Ram Lakshman
-
ఏ పనికి వెళ్లినా రామలక్ష్మణులను తలుచుకోవాలి
-
రామ్- లక్ష్మణ్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు రామ్- లక్ష్మణ్. సినీ పరిశ్రమలో బీజీగా ఉండే వారిద్దరు ఖాళీ టైమ్ దొరికితే చాలు సొంత గ్రామమైన చీరాల చేరుకుంటారు . అక్కడ వారు సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ బ్రదర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చీరాలలో ఉండే 'కోటయ్య వృద్ధాశ్రమం' కోసం ఈ బ్రదర్స్ జోలి పట్టి బిక్షాటన చేశారు. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) వృద్ధాశ్రమానికి ఒక ఆటో అవసరం కావడంతో చీరాలలోని ప్రధాన రహాదారుల్లో బిక్షాటన చేసి.. ప్రజలు నుంచి నగదు సేకరించారు. వచ్చిన డబ్బుతో పాటు వారు కూడా కొంత డబ్బును కలిపి ఆశ్రమానికి అందించారు. అదేంటి..? సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారు కదా? సొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా? ఇదంతా ఎందుకు అని ప్రశ్నించే వారికి ఇలా సమాధానం చెప్పారు. 'ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాము.'మానవసేవే మాధవసేవ' అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి.అపుడే సమాజం బాగుంటుంది' అని అన్నారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు. వారు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ.. ఫ్యాన్స్‌తో పాటు పలువురు షోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
SSMB28 సెట్లో అడుగు పెట్టిన మహేశ్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్‌కు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఆయన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందండంతో SSMB28 షూటింగ్ వాయిదా పడింది. ఇదే గ్యాప్‌లో న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడు. ఇటీవల వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన మహేశ్ SSMB28 మూవీ షూటింగ్ సెట్లో అడుగుపెట్టాడు. ఈ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్‌ను జరుపుకుంటుందట. ఈ షెడ్యూల్లో మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్లాన్ చేశాడట తివిక్రమ్. ఇక మూవీకి రామ్-లక్ష్మణ్ ఫైట్స్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తుండగా ఈ తాజా షెడ్యూల్లో వారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో 2 వారాల పాటు ఈ యాక్షన్స్ సీక్వెన్స్‌ను వారు చిత్రీకరించనున్నారట. కాగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది అగష్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
వీరసింహారెడ్డిలో ఆ సీన్ చూస్తే కంటతడి పెట్టాల్సిందే
ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు’అని యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ అన్నారు. ఈ సోదర ద్వయం తాజాగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా తాజాగా రామ్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్ గా ఉండడం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. ►ఫైట్‌కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు చైర్ లో కూర్చుని ఉంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్ లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ లో వున్న మ్యాజిక్. ►వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవి .. ఇంటర్వెల్ లో సడన్ గా రెండు గన్స్ పట్టుకొని స్టయిలీష్ గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి- శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ►వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ చేయడానికి మాకు 15 రోజులు పట్టింది. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఎన్ని రోజులైన అనుకున్నది సాధించే వరకూ పని చేయాల్సిందే. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. ఖర్చు గురించి వెనకాడరు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలని నిర్మిస్తారు. ► వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది. -
రాజమౌళి సినిమాలో పని చేస్తే గుర్తింపు రాదు: రామ్-లక్ష్మణ్
ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగధీరతో పాటు రాజమౌళి తెరకెక్కించిన పలు సినిమాలకు రామ్-లక్ష్మణ్‌లు ఫైట్ మాస్టర్స్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి సినిమాకు పని చేసినా పేరు రాదంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమాలో ఫైట్ మాస్టర్స్‌గా చేసిన వారెవరికి అంతగా గుర్తింపు ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తన సినిమాల ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలన్ని కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. 70 శాతం స్టంట్స్ కూడా రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తాడు. దీంతో స్టంట్స్ తామే సొంతంగా చేసినా కూడా ఆ ఫీలింగ్ ఉండదని తెలిపారు. తమకే కాదు.. రాజమౌళి సినిమాలకు ఎవరు పని చేసినా కూడా స్టంట్స్ విషయంలో మాస్టర్స్‌కు పెద్దగా పేరు రాదు.. క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్తుందని’ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే జక్కన్న సినిమాకు పని చేయడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, అయితే ఆయన సినిమాలకు పని చేయాలంటే ఒకేసారి 40 నుంచి 60 రోజుల వరకు డేట్స్ ఇవ్వాలన్నారు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు సిద్ధంగా ఉండాలని, టైం లేదు, ఇప్పుడు కుదరదు అనే మాటలు చేబితే ఆయనకు అసలు నచ్చదని చెప్పారు. డేట్స్ ఎక్కువగా ఇవ్వలేకపోవడమే వల్ల తాము బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేయలేకపోయామన్నారు. ఆర్ఆర్ఆర్లోనూ ఇంటర్వెల్ ఫైట్ 10 రోజులు చిత్రీకరించామని, చరణ్‌కు దెబ్బ తగడంతో ఆ మూవీ షూటింగ్ 40 రోజులు అయిపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకోక తప్పలేదన్నారు. కాగా రాజమౌళి సినిమాలో పనిచేసేందుకు ఇతర పరిశ్రమ వాళ్లు ఆసక్తిగా ఉంటారనే విషయం తెలిసిందే. తమిళ, కన్నడతో పాటు బాలీవుడ్ నటీనటులు జక్కన సినిమాలో ఓ చిన్న పాత్ర చేసిన చాలు అనుకుంటున్నారు. అందుకే ఆయన సినిమాలో చిన్న పాత్ర చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. బాహుబలి సినిమాలో కేవలం 10 నిమిషాలు కూడా లేని అస్లాం ఖాన్ పాత్ర సుదీప్ లాంటి స్టార్ హీరో చేశాడంటే రాజమౌళి క్రేజ్ ఎంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తన పాత్ర 15 నిమిషాలే అయినప్పటికి స్టార్ హీరోయిన్ అలియా భట్ లాంటి వారు అంగీకరించారంటే దానికి కారణంగా రాజమౌళి. అలాంటే దర్శక ధీరుడిపై రామ్-లక్ష్మణ్‌లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్
-
ఒంగోలులో సందడి చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్
-
ఆడియో ఫంక్షన్లో ఉదయభానుకి ‘పంచ్’
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద చిత్రం ఆడియో ఫంక్షన్లో యాంకర్ ఉదయభానుకు అదిరిపోయే పంచ్ ఇచ్చారు ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో అనేక మంది గౌతమ్ నంద చిత్రీకరణ సమయంలో తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే.. ఫైట్ మాస్టర్లు రామ్ లక్షణ్ లను కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ కాసింత ఎక్కువగానే చెప్పింది హోస్ట్ ఉదయభాను. అయితే.. స్టేజ్ పైకి రాగానే ఉదయభాను ఇచ్చిన బిల్డప్ అంతా తుస్సుమనిపించేశారు రామ్ లక్ష్మణ్ లు. 'మా గురించి ఉదయభాను గారు చాలా చెప్పింది. కానీ అదంతా నిజం కాదు. ఏదో మా మీద అభిమానం కొద్దీ అలా చెప్పిందంతే' అంటూ అంతటి పొగడ్తలకు తాము అర్హులం కామని.. అవన్నీ అవసరం లేదని చెప్పారు. అంతలోనే తన మాటలను కంటిన్యూ చేస్తూ.. 'ఒకటి అడగాలి.. నువ్వు వస్తేనే బ్రైట్.. ఇక ఇలాంటి బ్రైట్ చీర కట్టుకు వస్తే కుర్రోళ్ల పరిస్థితేంటి ఇక' అనేశాడు ఈ ఫైట్ మాస్టర్. దీంతో కాసింత సిగ్గు పడిపోయిన ఈ సీనియర్ యాంకర్.. రెండు మూడేళ్లుగా గ్యాప్ తాను కనిపించలేదని.. చాలామంది కనిపించాల్సిందిగా అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అయినా సరే ఈ టాపిక్ వదిలిపెట్టని యాక్షన్ మాష్టర్లు.. 'మా ఫేవరేట్ హీరోయిన్ ఉదయభాను.. మేం హీరోలుగా నటించిన ఖైదీ బ్రదర్స్ లో హీరోయిన్ గా నటించింది. ఆ అభిమానంతో మమ్మల్ని కాసింత ఎక్కువగా పొగిడిందంతే' అని చెప్పేసి అప్పటి కాలంలో తమ హీరోయిన్ కాబట్టే.. ఇప్పుడు తమకు ఓవర్ గా బిల్డప్ ఇస్తోందని చెప్పేశారు రామ్ లక్షణ్. -
జోలి కట్టుకుని భిక్షాటన చేస్తాం: రామ్‌లక్ష్మణ్
వెయ్యి సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పనిచేశారు. ఐదు సినిమాల్లో హీరోలుగా నటించారు. ఐదు పర్యయాలు నంది అవార్డులు తీసుకున్నారు. అయినా వారిలో ఓ విధమైన నిరాశనే ఉండేది. అలాంటి దశలోనే వృద్ధులకు, అనాథ పిల్లలకు, నిస్సహాయయులకు చేయూతను అందిస్తే... అన్న ఆలోచన వారిలోని మానవత్వాన్ని తట్టిలేపింది. అంచలంచెలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అక్కడ వారికి దొరికిన ఆనందం... ఆత్మ సంతృప్తి మరెక్కడా దొరకలేదు. దీంతో అపన్నులను ఆదుకోవడమే తమ జీవిత గమ్యంగా మార్చుకున్నారు. ఆ దిశగా అనంతపురానికి వచ్చి సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణలో నిమగ్నమయ్యారు. వారే ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్. సాక్షి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ వచ్చారు. అవి ఏమిటో చూద్దామా... సాక్షి : సినీ ఫీల్డ్ నుంచి ఇటువైపు రావాడానికి కారణం? రామ్‌లక్ష్మణ్ : ఇప్పటికే చాలామంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు, నిస్సహాయకులకు చేయూతను అందించాలని మాలో మేమే కలలుకంటుండే వాళ్లం. ఆ కలలు సాకారం చేసుకునేందుకు చాల కష్టపడ్డాం. ప్రస్తుతం ఆచరణలో పెడుతున్నాం. సాక్షి : హీరో మహేష్‌బాబులా అనంతపురంలో ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారా? రామ్‌లక్ష్మణ్ : గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేష్‌బాబు వెనుక హీరో ‘సూపర్‌స్టార్’ కృష్ణ ఉన్నారు. మా వెనుక ఎవరూ లేరు. రామ్‌కు లక్ష్మణ్, లక్ష్మణ్‌కు రామ్ తప్పా. అనాథలకు చేయూతను అందించాలనే ధృడమైన సంకల్పం మాలో ఉంది. అదే ముందుకు నడిపిస్తోంది. సాక్షి : జిల్లాలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు? రామ్‌లక్ష్మణ్ : మా గురువు బిక్షుమయ్య ఆదేశాల మేరకు నార్పల మండలంలోని శ్రీసత్యసాయి అనాథ పిల్లల విద్యాలయానికి చేయూతను అందిస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న ఈ విద్యాలయానికి ప్రస్తుతం మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యాం. నాలుగు రోజులుగా అదేపనిలో ఉంటున్నాం. సాక్షి : మీకు వచ్చే రెమ్యూనిరేషన్‌తో సేవా కార్యక్రమాలు చేయడం కష్టమేమో? రామ్‌లక్ష్మణ్ : మాకు వచ్చే రెమ్యూనిరేషన్‌తో ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాం. పేదలకు సహాయం చేయాలనే సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. వారి కోసం జోలి కట్టుకుని భిక్షాటన చేస్తాం. వచ్చే నెల అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, వచ్చిన సొమ్మును అనాథ ఆశ్రమాలకు అందించి ఆ పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాం. సాక్షి : చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం... రామ్‌లక్ష్మణ్ : నేటి సమాజంలో మనుషులు ఎదిగే కొద్ది వారిలో అదే స్థాయిలో స్వార్థం పెరిగిపోతోంది. ఎంత సంపాదించినా వెనుక తీసుకెళ్లేది ఏముంది? మంచి చెడు తప్పా. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడి ఆధ్యాత్మికతతో కూడిన సేవా భావం అలవర్చుకుని పేదలకు చేయూతను అందించేందుకు ముందుకు రావాలి. -
‘సినిమా డే’ ఉండాలి!
‘‘మదర్స్ డే, ఫాదర్స్ డేలా ‘సినిమా డే’ అని ఒక రోజుని కేటాయించాలి. ఆ రోజున చిత్రసీమలో ఉన్న 24 శాఖలకు సంబంధించినవాళ్లు ఒకే రకమైన దుస్తులు ధరించి, వేడుక చేసుకోవాలి’’ అని ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ అన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఈ ఇద్దరూ మాట్లాడుతూ - ‘‘ఫైటర్లుగా ఇండస్ట్రీకి వచ్చి, ఫైట్ మాస్టర్లుగా ఎదిగాం. ఎంతో ఇచ్చిన సినిమా పరిశ్రమకు ఏమిచ్చాం? అని ఆలోచించుకుంటే.. ఏమీ లేదనిపించింది. ఆ ఫీలింగ్లోంచి వచ్చిన ఆలోచనే ‘సినిమా డే’. కుల, మతాలకు అతీతంగా భాషా భేదం లేకుండా కళామతల్లి అందర్నీ ఆదరిస్తోంది. అలాంటి తల్లిని గౌరవించు కోవడం కోసం ప్రత్యేకంగా ఒక్క రోజు కూడా లేదు. అందుకే సినీ పెద్దలంద రూ ఆలోచించి ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
ఆ నిధులు అంతే...!
గతేడాది ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులపై సంక్షేమ సలహాదారు రామలక్ష్మణ్ హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమానికి సంబంధించి గతేడాది ఖర్చు కాకుండా మిగిలిపోయిన ఉప ప్రణాళిక నిధులను మరుసటి ఏడాదికి బదిలీ చేయడం జరగదని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ సలహాదారు ఎ.రామలక్ష్మణ్ తెలిపారు. గ్రామజ్యోతి, తదితర కార్యక్రమాల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లిస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ... ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించరాదని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో ఆయా సంక్షేమ పథకాలకు నిధుల కొరత తలెత్తుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో వివిధ సంక్షేమశాఖల అధికారులు డా.ఎం.వి.రెడ్డి, జయరాజ్, దశరథ్నాయక్లతో కలసి రామలక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కుంటుపడుతున్నాయంటూ పత్రిక ల్లో కథనాలు రావడం బాధకలిగిస్తోం దని అన్నారు. దళితులకు భూ పంపిణీ పథకాన్ని అమలుచేస్తున్నామని, ఇప్పటివరకు 1,300 మందికి 3,600 ఎకరాల మేర పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-16కు సంబంధించి 80 శాతం రాయితీతో రుణాలు ఇవ్వనున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయన్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ఎస్సీ అమ్మాయిల పెళ్లి కోసం రూ.105 కోట్లు, ఎస్టీ అమ్మాయిల వివాహాల కోసం రూ.62 కోట్ల మేర ఖర్చుచేశామని తెలియజేశారు.