Sitara Insta Income: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే? | Mahesh Babu Daughter Sitara Ghattamaneni Instagram Income Details - Sakshi
Sakshi News home page

Sitara Instagram Income: తండ్రి రూట్‌లోనే కూతురు.. ఇన్‌స్టా ద్వారా అంత సంపాదిస్తోందా?

Published Mon, Jan 22 2024 6:49 PM | Last Updated on Mon, Jan 22 2024 8:14 PM

Mahesh Babu Daughter Sitara Income Details Via Social Media - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పగానే అందరికీ సినిమాలు గుర్తొస్తాయి. కానీ కొందరికి మాత్రం అతడిలో అసలైన బిజినెస్‌మ్యాన్ గుర్తొస్తాడు. ఎందుకంటే మూవీ అంటే మహా అయితే సంవత్సరానికి ఒకటి చేస్తాడు. కానీ అదే టైంలో యాడ్స్, బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోలిస్తే యాడ్స్‌లో మహేశే ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఇతడి రూట్‌లోనే కూతురు సితార కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ సినిమాల్లోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మహేశ్ కూతురు సితార మాత్రం పుట్టినప్పటి నుంచే మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈమె ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు టీనేజీలోకి వచ్చిన తర్వాత సితార మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

గతంలో ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్‌లో కనిపించిన సితార.. 'సర్కారు వారి పాట' సినిమాలోని ఓ పాటలో డ్యాన్సులతో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇన్ స్టాలో ఈమెకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలానే యూట్యూబ్ ఛానెల్‌లోనూ 10 వేల మంది వరకు సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రాండ్స్, ప్రమోషన్స్ లాంటివి చేస్తూ మంచిగా సంపాదిస్తోంది.

గతేడాది ఓ జ్యూవెల్లరీ యాడ్‌లో సితార యాక్ట్ చేసినందుకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సితార సంపాదన విషయమై కొన్ని నంబర్స్ వినిపిస్తున్నాయి. నెలకు ఏకంగా రూ.30 లక్షల వరకు వెనకేసుకుంటోందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement