సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా మరో వివాదంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఈ మూవీ కథని ఓ నవల నుంచి కాపీ కొట్టారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో విడుదలకు ముందే మరోసారి ఈ మూవీ చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? 'గుంటూరు కారం' రిలీజ్ సంగతేంటి?
మహేశ్-త్రివిక్రమ్ అంటే బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు. వీళ్లిద్దరూ కలిసి చేసిన 'అతడు', 'ఖలేజా'.. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఆ తర్వాత మాత్రం కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. అలా ఇప్పుడు 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలైనప్పటికీ.. హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్స్, పాటలపై.. ఇలా చాలా మార్పులతో ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధమైంది.
(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)
జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న 'గుంటూరు కారం' సెన్సార్.. తాజాగా పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని అన్నారు. అదే టైంలో ఈ చిత్రానికి.. యద్దనపూడి సులోచనరాణి 'కీర్తి కిరీటాలు' అనే నవలకు దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది థియేటర్లలోకి మూవీ వస్తే గానీ తెలియదు.
ఇకపోతే గతంలోనూ త్రివిక్రమ్ సినిమాలపై ఇలా కాపీ కామెంట్స్ వినిపించాయి. 'అఆ' సినిమాని కూడా యద్దనపూడి 'మీనా' నవల ఆధారంగా తీశారని అన్నారు. ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మహేశ్ సినిమాకు 'కీర్తి కిరీటాలు' నవలకు సంబంధం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం రిలీజ్ తర్వాత వివాదం లాంటిది ఏమైనా జరగొచ్చు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే 'గుంటూరు కారం' రిలీజ్ కావాల్సిందే.
(ఇదీ చదవండి: గురూజీ త్రివిక్రమ్ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్ పూనమ్ కౌర్)
Comments
Please login to add a commentAdd a comment