గ్లోబల్‌ రేంజ్‌లో మహేశ్‌.. ఆఫ్రికాలో 'కుర్చీని మడతపెట్టి'న చిన్నారులు | Guntur Kaaram Song Trend In Global Market | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ రేంజ్‌లో మహేశ్‌.. ఆఫ్రికాలో 'కుర్చీని మడతపెట్టి'న చిన్నారులు

Apr 15 2024 2:09 PM | Updated on Apr 15 2024 3:51 PM

Guntur Kaaram Song Trend In Global Market - Sakshi

త్రివిక్రమ్‌- మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ చిత్రం 'గుంటూరు కారం'. సినిమా విషయంలో మొదట నెగటివ్‌ టాక్‌ వచ్చినా లాంగ్‌ రన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా రూ. 175 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 

ఇందులోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌ లక్షల వ్యూస్‌తో రికార్డులు సృష్టించడమే కాకుండా సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. మహేశ్ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. ఇది విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు  ఆఫ్రికన్ పిల్లలు స్టెప్పులు వేశారు.

కొద్దిరోజుల క్రితం అమెరికాలో నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ గేమ్స్‌ జరుగుతుండగా.. ఆట  మధ్యలో ఏర్పాటుచేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్స్ ఈ పాటకు డ్యాన్స్ వేశారు. దానిని చూసిన ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లల అదిరిపోయే డ్యాన్స్‌తో తాజాగా కుర్చీ మడతపెట్టేశారు. స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ వారు ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ పాటకు థమన్‌ అందించిన మ్యూజిక్‌కు తమదైన శైలిలో చక్కగా డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement