గుంటూరు కారం మూవీ.. ప్రిన్స్ రెమ్యునరేషన్‌ అంత తక్కువా? | Guntur Kaaram Movie Mahesh Babu Remuneration Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Guntur Kaaram Movie: మహేశ్ బాబు 'గుంటూరు కారం'.. రెమ్యునరేషన్‌పై షాక్‌లో ఫ్యాన్స్‌!

Jan 12 2024 6:14 PM | Updated on Jan 12 2024 7:01 PM

Guntur Kaaram Movie Mahesh Babu Remunaration Goes Viral - Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఈ సినిమా అభిమానులు ఆశించినా స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కొందరు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: 'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!)

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలువురు స్టార్‌ హీరోలు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం చిత్రానికి మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. 

అయితే మహేశ్‌ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే గుంటూరు కారం సినిమాకు తక్కువగానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ షాకవుతున్నారు. తమ అభిమాన హీరో తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. 

(ఇది చదవండి: గుంటూరు కారం రిలీజ్‌.. ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement