నెల్లూరు (లీగల్): బాలికతో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు పోతురాజు మీరయ్యకు జీవిత ఖైదు, రూ.20 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు మనుబోలు మండలం పిడూరుమిట్ట గ్రామానికి చెందిన పోతురాజు మీరయ్య చిల్లర అంగడి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన బాలిక అంగడికి వెళ్తున్నప్పుడు మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. బాధిత బాలిక 2022 జనవరి పన్నెండో తేదీన మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పోతురాజు మీరయ్యను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీïÙటు దాఖలు చేశారు. విచారణలో మీరయ్య నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment