టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఫైట్ మాస్టర్స్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు రామ్- లక్ష్మణ్. సినీ పరిశ్రమలో బీజీగా ఉండే వారిద్దరు ఖాళీ టైమ్ దొరికితే చాలు సొంత గ్రామమైన చీరాల చేరుకుంటారు . అక్కడ వారు సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ బ్రదర్స్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చీరాలలో ఉండే 'కోటయ్య వృద్ధాశ్రమం' కోసం ఈ బ్రదర్స్ జోలి పట్టి బిక్షాటన చేశారు.
(ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి)
వృద్ధాశ్రమానికి ఒక ఆటో అవసరం కావడంతో చీరాలలోని ప్రధాన రహాదారుల్లో బిక్షాటన చేసి.. ప్రజలు నుంచి నగదు సేకరించారు. వచ్చిన డబ్బుతో పాటు వారు కూడా కొంత డబ్బును కలిపి ఆశ్రమానికి అందించారు. అదేంటి..? సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారు కదా? సొంత డబ్బు ఇస్తే సరిపోతుంది కదా? ఇదంతా ఎందుకు అని ప్రశ్నించే వారికి ఇలా సమాధానం చెప్పారు. 'ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. అందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టాము.'మానవసేవే మాధవసేవ' అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి.అపుడే సమాజం బాగుంటుంది' అని అన్నారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు. వారు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ.. ఫ్యాన్స్‌తో పాటు పలువురు షోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
(ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment