మహేశ్‌ ఇంట్లో కొత్త అతిథి, ఫోటో షేర్‌ చేసిన నమ్రత | Mahesh Babu Wife Namrata Shirodkar Welcomes New Member to Her Family; Post Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌ కొత్త ఫ్యామిలీ మెంబర్‌ను చూశారా? వెల్‌కమ్‌ చెప్తూ నమ్రత పోస్ట్‌

Published Sat, Sep 9 2023 4:12 PM | Last Updated on Sat, Sep 9 2023 5:06 PM

Mahesh Babu Wife Namrata Shirodkar Welcomes New Member to Her Family; Post Viral - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇంట్లోకి కొత్త అతిథి వచ్చేశారు. వస్తూనే మహేశ్‌ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. సితారతో ఆడుకునేందుకు తాను రెడీ అంటున్నారు. ఇంతకీ ఎవరా అతిథి అనుకుంటున్నారా? స్నూపీ.. మహేశ్‌ భార్య నమ్రత కొత్తగా ఓ కుక్కపిల్లను తీసుకొచ్చింది. దానికి స్నూపీ అని పేరు పెట్టుకుంది. ఇటీవలే వీరి ఇంట్లోని ప్లూటో అనే కుక్క చనిపోయిన సంగతి తెలిసిందే! ఆ బాధ నుంచి బయటపడేందుకు మరో కొత్త కుక్కపిల్లను తెచ్చుకున్నారన్నమాట!

ఈ విషయాన్ని నమ్రత సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నిన్ను ప్లూటోనే మా దగ్గరకు పంపించింది. ఓవైపు ఒక కుక్కపిల్లను కోల్పోయామన్న బాధ.. మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమించబోతున్నామన్న సంతోషం.. నిన్ను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం స్నూపీ.. నిన్ను మరింత ప్రేమిస్తాం అంటూ కొత్తగా తీసుకొచ్చిన కుక్కపిల్ల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆ పప్పీ ఎంత అమాయకంగా చూస్తోందో అని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే మహేశ్‌బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్‌ హీరో.. పెళ్లికూతురు ఎవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement