Mahesh Babu Attends Party With Family And Shares Images In Social Media, Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu: పార్టీలో మహేశ్‌ సందడి.. అందానికి ఆధార్‌ కార్డులా ఏమున్నాడ్రా బాబూ!

Published Tue, Jun 6 2023 11:01 AM | Last Updated on Tue, Jun 6 2023 11:40 AM

Mahesh Babu Attends Party with Family and Share Photos - Sakshi

మహేశ్‌ ఈ పేరు వింటే వెబ్రేషన్స్‌.. ఆయన ఒక్క స్మైల్‌ ఇచ్చాడంటే అమ్మాయిల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఇప్పటికీ అందాన్ని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకుంటున్న ఈ సూపర్‌స్టార్‌ ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం ఒక్క మహేశ్‌ బాబుకే చెల్లుతుంది. తాజాగా అతడు ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడు. భార్య నమ్రత, కూతురు సితారతో పాటు ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.

'వాట్‌ ఎ ఫన్‌ నైట్‌' అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇందులో మహేశ్‌ స్మైల్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 'ఏ యాంగిల్‌లో చూసినా అందంగా ఉండేది నువ్వే బ్రో..', 'ఏమున్నాడ్రా మా అన్నయ్య..', 'అందానికి ఆధార్‌ కార్డులా ఉన్నాడు మా బాబులకే బాబు మహేశ్‌బాబు' అని కామెంట్లు చేస్తున్నారు. అటు నమ్రత కూడా పార్టీకి సంబంధించిన మరిన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. 'మా ఫ్రెండ్స్‌ అందరినీ కలిశాం.. పార్టీ ఎంత బాగా జరిగిందో.. నా కూతురితో కలిసి ఇలా పార్టీకి వెళ్లడం బహుశా ఇదే తొలిసారి. తన తండ్రిలాగే తను కూడా ఎంత అల్లరి చేసిందో' అని రాసుకొచ్చింది. ఈ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు.

ఇక మహేశ్‌బాబు విషయానికి వస్తే గతేడాది సర్కారువారి పాట సినిమాతో సక్సెస్‌ అందుకున్నాడు. గుంటూరు కారంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. మహేశ్‌బాబుతో చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

చదవండి: ఇండియాలో టాప్‌ 50 వెబ్‌ సిరీస్‌లు ఇవే, టాప్‌ 5లో ఏమున్నాయంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement