
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గతేడాది సంక్రాంతికి అభిమానులను అలరించాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‍లో మూవీ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఊపేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను అలరించింది.
అయితే సినిమా రిలీజైన ఏడాది దాటిపోయినా కుర్చీని మడతపెట్టి సాంగ్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా నేపాల్‌లో ఈ పాటకు ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు పక్కన యువతులు గుంటూరు కారం సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా నేపాల్‌లోని ఓ కళాశాలలో స్టూడెంట్స్ సైతం కుర్చినీ మడతపెట్టి అనే సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాట అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది.
#KurchiMadathapetti Mania in NEPAL ❤️🔥
Global sensation @urstrulyMahesh - @MusicThaman 🥁 #MaheshBabu | #GunturKaaram pic.twitter.com/mfJcQurGrS— VardhanDHFM (@_VardhanDHFM_) January 22, 2025