నడిరోడ్డుపై ఫైటింగ్ సీన్ | The median of the road Fighting Scene | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై ఫైటింగ్ సీన్

Published Sat, Jun 7 2014 3:14 AM | Last Updated on Sat, Aug 25 2018 6:09 PM

The median of the road Fighting Scene

  •      తన్నుకున్న రెండు గ్యాంగ్‌లు
  •      తలలపై పగిలిన సోడాసీసాలు
  •      ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  •      కరీమాబాద్‌లో ఘటన
  • కరీమాబాద్, న్యూస్‌లైన్ : నగరంలోని కరీమాబాద్ దసరారోడ్డులో రామస్వామి హోటల్ వద్ద రెండు గ్యాంగ్‌లకు చెందిన ఎనిమిది మంది నడిరోడ్డుపై కొట్టుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘర్షణ సినిమాలో ఫైటింగ్ సీన్‌ను తలపించింది. స్థానికులు, మిల్స్‌కాలనీ పోలీ సుల కథనం ప్రకారం..

    కరీమాబాద్‌కు చెందిన కోతి సురేష్, జి. కార్తీక్, సురేందర్, భరత్‌తో కూడిన ఒక గ్యాంగు, ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ పున్నం, రంజిత్, సురేష్‌తోపాటు మరొకరు ఉన్న మరో గ్యాంగ్ పరస్పరం స్థానిక రామస్వామి హోటల్ గల్లీ నుంచి దసరా రోడ్డు వరకు ఖాళీ సోడా సీసాలు, థమ్సప్ సీసాలతోపాటు ఫ్యాన్ రాడ్‌లతో సుమారు పావుగంటకుపైగా కొట్టుకున్నారు.

    దీంతో ఇరువర్గాల తలలు, చేతులకు గాయాలయ్యాయి. కోతి సురేష్‌కు చెంది న గ్యాంగ్ సభ్యులు పున్నం గ్యాంగ్ పై దాడి చేయడంతో గొడవ బాగా ముదిరిందని స్థానికులు చెబుతున్నా రు. ఈ రెండు వర్గాలు సుమారు ఫర్లాంగు దూరం వరకు  కొట్టుకుంటూ వస్తుండడంతో స్థానికులు, బాటసారులు భయభ్రాంతులకు గురయ్యారు. నడిరోడ్డుపై వీరంగం చేసుకుంటూ ఒకరిపైఒకరు దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందారు.

    అసలు వారు ఎందుకు కొట్టుకుంటున్నారో.. అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఇంతలో సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ ఎస్సై కృష్ణకుమార్ సిబ్బందితో చేరుకుని గాయాలపాలైన కోతి సురేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన మిగతా రెండు వర్గాలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా  దాడికి పాల్పడ్డ కోతి సురేష్‌పై పోలీస్‌స్టేషన్‌లో చాలా కేసులు  ఉన్నట్లు మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.
     
    పోలీస్టేషన్ పరిధిలోని కరీమాబాద్, ఎస్‌ఆర్‌ఆర్ తోట, నానమియాతోట, సాకరాసికుంట, రైల్వేగేటు, ఉర్సు బొడ్రాయి, చమ న్, ఉర్సుగుట్ట తదితర ప్రాంతాల్లో సాయంత్రమైందంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్యాంగ్‌లుగా ఏర్పడ్డ యువత ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తుండడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీ సులు శాంతిభద్రతల విషయంలో కఠిన చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement