SSMB 28: Mahesh Babu shoot resumes, action sequences to be shot for 2 weeks - Sakshi
Sakshi News home page

Mahesh Babu: యాక్షన్‌ మోడ్‌లో మహేశ్‌.. SSMB28 సెట్‌లో సూపర్‌ స్టార్‌ సందడి!

Published Thu, Jan 19 2023 9:09 AM | Last Updated on Thu, Jan 19 2023 10:43 AM

SSMB28: Mahesh Babu Resume Shoot, Action Sequences Shot for 2 Weeks - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్‌కు లాంగ్‌ గ్యాప్‌ వచ్చింది. ఆయన తండ్రి, సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి చెందండంతో SSMB28 షూటింగ్‌ వాయిదా పడింది. ఇదే గ్యాప్‌లో న్యూ ఇయర్‌ సందర్భంగా మహేశ్‌ ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడు. ఇటీవల వెకేషన్‌ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన మహేశ్‌ SSMB28 మూవీ షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టాడు.

ఈ తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్‌ను జరుపుకుంటుందట. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్లాన్‌ చేశాడట తివిక్రమ్‌. ఇక మూవీకి రామ్-లక్ష్మణ్‌ ఫైట్స్‌ మాస్టర్స్‌గా వ్యవహరిస్తుండగా ఈ తాజా షెడ్యూల్‌లో వారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రామ్‌-లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో 2 వారాల పాటు ఈ యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను వారు చిత్రీకరించనున్నారట. కాగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది అగష్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement