ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుంచో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు’అని యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ అన్నారు. ఈ సోదర ద్వయం తాజాగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా తాజాగా రామ్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
►చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్ గా ఉండడం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది.
►ఫైట్‌కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు చైర్ లో కూర్చుని ఉంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్ లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ లో వున్న మ్యాజిక్.
►వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవి .. ఇంటర్వెల్ లో సడన్ గా రెండు గన్స్ పట్టుకొని స్టయిలీష్ గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి- శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
►వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ చేయడానికి మాకు 15 రోజులు పట్టింది. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఎన్ని రోజులైన అనుకున్నది సాధించే వరకూ పని చేయాల్సిందే. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. ఖర్చు గురించి వెనకాడరు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలని నిర్మిస్తారు.
► వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment