టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్లో మహేశ్‌బాబు-నమ్రత జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్-నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తొలిసారి తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. ఈ ఇంటర్య్వూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సందర్భంగా పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ తమ పెళ్లికి ముందే మహేశ్ ఓ కండిషన్ పెట్టాడంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అనంతరం మహేశ్‌తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని చెప్పిన నమ్రత.. సితార అన్‌ప్లాన్డ్ బేబీ అని చెప్పి షాకిచ్చింది. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమోనని నమ్రత పేర్కొంది. అలాగే గౌతమ్ పుట్టిన సమయంలో కఠిన పరిస్థితులు చూశామని, 8 నెలల్లోనే గౌతమ్ పుట్టడంతో బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారంటూ నమ్రత ఎమోషనల్ అయ్యింది.
చదవండి:
సావిత్రి గురించి జెమిని గణేశన్ ఇచ్చిన ప్రకటన చూసి చాలా బాధపడ్డాను సీనియర్ నటి ఝాన్సీ
అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య
Comments
Please login to add a commentAdd a comment