'గుంటూరు కారం' క్రేజీ సాంగ్.. ఇలా కూడా వాడేస్తున్నారా? | Mahesh Babu Guntur Kaaram Kurchi Song Played In US Gym, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Guntur Kaaram Song: 'కుర్చీని మడతబెట్టి సాంగ్'.. అక్కడ ఇంత క్రేజ్ ఏంటి బ్రో!

Published Thu, Feb 8 2024 7:32 PM | Last Updated on Fri, Feb 9 2024 6:50 AM

Mahesh Babu Guntur Kaaram Movie Song Video Goes Viral - Sakshi

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్‌ సంగీతమందించారు.

అమెరికాలోనూ తగ్గని క్రేజ్..

అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. 'కుర్చీని మడతబెట్టి' అనే పాట చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఈ సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరేమో. అంతలా వైరలైంది గుంటూరు కారం సినిమాలోని పాట. ఇప్పుడు ఇండియాలోనే కాదండోయ్.. కుర్చీ  సాంగ్ ఫీవర్ కాస్తా అమెరికాకు చేరింది. ఏకంగా ఈ పాటకు స్టెప్పులు వేయడమే కాదు.. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్ ప్లే అవుతుండగా ట్యూన్‌కు తగ్గట్టుగా వర్కవుట్‌ చేస్తూ కనిపించారు. కుర్చీని మడతపెట్టి.. వార్మప్ అంటూ ఎంజాయ్ చేస్తోన్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement