పిలుస్తావని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోతూ దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటే సమ్మయ్యగౌడ్పై చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి కంగుతిని ఘర్షణను అడ్డుకున్నారు. కంటతడి పెట్టిన సమ్మయ్యగౌడ్‌ను బుజ్జగించి, కారులో తీసుకుని బయల్దేరారు. విషయం తెలుసుకున్న సమ్మయ్యగౌడ్ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. శ్రీరాంభద్రయ్య, భరత్‌చందర్‌రెడ్డి కారులో తమతోపాటు సమ్మయ్యగౌడ్‌ను కూర్చొబెట్టుకుని ఆయనకు సర్ధిచెపుతూ అక్కడున్న దస్రూను కూడా కారులోకి రమ్మని పిలిచారు. ప్రచార వాహనం నుంచి కారు వద్దకు వెళ్తున్న దస్రూనాయక్ను వెంబడించిన సమ్మయ్య అనుచరులు తీరా కారు డోర్ తీస్తుండగానే దస్రూపై మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడున్న నాయకులు ఎందరు అడ్డుకున్నా వారు ఆగలేదు. పరిస్థితి చేయి దాటుతుండడంతో కారులో నుంచి ఇద్దరు నాయకులు దిగి రెండు వర్గాల నాయకులను చెరోవైపు చెదరగొట్టారు. స్థానికుల విస్మయం.. ఓట్లడగడానికి వచ్చిన నాయకులు ఇలా కొట్టుకుంటున్నారేమిటంటూ అక్కడున్న ప్రజలు విస్మ యం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలా క్రమశిక్షణ లేకుం డా ముందుకెళితే పరిస్థితి చేయిదాటుతుందంటూ మరికొందరు నాయకులు వాపోయారు. కాంగ్రెస్ శ్రేణుల్లో విబేధాలు తరచూ రచ్చకెక్కుతుండడం ఎమ్మెల్యే కవితకు తలనొప్పిగా మారింది. -
కత్తిలాంటి కళ!
సినిమాలో ఫైటింగ్ సన్నివేశం వచ్చిందంటే మనకి చెమటలు పట్టేస్తాయి. ఫ్యాక్షన్ సినిమాలైతే ... కత్తులతో పొడుచుకోవడం, గొడ్డళ్లతో నరుక్కోవడం. అవన్నీ డమ్మీ ఆయుధాలన్న సంగతి మరిచిపోతుంటాం. వాటిని నిజమైన ఆయుధాల్లా తీర్చిదిద్దిన కళాకారుల నైపుణ్యం అది. కత్తి, గొడ్డలి, బల్లెం, రాడ్... అన్నీ డమ్మీవే. ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ రవీంద్రరెడ్డిని పలకరిస్తే వీటికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిదే ట్రెండ్... సినిమాల్లో ఫైటింగ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఒకప్పుడు ఆయుధం లేకుండా పాతికమంది విలన్లని చితక్కొట్టడం హీరో ప్రత్యేకత. దశాబ్దం క్రితం పరిచయమైన ఫ్యాక్షన్ ఫైటింగ్‌ల వల్ల డమ్మీ ఆయుధాలకు గిరాకీ పెరిగింది. శివ సినిమాలో హీరో ఆయుధం సైకిల్ చైన్... అక్కడి నుంచి హీరో చేతిలో ఏదో ఒకటి వెరైటీ ఆయుధం ఉండటం ట్రెండ్‌గా మారింది. కత్తులు, గొడ్డళ్లతో సరిపెట్టకుండా రాజమౌళి వంటి దర్శకులు కొత్తరకం ఆయుధాలకు తెరతీశారు. ఆయుధాలకు సంబంధించి బాగా పేరు తెచ్చిన సినిమాలు ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న... ఇంకా చాలా ఉన్నాయి. చూడ్డానికి నిజమైనవాటిలా కనిపించే ఆ ఆయుధాల వెనుక చాలా శ్రమ దాగి ఉంది. మూడు రకాలు... డమ్మీ ఆయుధాలకు వాడే మెటీరియల్‌లో ముఖ్యమైంది లెటెక్స్. ద్రవరూపంలో ఉండే ఈ మెటీరియల్‌ని పైపూతగా వాడతారు. ఆయుధాల రూపంలో మలచడానికి హోమ్షీట్, రబ్బర్షీట్, సాఫ్ట్బోర్డు, థర్మోకోల్ని వాడతారు. ‘‘హీరో చేతిలో ఉండే కత్తిని తయారుచేయాలంటే ముందు పేపర్‌పై ఆకారాన్ని గీసుకుని, దానికి తగ్గట్టు మూడు రకాల షీట్లను కట్ చేసుకుని, కత్తిలా ఉండే రూపం ఇస్తాం. ఆ తర్వాత రంగు వేసి పైన నున్నగా కనిపించడానికి లెటెక్స్ పూస్తాం. ఇలా గొడ్డలి, రాడ్లు, ఊచలు, గునపాలు, బల్లెం... ఫైటింగ్ సీన్లో ఏ యే ఆయుధాలు అవసరమో అన్నీ చేస్తాం. అయితే ఎక్కువగా వాడే ఆయుధం మధ్యలో విరిగిపోతే ఇబ్బంది కాబట్టి, అదనంగా నాలుగైదు చేసి పెట్టుకుంటాం. అలాగే లాంగ్షాట్కి, క్లోజప్ షాట్‌కి వేరువేరు ఆయుధాలు తయారుచేస్తాం. లాంగ్షాట్కి తక్కువరకం మెటీరియల్ వాడినా సరిపోతుంది. క్లోజప్‌లో కనిపించే ఆయుధాలకు ఖర్చు ఎక్కువవుతుంది’’ అంటూ డమ్మీ ఆయుధాల వెనుక తమ కృషిని గురించి చెప్పారు రవీంద్రరెడ్డి. ఆయుధాలకు సంబంధించి ఎన్నెన్నో విషయాలు వివరించారు ఈ ఆర్ట్ డెరైక్టర్. సినిమాల్లో కనిపించే అబద్ధపు ఆయుధాల వెనకున్న కృషికి నిజమైన సాక్ష్యాలు ఇక్కడ ఇచ్చిన బొమ్మలు. - భువనేశ్వరి