Mahesh Babu Wife Namratha Helps A Poor Student For Studies, Deets Inside - Sakshi
Sakshi News home page

Namratha: గొప్ప మనసు చాటుకున్న నమ్రతా.. విద్యార్థినికి సాయం

Published Fri, Mar 10 2023 8:12 PM | Last Updated on Fri, Mar 10 2023 9:14 PM

mahesh Babu Wife Namratha Helps A poor student - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో మహేశ్‌ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మహేశ్ బాబు సమాజసేవలోనూ ముందున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిన్నారులకు గుండె ఆపరేషన్ల కోసం అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా నమ్రతా శిరోద్కర్ తన ఉదారతను చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఓ పేద విద్యార్థినికి అండగా నిలిచారు. ఏవియేషన్ చదువుకునేందుకు ల్యాప్ టాప్ అందించారు. బాగా చదువుకుని మీ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని నమ్రతా విద్యార్థికి సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

దీంతో నెటిజన్ల నుంచి మహేశ్‌, నమ్రతలకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ సందర్బంగా నమ్రతా సాయంపై ఏవియేషన్ విద్యార్థి, ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. నా చదువుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న మహేశ్  బాబు ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటానని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement