టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు.
(ఇది చదవండి: ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి)
అయితే ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది బిగ్‌బాస్ సోహెల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాఫ్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఇటీవలే రిలీజైన మహేశ్ బాబు గుంటూరు కారం సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల చిత్రమైనా.. గుంటూరు కారం సినిమా అయిన ఇదే జరుగుతుందన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు స్టార్‌డమ్‌కు తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. కథను బేస్ చేసుకునే సినిమాలు తీయాలి. అంతేకానీ స్టార్‌డమ్‌ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment