వరద బాధితులకు అండగా తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ | Tollywood Tv Producers Association Help For Flood Victims In Telugu States | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు అండగా తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్

Sep 13 2024 10:25 AM | Updated on Sep 13 2024 10:41 AM

Tollywood Tv Producers Association Help For Flood Victims In Telugu States

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సాయం అందిస్తున్నారు. విరాళాలు సేకరించి వరద బాధతుల సహాయార్థం అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ నుంచి ప్రముఖ సినీతారలు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ, తెలంగాణ వరద బాధతుల కోసం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. తమవంతు సాయంగా అసోసియేషన్ తరఫున విరాళాలు సేకరించి రెండు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో  సమావేశం ఏర్పాటుచేశారు.  ఈ కార్యక్రమంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నాయకులంతా పాల్గొన్నారు.

తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు మాట్లాడుతూ' వరదల కారణంగా తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. మా అసోసియేషన్ తరపున వీలైనంత ఆర్థిక సాయం చేయాలని భావించాం. రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు మీకు తోచినంత విరాళం ఇవ్వాలని మా సభ్యులను కోరాం. వాళ్లంతా స్పందించారు. ఈ డబ్బుకు మరికొంత మా అసోసియేషన్ ఫండ్ నుంచి కలిపి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తాం' అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement