కావలి: వావివరుసలు మరచిన ఓ మృగం.. తన కోరిక తీర్చలేదని వదిననే కడతేర్చి.. ఆపై అత్యాచారం చేసిన దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు పశ్చిమ బెంగాల్కు చెందిన శ్రీకాంత్ బిస్వాస్ కుటుంబం కావలిలో ఉంటోంది. శ్రీకాంత్ మొలల వ్యాధికి చికిత్స చేసే క్లినిక్ నిర్వహిస్తున్నాడు.
శ్రీకాంత్ బిస్వాస్‌తో పాటు ఆయన భార్య అర్పితా బిస్వాస్ (25), ఇద్దరు పిల్లలు, శ్రీకాంత్ తల్లిదండ్రులు, వరుసకు తమ్ముడ య్యే నయ బిస్వాస్ కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో అన్న భార్యపై కన్నేసిన నయ బిస్వాస్ తరచూ వదినను వేధిస్తుండడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. శ్రీకాంత్ బిస్వాస్ తల్లిదండ్రులు మంగళవారం తిరుమల వెళ్లారు. ఇంట్లో శ్రీకాంత్ బిస్వాస్, ఆయన భార్య, తమ్ముడు నయ బిస్వాస్, ఇద్దరు పిల్లలు నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. శ్రీకాంత్ బిస్వాస్ పూటుగా మద్యం సేవించి నిద్రపోయిన తరువాత నయ బిస్వాస్ వదిన గదిలోకి ప్రవేశించి కోరిక తీర్చాలని బెదిరించాడు.
ఆమె నిరాకరించడంతో ఇనుపరాడ్‌తో తలపై మోది హతమార్చాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని వంద మీటర్ల దూరంలో ఉన్న పంట కాలువలో పడేసి వచ్చాడు. ఉదయం నిద్రలేచిన శ్రీకాంత్ ఇంట్లో భార్య కనిపించకపోవడం, రక్తపు మరకలు ఉండడంతో.. స్థానికులతో కలసి సమీప ప్రాంతాల్లో వెతకగా పంట కాలువలో భార్య మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కావలి పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment